• తాజా వార్తలు
  •  

మీ ఆండ్రాయిడ్ ఫోన్ సేఫా కాదా 5 స్టెప్పుల్లో తెలుసుకోండి ఇలా..

ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారా?  మీ ఫోన్ సెక్యూరిటీ ప‌రంగా ఎంత సేఫ్‌గా ఉంది అని ఎప్పుడైనా ఆలోచించారా? అస‌లు మీకు ఫోన్ అమ్మిన కంపెనీలు రెగ్యుల‌ర్‌గా మీ ఫోన్‌కు సెక్యూరిటీ అప్‌డేట్స్ రిలీజ్ చేయాల‌ని, కంపెనీలు అవేవీ ప‌ట్టించుకోకుండా మీ ఫోన్ భ‌ద్ర‌త‌ను, దానిలో ఉన్న మీ డేటా భ‌ద్ర‌త‌ను గాలికి వ‌దిలేస్తున్నాయ‌ని మీకు తెలుసా?  మీరు ఫోన్ కొన్న‌ప్ప‌టి నుంచి ఎన్ని సెక్యూరిటీ ప్యాచెస్ రిలీజ‌య్యాయి?  వాటిలో ఎన్నింటిని మీరు రిసీవ్ చేసుకున్నారు? వ‌ంటి వివ‌రాలు మీరు ఎప్పుడైనా చూసుకున్నారా? ఆ వివ‌రాల‌న్నీ మీకు చూపించి, మీ ఫోన్ సేఫోకాదో తెలుసుకోవ‌డానికి మీకు వీలు క‌ల్పిస్తోంది స్నూప్ స్నిచ్ (SnoopSnitch) యాప్‌.  దీనితో ఐదు స్టెప్స్‌లో మీ ఫోన్ సేఫో కాదో ఓ అంచ‌నాకు రావ‌చ్చు. 
 

ఎందుకీ సెక్యూరిటీ అప్‌డేట్స్‌? 
ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ల‌లో సెక్యూరిటీ కోసం గూగుల్ ఎప్ప‌టిక‌ప్పుడు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను  రిలీజ్ చేస్తుంది. ఆండ్రాయిడ్ ఫోన్ త‌యారీ కంపెనీల‌ను కూడా యూజ‌ర్ల‌కు ఎప్ప‌టిక‌ప్పుడు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను రిలీజ్ చేయ‌మ‌ని చెబుతుంటుంది. కానీ కంపెనీలు దీన్ని అంత సీరియ‌స్‌గా తీసుకోవ‌డం లేదు. సాధార‌ణంగా ఐవోఎస్ డివైస్‌లతో పోల్చితే ఆండ్రాయిడ్‌లో సెక్యూరిటీ త‌క్కువ‌.  హ్యాక‌ర్లు ఈజీగా యాక్సెస్ చేయ‌డానికి, ర్యాన్స‌మ్‌వేర్‌ల వంటి మాల్‌వేర్‌లు ఎటాక్ చేయ‌డానికి ఆండ్రాయిడ్ చాలా అనువుగా ఉంటుంది. అందుకే ఎప్ప‌టిక‌ప్పుడు సెక్యూరిటీ అప్‌డేట్స్ రిలీజ్ చేసి, వాటిని యూజ‌ర్ల‌కు తెలియ‌ప‌ర‌చ‌డం అవ‌స‌ర‌మ‌ని గూగుల్ ప‌దేప‌దే చెబుతోంది. అయితే సెల్‌ఫోన్ త‌యారీ కంపెనీలు ఫోన్లు త‌యారు చేసి అమ్ముకోవ‌డంలో చూపిన శ్ర‌ద్ధ త‌ర్వాత రెగ్యుల‌ర్‌గా అప్‌డేట్స్ ఇవ్వ‌డంలో చూపించ‌డం లేద‌ని సెక్యూరిటీ రీసెర్చ్ లాబ్స్ అనే జర్మన్ పరిశోధనా సంస్థ తేల్చిచెప్పింది.  గూగుల్, శాంసంగ్‌, హెచ్‌టీఎసీ లాంటి ప‌లు కంపెనీల‌కు చెందిన 1200 స్మార్ట్ ఫోన్ల‌ను ప‌రీక్షించి మరీ ఈ విష‌యాన్ని ప్ర‌క‌టించింది. వీటిలో సెక్యూరిటీ ప్యాచెస్ రాక‌పోవ‌డ‌మో లేదా దాన్ని యూజ‌ర్ వినియోగించుకోలేక‌పోవ‌డ‌మో జ‌రిగింద‌ని చెప్పింది. 

స్నూప్ స్నిచ్‌తో తెలుసుకోండి
1. ప్లేస్టోర్ నుంచి  SnoopSnitch యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి (అయితే మీ ఫోన్ ఆండ్రాయిడ్ ఓరియో 8.1 ఓఎస్‌తో ప‌ని చేస్తుంటే రిజ‌ల్ట్ అంత బాగా రాక‌పోవ‌చ్చు)

2. యాప్‌ను ఇన్‌స్టాల్ చేసి ఓపెన్ చేస్తే మీకు ఒక స్క్రీన్ కనిపిస్తుంది. 

3. ఆ స్క్రీన్‌లో క‌నిపించే Click here to test patch levelను క్లిక్ చేయండి.

4,. ఇప్పుడు మీరు త‌ర్వాత విండోలోకి వెళ‌తారు. అక్క‌డ క‌నిపించే Start test బ‌ట‌న్ నొక్కండి.  టెస్ట్ స్టార్ట‌వుతుంది. (ఈ టెస్ట్ ర‌న్న‌వ్వాలంటే ఫోన్‌కు ఇంట‌ర్నెట్ క‌నెక్ష‌న్ త‌ప్ప‌నిస‌రి) 

5. టెస్ట్ పూర్త‌వ‌గానే మీ స్క్రీన్ మీద రిజ‌ల్ట్ క‌న‌పిస్తుంది. సెక్యూరిటీ ప్యాచ్‌లు ఎన్ని వ‌చ్చాయి?  మిస్స‌యిన్ ప్యాచ్‌లు ఎన్ని?   సెక్యూరిటీ అప్‌డేట్స్ త‌ర్వాత ప్యాచ్ లెవెల్  ఎంత‌?  టెస్ట్ ఇన్‌క‌న్‌క్లూజివ్ అని రిజ‌ల్ట్ మొత్తం చూపిస్తుంది. 

చాలా కంపెనీలు మేం రెగ్యుల‌ర్‌గా సెక్యూరిటీ ప్యాచెస్ యూజ‌ర్ల ఫోన్ల‌కు పంపుతున్నామ‌ని చెబుతున్నాయి. మీ ఫోన్ త‌యారైన‌ప్ప‌టి నుంచి ఎన్ని ప్యాచ్‌లు మీకు వ‌చ్చాయో మీకు నెల‌వారీ రిపోర్ట్‌ను ఈ టెస్ట్ చూపిస్తుంది. దాన్ని బ‌ట్టి మీ ఫోన్ సేఫ్‌గా ఉందో లేదో మీరు ఒక అంచాన‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంది.

జన రంజకమైన వార్తలు