• తాజా వార్తలు
  •  

వాట్సాప్ వెబ్‌ యూసేజ్‌ను సుఖ‌మ‌యం చేసే 6 క్రోమ్ ఎక్స్‌టెన్ష‌న్లు మీకోసం.. 

వాట్సాప్ మొబైల్ యాప్‌తోపాటు వెబ్ యూసేజ్ కూడా బాగా పెరుగుతోంది. అయితే మొబైల్ యాప్‌లో ఉన్న‌న్ని సౌక‌ర్యాలు దీనిలో ఉండ‌వు అని అంద‌రూ అనుకుంటారు. అంత‌కంటే ఎక్కువ కుష‌న్ ఇచ్చే గూగుల్ క్రోమ్ ఎక్స్‌టెన్ష‌న్లు ఉన్నాయి. అవేంటో చూడండి.   
1.హైడ్ మీడియా 
ఈ క్రోమ్ ఎక్స్‌టెన్ష‌న్ యాడ్ చేసుకుంటే మీకు వ‌చ్చే ఇమేజ్‌లు, వీడియోలను హైడ్ చేయొచ్చు. వ‌ర్క్ ప్లేస్‌లో మీ వాట్సాప్‌ను వెబ్‌లో యూజ్ చేస్తున్న‌ప్పుడు మీకొచ్చే ఇమేజ్‌లు, వీడియోలు ప‌క్క‌వారికి క‌న‌ప‌డ‌కుండా చేయ‌డానికి ఇది ఉప‌యోగ‌ప‌డుతుంది.  
 2. వాట్సాప్ క‌ల‌ర్స్  
WhatsApp Colors and Features అనేది క్రోమ్ బ్రౌజ‌ర్‌కు మ‌రో ఫ్రీ ఎక్స్‌టెన్ష‌న్‌. దీన్ని యాడ్ చేసుకుంటే వాట్సాప్ వెబ్‌లో ప్ర‌తి ఎలిమెంట్‌కు కావ‌ల‌సిన క‌ల‌ర్ ఇచ్చుకోవ‌చ్చు. టెక్స్ట్‌ను కావ‌ల‌సిన క‌ల‌ర్‌లో సెట్ చేసుకోవ‌చ్చు.  
3. ఇన్‌కాగ్నిటో 
WhatsApp Web Incognito మ‌రో యూజ్‌ఫుల్ ఎక్స్‌టెన్ష‌న్‌. దీన్నియాడ్ చేసుకుంటే మీ లాస్ట్ సీన్ రివీల్ చేయ‌కుండా అవ‌త‌లి వ్య‌క్తి లాస్ట్ సీన్‌, మీరు పంపింది రీడ్ చేశారో లేదో తెలుసుకోవ‌చ్చు. అంతేకాదు స్పెసిఫిక్ టైం పీరియ‌డ్‌తో టైమ‌ర్‌ను సెట్ చేసుకుంటే మీరు వ‌చ్చిన మెసేజ్‌ను రీడ్ చేసిన‌ట్లు బ్లూ టిక్ కూడా చూపిస్తుంది.  ఈ టైంలోగా మీరు కావాలంటే ఆ మెసేజ్‌ను క్యాన్సిల్ చేయొచ్చు.  
 4.జాప్ 
వాట్సాప్‌వెబ్‌లో వాయిస్ క్లిప్స్ రెగ్యుల‌ర్‌గా యూజ్ చేసేవాళ్లు త‌ప్ప‌క యాడ్ చేసుకోవాల్సిన ఎక్స్‌టెన్ష‌న్ Zapp. క్రోమ్ టూల్‌బార్‌లో ఆ క్లిప్ పేస్‌, వాల్యూమ్‌ను ట్వీక్ చేస్తుంది. కాబ‌ట్టి మీరు వాయిస్ క్లిప్స్‌ను ఎలాంటి పాజ్‌లు లేకుండా వినొచ్చు.  
 5.వాటూల్ కిట్  
WAToolkit  అనేది మ‌రో ఫ్రీ ఎక్స్‌టెన్ష‌న్‌. మీ బ్రౌజ‌ర్‌లో యాక్టివ్ విండో లేక‌పోయినా వాట్సాప్ మెసేజ్‌లు పంప‌డానికి ఇది ఉప‌యోగ‌ప‌డుతుంది. మీ వాట్సాప్‌వెబ్‌లో ఎన్ని అన్‌రీడ్ మెసేజ్‌లున్నాయో కూడా ఇది ఐకాన్ ద్వారా చూపిస్తుంది. దీన్ని క్లిక్ చేసి ఆమెసేజ్‌లు చూడొచ్చు.  
6. వాట్స్‌డాక్ 
వాట్సాప్ బిజినెస్ యూజ‌ర్ల‌కు యూజ్‌ఫుల్ ఎక్స్‌టెన్ష‌న్ WhatsDock. మీ కాంటాక్ట్ లిస్ట్‌లో లేని నెంబ‌ర్ల‌కు డైరెక్ట్‌గా వాట్సాప్ మెసేజ్ పంప‌డానికి పనికొస్తుంది.  కాంటాక్ట్స్‌,  SumaCRM, ఇంట‌ర్‌కామ్‌ల‌ను ఇంటిగ్రేట్ చేసుకుని వాటి డేటా బేస్‌లో ఉన్న కాంటాక్ట్స్‌కి నేరుగా టెక్స్ట్ మెసేజ్‌లు పంపొచ్చు.  

జన రంజకమైన వార్తలు

విజ్ఞానం బార్ విశేషాలు