• తాజా వార్తలు
  •  

గూగుల్ ప్లే స్టోర్‌ను ఓ ఆటాడుకోవాల‌నుకుటున్నారా.. ఇవిగో ట్రిక్స్

గూగుల్ ప్లే స్టోర్‌లో వేల కొద్దీ   యాప్స్ ఉంటాయి.  వాటిలో చాలావ‌ర‌కు మనం ఎప్పుడో ఒక‌ప్పుడు చూస్తుంటాం. ఫీచ‌ర్లు,రేటింగ్స్ బాగుంటే... మ‌న‌కు అవ‌స‌రం అనుకుంటే వాటిలో కొన్నింటిని ఇన్‌స్టాల్ చేసుకుంటాం.  న‌చ్చ‌న‌ప్పుడు దాన్ని అన్ఇన్‌స్టాల్ చేస్తాం.  అంతేనా? అయితే మీరు ప్లే స్టోర్ గురించి తెలుసుకోవాల్సిన ట్రిక్స్   చాలా ఉన్నాయి. అవేంటో చూడండి.. చూసి వాడుకోండి.  
టెస్ట్ అండ్ రిఫండ్ యాప్స్‌
పెయిడ్ యాప్ లేదా గేమ్  కొన్నారు. అది బాగాలేకున్నా డ‌బ్బులు పెట్టాం క‌దా అని వాడుకోన‌క్క‌ర్లేదు. యాప్ లేదా గేమ్‌ మీకు న‌చ్చ‌క‌పోతే రెండు గంట‌ల్లోగా యాప్ ద్వారా  రీజ‌న్స్ చెప్పి రిఫండ్ అడ‌గొచ్చు. వెబ్‌సైట్‌లో అయితే 48 గంట‌ల వ‌ర‌కు టైం ఉంటుంది.  అనాథ‌రైజ్డ్ ప‌ర్చేజెస్ అయితే 65 రోజుల వ‌ర‌కు రిఫండ్‌కు టైమ్ ఉంటుంది.
సెర్చ్ యాప్స్ బై డెవ‌ల‌ప‌ర్ 
ప‌ర్టిక్యుల‌ర్ డెవ‌ల‌ప‌ర్ తీసుకొచ్చిన యాప్ కావాల‌ని మీరు అనుకుంటే pub:[developer’s name] modifier ను ఉప‌యోగించి యాప్స్‌ను ఫిల్ట‌ర్ చేయొచ్చు. అప్పుడు మీకు ఆ క‌న్‌స‌ర్న్ డెవ‌ల‌ప‌ర్ త‌యారుచేసిన యాప్స్ మాత్ర‌మే కనిపిస్తాయి.
 బీటా యాప్స్‌కు యాక్సెస్  
ప్లే స్టోర్‌లో కొత్త యాప్స్ వ‌చ్చిన‌ప్పుడు ముందు వాటిని బీటా యూజ‌ర్ల‌కు ఇచ్చి  టెస్ట్ చేశాక వాటిని అంద‌రికీ అందుబాటులోకి తెస్తారు. కొత్త యాప్‌ను అందరికంటే ముందే వాడాల‌ని మీకు అనిపిస్తే early access కోసం సెర్చ్ చేయండి. అలాంటివి ఉంటే మీరు కూడా బీటా యూజ‌ర్‌గా దాన్ని వాడొచ్చు. అయితే బీటా స్టేజ్‌లో ఉన్న యాప్స్ గ్లిచ్చీగా ఉండొచ్చు. వాటిలో బ‌గ్స్ ఉండొచ్చు.కొన్నిసార్లు క్రాష్ అయ్యే ప్ర‌మాదం కూడా ఉంది. అయినా కొత్త యాప్ ముందే వాడాల‌ని స‌ర‌దా మీకుంటే ప్రొసీడ్‌.
రిల‌వెంట్ యాప్ రివ్యూస్‌నే చూడండి  
యాప్ పేజీలోకి వెళ్లి రివ్యూస్ స్క్రోల్ డౌన్ చేస్తే రైట్ సైడ్‌లో ఉన్న ఆప్ష‌న్స్‌లో నుంచి Latest version only అనేది మాత్ర‌మే టూగుల్ చేయండి. అప్పుడు మీకు ఆ యాప్ పాత వెర్ష‌న్ రివ్యూస్ క‌న‌ప‌డ‌వు. దానివల్ల ఒక‌వేళ ఆ యాప్ పాత వెర్ష‌న్‌లో ఏమైనా ఇబ్బందులుంటే వాటిని గురించి మీరు ఆలోచించ‌క్క‌ర్లేదు.
రీజియ‌న్ బ్లాక్డ్ యాప్స్‌ను ఇన్‌స్టాల్ 
కొన్ని యాప్స్ కొన్ని ప్రాంతాల‌కే ప‌రిమితం. ఉదాహ‌ర‌ణ‌కు కొన్ని యాప్స్ యూఎస్‌లోని ఆండ్రాయిడ్ యూజ‌ర్ల‌కు మాత్రమే ఉండొచ్చు. ఇండియాలో ఉన్న మ‌నం వాటిని డౌన్‌లోడ్ చేసుకోలేం. వ‌ర్చువ‌ల్ ప్రైవేట్ నెట్‌వ‌ర్క్ (VPN) ను ఉప‌యోగించి ఇలాంటి రీజియ‌న్ బ్లాక్డ్ యాప్స్‌ను కూడా డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.   OpenVPN Connect ద్వారా మీరు ఏ వీపీఎన్ స‌ర్వ‌ర్‌కైనా క‌నెక్ట్ అవ్వ‌చ్చు.  అంటే మీరు యూఎస్‌లో ఉన్న వీపీఎన్ స‌ర్వ‌ర్‌కు క‌నెక్ట్ అయితే ఓన్లీ యూఎస్‌లో ఉండే యాప్స్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవ‌చ్చు. కానీ ఇవి పెయిడ్ వీఎన్‌ల‌యితే సేఫ్‌. కాన‌ప్పుడు వాటిని ట‌చ్ చేయ‌క‌పోవ‌డ‌మే బెట‌ర్‌.  
మీ యాప్స్ అన్నింటినీ ఒకేసారి రీఇన్‌స్టాల్ చేసుకోండి  
కొత్త డివైస్ మార్చిన‌ప్పుడ‌ల్లా యాప్స్ అన్నీ మ‌ళ్లీ ఇన్‌స్టాల్ చేసుకోవ‌డానికి ఇబ్బంది ప‌డుతున్నారా?   ఆ స‌మ‌స్యే లేదు. ప్లే స్టోర్ యాప్‌లోకి వెళ్లి  మెనూ బ‌ట‌న్ క్లిక్ చేయండి.   select My apps & gamesని సెలెక్ట్ చేయండి. లైబ్ర‌రీలోకి వెళితే మీరు ఇంత‌కుముందు డివైస్‌లో ఇన్‌స్టాల్ చేసుకున్న యాప్స్ అన్నీ క‌నిపిస్తాయి. వాటిని క్లిక్ చేస్తే ఆటోమేటిగ్గా డౌన్‌లోడ్ అవుతాయి.  
8. ఆటో అప్‌డేట్స్‌ను కొన్నింటికి డిసేబుల్ చేయండి  
కొన్ని యాప్స్ రెగ్యుల‌ర్‌గా అవ‌స‌రం లేక‌పోయినా ఎప్పుడో ఒక‌ప్పుడు అవ‌స‌ర‌మ‌వుతాయ‌ని అన్ఇన్‌స్టాల్ చేయ‌కుండా ఉంచుతాం. అలాంటి వాటికి రెండు, మూడు రోజుల‌కు ఓ అప్‌డేట్ వ‌స్తుంటే డేటా వేస్ట‌వ‌డమే కాదు చిరాకు కూడా పుడుతుంది.  ఈ స‌మ‌స్య‌ను క్లియ‌ర్ చేయాలంటే ప్ర‌త్యేకించి కొన్ని యాప్స్‌కు మాత్ర‌మే అప్‌డేట్స్ రాకుండా డిసేబుల్ చేసుకోవ‌చ్చు.  ప్లే స్టోర్‌లో యాప్ పేజీలోకి వెళ్లి  మెనూ బ‌ట‌న్‌ను టాప్ చేయండి.  రైట్ సైడ్ టాప్‌లో ఉన్న uncheck Auto-updateను క్లిక్ చేస్తే చాలు.
 యాప్ విష్ లిస్ట్ క్రియేట్ చేసుకోండి  
ఒక యాప్ డౌన్‌లోడ్ చేసుకుందామ‌ని ప్లే స్టోర్ ఓపెన్ చేస్తే  యాప్ అందుబాటులో లేదు. అలాంట‌ప్పుడు మీరు విష్‌లిస్ట్ ఫీచ‌ర్ వాడుకోవ‌చ్చు.  ప్లే స్టోర్‌లో యాప్ పేజీలోకి వెళ్లి బుక్ మార్క్ ఐకాన్‌ను టాప్‌లో ఉన్న ప్ల‌స్ సైన్‌తో టాప్ చేయండి. వెంట‌నే ఆ యాప్ మీ విష్‌లిస్ట్‌లో యాడ్ అవుతుంది. మీ విష్ లిస్ట్‌ను చూసుకోవాలంటే మెనూ బ‌ట‌న్‌ను క్లిక్ చేసి విష్ లిస్ట్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు కావాలంటే అందులో నుంచి ఏ యాప్‌ను అయినా రిమూవ్ కూడా చేసుకోవ‌చ్చు. 
కొత్త యాప్స్‌ను హోం స్క్రీన్‌కు యాడ్ కాకుండా చూడ‌డం  
కొత్త‌గా యాప్ డౌన్‌లోడ్ చేయ‌గానే అది వెంట‌నే వ‌చ్చి హోం స్క్రీన్ మీద ప్ర‌త్య‌క్ష‌మ‌వుతుంది. దాన్ని అక్క‌ణ్నుంచి రిమూవ్ చేసేవ‌ర‌కు హోం స్క్రీన్‌కు అడ్డంగా క‌నిపిస్తూనే ఉంటుంది. ఇలాకాకుండా ఉండాలంటే  ప్లే స్టోర్‌లోకి వెళ్లి మెనూ బ‌ట‌న్‌ను టాప్ చేసి సెట్టింగ్స్‌లోకి వెళ్లండి. దీనిలో జ‌న‌ర‌ల్ అనే సెక్ష‌న్‌లో  Add icon to Home screen. అనే ఆప్ష‌న్ ముందు ఒక టిక్ బాక్స్ ఉంటుంది. దాన్ని అన్ టిక్ చేయండి. అంతే మీరు డౌన్‌లోడ్ చేసిన యాప్ హోం స్క్రీన్ మీద‌కు  రాదు.
 

జన రంజకమైన వార్తలు