• తాజా వార్తలు

టిప్స్ అండ్ ట్రిక్స్‌: మీ కంప్యూట‌ర్‌లో ఎవ‌రైనా లాగిన్ అయితే మీ ఫోన్‌కు వార్నింగ్ రావాలా?

మ‌నం ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నా.. ఎంత‌గా యాంటీ వైర‌స్ సాఫ్ట్‌వేర్‌లు వాడినా.. మ‌న కంప్యూట‌ర్ సేఫ్ అని అనుకోవ‌డానికి వీల్లేదు. ప్ర‌తి రోజు కొత్త కొత్త ఆలోచ‌న‌ల‌తో హ్యాక‌ర్లు ఎప్పుడు దాడికి దిగుదామా అన్న‌ట్లు వెయిట్ చేస్తున్నారు. మ‌న కంప్యూట‌ర్ బ‌ల‌హీనంగా ఉండి.. పాస్‌వ‌ర్డ్ ర‌హితంగా ఉంటే ఇక ఇంతే సంగ‌తులు. అయితే ఎంత పాస్‌వ‌ర్డ్‌లు పెట్టుకున్నా.. అద‌న‌పు భ‌ద్ర‌త లేక‌పోతే మ‌న కంప్యూట‌ర్ ప‌ని గోవిందే. అయితే మ‌న పీసీలో ఎవ‌రైనా లాగిన్ అయితే మ‌న‌కు తెలిసిపోతే ఎంత బాగుంట‌ది క‌దా.. అయితే ఇప్పుడు అలాంటి సాఫ్ట్‌వేరే వ‌చ్చింది.

మీకు వార్నింగ్‌ ఎలా వ‌స్తుందంటే..
మీ పీసీలోకి మీకు తెలియ‌కుండా ఎవ‌రైనా లాగిన్ అయితే మీకు హెచ్చ‌రిక‌లు వ‌స్తాయి. మీ ఫోన్‌కు మెసేజ్ తో పాటు కాల్ కూడా వ‌స్తుంది. దీనికి ప్ర‌త్యేకించి ఏర్పాట్ల అవ‌స‌రం లేదు. మీకు తెలియ‌కుండా ఎవ‌రైనా లాగిన్ అయితే క‌మాండ్ లైన్‌లో మీ ఫోన్‌కు ఒక ఈమెయిల్‌ను పంపిస్తుంది. దీన్ని సెండ్ మెయిల్ అంటారు. 

ఫోన్‌కు ఈమెయిల్ రావ‌డం ఎలా?
ముందుగా మీరు సెండ్ మెయిల్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆ త‌ర్వాత దాన్ని జిఫ్ ఫైల్ లోకి ఎక్‌ట్రాక్ట్ చేసుకోవాలి. ఒక‌సారి ఇలా చేసిన త‌ర్వాత వెంట‌నే టాస్ షెడ్యుల‌ర్ అనే ఆప్ష‌న్‌ను సెర్చ్ చేయాలి. దాన్ని మీ పీసీలో ఓపెన్ చేయాలి. సెర్చ్ బార్‌లో టాస్క్ షెడ్యుల‌ర్ అనే ఆప్ష‌న్ కొట్ట‌గానే ఇది మీకు క‌నిపిస్తుంది. ఆ టాస్క్ షెడ్యుల‌ర్‌ను ఓపెన్ చేసిన దానిలో క్రియేట్ టాస్క్ ఆప్ష‌న్‌ను క్లిక్ చేయాలి.  క్లిక్ చేయ‌గానే ఒక కొత్త విండో ఓపెన్ అవుతుంది. జ‌న‌ర‌ల్ పేరుతో ఉన్న ట్యాబ్‌లో మీ కొత్త టాస్క్ ఎంట‌ర్ చేయాలి. ఆ త‌ర్వాత ర‌న్ వెద‌ర్ ది యూజర్ ఈజ్ లాగ్డ్ ఆన్ ఆర్ నాట్ ఆప్ష‌న్‌ను అనేబుల్ చేయాలి. 

న్యూ ట్రిగ్గ‌ర్‌
ఆ త‌ర్వాత న్యూట్రిగ్గ‌ర్ అనే ఆప్ష‌న్ మీద క్లిక్ చేయాలి. అది ఓపెన్ అయిన త‌ర్వాత న్యూ ట్యాబ్‌ను ఓపెన్ చేయాలి.  బిగిన్ ద టాస్క్ ఆనే ఆప్ష‌న్‌లో డ్రాప్ డౌన్‌ బాక్స్‌లో లాగ్ఆన్‌ను సెల‌క్ట్ చేయాలి. ఆ త‌ర్వాత ఎనీ యూజ‌ర్ ఆనే ఆప్ష‌న్ క క్లిక్ చేయాలి.  ఆ త‌ర్వాత కండిష‌న్స్ ట్యాబ్ మీద క్లిక్ చేసి
 స్టార్ట్ ద టాస్క్ ఓన్లీ ఇఫ్ ద కంప్యూట‌ర్ ఈజ్ ఆన్ ఏసీ ప‌వ‌ర్ ఆప్ష‌న్‌ క్లిక్ చేయాలి.  ఇప్పుడు ఎవ‌రైనా మీ సిస్ట‌మ్‌లోకి ఎంట‌ర్ అయితే మీరు ఒక మెయిల్ వ‌స్తుంది. జీమెయిల్ ఇందుకు స‌రైన ఆప్ష‌న్‌.

జన రంజకమైన వార్తలు