• తాజా వార్తలు

మ‌న పీసీలో ఎంత ఫ్రీ స్పేస్ ఉండాలి?

ప‌ర్స‌న‌ల్ కంప్యూట‌ర్ ఉంటే చాలు.. దానిలో మ‌నం అన్ని దాచేస్తాం. ఫొటోలు, వీడియోల‌తో పాటు వంద‌ల ఫైల్స్‌తో నింపేస్తాం. ఇంకేముంది కొన్నిరోజుల‌కే మీ పీసీ నిండిపోతుంది. వ‌ర్కింగ్ స్లో అయిపోతుంది.  చాలామంది ఈ ప్రాబ్ల‌మ్‌ను ఎదుర్కొంటారు. మ‌న కంప్యూట‌ర్‌కు గుండె కాయ లాంటి సీ డ్రైవ్ నిండిపోతే కంప్యూట‌ర్ వేగంగా ఉండ‌దు. అస్త‌మానం మొరాయిస్తుంది. ప్రాసెస్ చాలా స్లోగా ఉంటుంది. మ‌రి మ‌న పీసీలో ఎంత డేటాను ఉంచాలి... ఎంత ఫ్రీ స్పేస్ వ‌ద‌లాలి?

మీకు ఖాళీ స్పేస్ ఎందుకు కావాలి? 
ఏ సిస్ట‌మ్ అయినా వేగంగా ముందుకు క‌ద‌లాలంటే అది స్వేచ్ఛ‌గా ఉండాలి. దాన్ని డేటాతో నింపేసి ఇబ్బంది పెడితే అది కూడా ప‌ని చేయ‌డానికి మొరాయిస్తుంది. మీ డ్రైవ్ నిండిపోతే కొత్త ఫైల్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోలేం.. కొత్త ఫైల్స్‌ను సేవ్ చేసుకోలేం.. క‌నీసం విండోస్ అప్‌డేట్స్ కూడా మ‌న‌కు అంద‌వు. అస్త‌మానం క్రియేట్ ఫైల్స్ మీద ఆధార‌ప‌డాల్సి ఉంటుంది. దీని వ‌ల్ల కొన్ని ఎర్ర‌ర్స్ కూడా వ‌స్తాయి.  పెద్ద సంఖ్య‌లో ఫైల్స్ ఓపెన్ చేసినప్పుడు అద‌న‌పు మెమ‌రీ కావాల్సి ఉంటుంది. మెమ‌రీ ఖాళీగా లేక‌పోతే చాలా క‌ష్టం అవుతుంది. అందుకే మ‌న కంప్యూట‌ర్లో వీలైనంత ఎక్కువ స్పేస్ ఉండాలి. ట్ర‌బుల్ షూట్ చేసే స‌మ‌యంలో కూడా త‌ప్ప‌ని స‌రిగా స‌రిప‌డినంత మెమ‌రీ ఉండాలి. లేక‌పోతే ట్ర‌బుల్ షూటింగ్ మ‌ధ్య‌లోనే ఆగిపోతుంది. ఈ ప్రాబ్లమ్‌ను మ‌నం త‌రుచూ ఎదుర్కొంటాం.

15 నుంచి 20 శాతం ఖాళీ ఉండాలి
ఏ కంప్యూట‌ర్‌లో అయినా మెమ‌రీ 15 నుంచి 20 శాతం ఖాళీగా ఉండాలి. డ్రైవ్‌ల‌లో క‌నీసం 15 శాతం ఫ్రీ స్పేస్ ఉండాల‌ని నిపుణులు చెబుతున్నారు. ఒక వేళ క‌నీసం 15 శాతం ఫ్రీ స్పేస్ కూడా లేక‌పోతే విండోస్‌.. డ్రైవ్‌లో డిఫ్రాగ్‌మెంట్ చేయ‌డం కుద‌ర‌దు. దీని వ‌ల్ల చాలా ప్రొగ్రామ్‌ల‌పై ప్ర‌భావం ప‌డుతుంది. దీని వ‌ల్ల మెకానిక‌ల్‌గా డిఫ్రాగ్‌మెంటేష‌న్ చేయాల్సి ఉంటుంది. చాలా మోడ్ర‌న్ పీసీల్లో ఈ  మెకానిక‌ల్ డిఫాగ్‌మెంటేష‌న్ ఉంటుంది. కొన్ని పీసీల్లో 25 శాతం ఫ్రీ స్పేస్ లేక‌పోతే స్లో అయిపోతాయి. అయితే సాలిడ్ స్టేట్ డ్రైవ్స్ వ‌ల్ల కొన్ని ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి. దీన్ని ఫుల్‌గా వాడేసినా ఇంకా మెమెరీ దీనిలో మిగిలి ఉంటుంది.
 

జన రంజకమైన వార్తలు