• తాజా వార్తలు
  •  

టిప్స్ అండ్ ట్రిక్స్: ఎటువంటి ఫోన్ నంబ‌ర్ డిటైల్స్ అయినా ప‌సిగ‌ట్టే 800 నోట్స్‌!

రాంగ్ కాల్స్‌తో విసిగిపోయారా! అన్ నౌన్ నంబ‌ర్లు వ‌చ్చిన ప్ర‌తిసారి ఇబ్బంది ప‌డుతున్నారా? ఇంత‌టి టెక్నాల‌జీ అందుబాటులోకి వ‌చ్చిన త‌ర్వాత కూడా ఎందుకు ఇలా ఇబ్బందిప‌డ‌డం. మీకు గుర్తు తెలియ‌ని ఏ ఫోన్ నంబ‌ర్‌నైనా గుర్తించి పూర్తి వివ‌రాలు అందించే ఒక సాఫ్ట్‌వేర్ ఉంది. దాని పేరు 800 నోట్స్. అన్‌నౌన్ కాల్స్ ప‌సిగ‌ట్టి మ‌న‌కు వెంట‌నే వివ‌రాలు అందించ‌డం దీని ప్ర‌త్యేక‌త‌.  మ‌రి 800 నోట్స్ ఏమిటో..దాని ప‌నితీరు  ఏమిటో తెలుసుకుందామా!

ఏంటి.. 800 నోట్స్‌!
800 నోట్స్ అనేది అనేది ఒక వెబ్‌సైట్‌. మీకు తెలియ‌ని నంబ‌ర్ వివ‌రాలు అందించ‌డ‌మే దీని ప‌ని. ఆ అన్ నౌన్ నంబ‌ర్ గురించి ఏ చిన్నడిటౌల్ వ‌ద‌ల‌కుండా ఇవ్వ‌డ‌మే దీని స్పెష‌ల్‌. ట్రూ కాల‌ర్ లాంటి యాప్‌ల‌లా కాకుండా దీని ప‌నితీరే భిన్నంగా ఉంటుంది.  ప‌దే ప‌దే మ‌న‌కు  తెలియ‌న నంబ‌ర్ నుంచి కాల్స్  వ‌స్తే  రిపోర్ట్ లేదా కామెంట్ చేసే అవ‌కాశం  800 నోట్స్‌లో ఉంది. దీని వ‌ల్ల ఆ నంబ‌ర్ ఆటోమెటిక్‌గా బ్లాక్ అయిపోతుంది. మిగిలిన ఏ యాప్‌ల‌లో లేని ఫీచ‌ర్  ఇది.

ఎలా ప‌ని చేస్తుందంటే..
800 నోట్స్ ద్వారా మ‌న అన్ నౌన్ నంబ‌ర్‌ను తెలుసుకోవ‌డం చాలా సుల‌భం. మ‌నం ఒక‌టి రెండు స్టెప్స్ ద్వారా దీన్ని ఉప‌యోగించుకోవ‌చ్చు.  అదెలాగో చూద్దాం..

1. ముందుగా మ‌నం 800 నోట్స్ అఫీషియ‌ల్ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి

2. మీకు ఒక టెక్ట్ బాక్స్ క‌నిస్తుంది.  అందులో మిమ్మల్ని విసిగించే 10 అంకెల ఫోన్ నంబ‌ర్‌ను టైప్ చేయాలి. ఆ త‌ర్వాత ఎంట‌ర్ కొట్టాలి. 

3.  అంతే మీకు కావాల్సిన ఇన్ఫ‌ర్మేష‌న్ మీకు వ‌చ్చేస్తుంది.  ఆ నంబ‌ర్ గురించి యూజ‌ర్లు ఎవ‌రు ఎలా రిపోర్ట్ చేశార‌ని వివ‌రాలు కూడా మీకు తెలుస్తాయి.. ఆ రిపోర్ట్‌ల‌ను చూస్తే  మీకు ఆ నంబ‌ర్ వివ‌రాల‌న్నీ తెలుస్తాయి.

4. మీరు ఎంట‌ర్ చేసిన నంబ‌ర్ ఏ ఏరియాకు చెందిందో..పిన్ కోఢ్‌తో స‌హా మీకు క‌నిపిస్తాయి.  చాలామంది ఈ ఫోన్ నంబ‌ర్ గురించి చేసిన   కామెంట్ల‌ను కూడా మీరు చూడొచ్చు. దీంతో ఆ నంబ‌ర్‌పై ఒక అభిప్రాయానికి రావ‌డానికి అవ‌కాశం దొరుతుకుతుంది.

జన రంజకమైన వార్తలు

విజ్ఞానం బార్ విశేషాలు