భారత్‌లో ఎక్కువగా ఉపయోగించే బ్రాడ్‌బ్యాండ్ సర్వీసుల్లో బీఎస్ఎన్ఎల్. అయితే లో డౌన్లోడ్ స్పీడ్ తక్కువగా ఉండడం, నెట్ వేగం తగ్గిపోవడం లాంటి సమస్యలు తరుచూ ఎదురవుతూనే ఉంటాయి. కేవలం 2 ఎంబీపీఎస్ స్పీడ్‌తో కస్టమర్లు చాలా ఇబ్బందులు పడుతుంటారు. అంతేకాదు ఫెయిర్ యూజ్ పాలసీ (ఎఫ్ యూ పీ) లిమిట్ దాటిన తర్వాత స్పీడ్ లిమిట్ 512 కేబీపీఎస్‌కు పడిపోతుంది. కొంతమందికైతే కనీసం 2 ఎంబీపీఎస్ స్పీడ్ కూడా రాదు. అయితే బీఎస్ఎన్ఎల్ బ్రాడ్‌బ్యాండ్ స్పీడ్ పెంచుకోవడానికి కొన్ని చిట్కాలున్నాయి. అవేంటో.. ఎలాగో చూద్దాం..
గ్రూప్ పాలసీ ఎడిటర్‌లోకి బ్రాండ్ విడ్త్‌ను మార్చండి
బ్రాండ్ విడ్త్‌ను గ్రూప్ ఎడిటర్ పాలసీలోకి మారిస్తే మీ ఇంటర్నెట్ వేగం కనీసం 20 శాతం పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. అది ఎలా మార్చాలంటే..
స్టార్ట్‌లోకి వెళ్లి రన్ ఆప్షన్ ఎంచుకోవాలి. లోకల్ కంప్యూటర్ పాలసీ మీద క్లిక్ చేయాలి
కంప్యూటర్ కన్ఫిగరేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత అడ్మినిస్ట్రేటివ్ టెంప్లేట్స్ ఆప్షన్ ఎంచుకోవాలి
ఆ తర్వాత నెట్వర్క్స్.. ఆపై క్యూఓఎస్ పాకెట్ షెడ్యులర్లపై క్లిక్ చేయాలి.
లిమిట్ రిజర్వ్బుల్ బ్యాండ్ విడ్త్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత లిమిట్ రిజర్వ్బుల్ బ్యాండ్ విడ్త్ ఆప్షన్ ఎంచుకోవాలి. ఆ తర్వాత వాల్యూని 20 నుంచి 0 కి మార్చాలి.
మీ కంప్యూటర్లో గ్రూప్ పాలసీ ఎడిటర్ లేకపోతే మాన్యువల్‌గా డౌన్లోడ్ చేసుకోవాలి.
గూగుల్ డీఎన్ఎస్ సెట్టింగ్స్ మార్చాలి
మీకు కుడంట్ కనెక్ట్ టు దిస్ పేజ్ అనే ఎర్రర్ మెసేజ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటప్పుడు గూగుల్ డీఎన్ఎస్ సెట్టింగ్స్‌లో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది.
కంట్రోల్ ప్యానల్‌కు వెళ్లి నెట్వర్క్ అండ్ ఇంటర్నెట్ ఆప్షన్ క్లిక్ చేయాలి.
నెట్వర్క్ అండ్ షేరింగ్ సెంటర్ మీద క్లిక్ చేయాలి
క్లిక్ ఆన్ యువర్ ఇంటర్నెట్ కనెక్షన్ మీద క్లిక్ చేసి ప్రొపర్టీస్ ఆప్షన్ ఎంచుకోవాలి.
యూజ్ ద ఫాలోయింగ్ డీఎన్ఎస్ సర్వర్ అడ్రసెస్ బటన్‌ను క్లిక్ చేయాలి. ఆ తర్వాత రీప్లేస్ ద కరెంట్ డీఎన్ఎస్ అడ్రసెస్ మీద క్లిక్ చేయాలి.
టీపీపీ ఆప్టిమైజర్ వాడాలి
టీసీపీ ఆప్టిమైజర్ టూల్... ఇంటర్నెట్ డౌన్లోడింగ్ స్పీడ్ పెరిగేందుకు ఉపయోగపడుతుంది. దీన్ని ఈ టూల్ డౌన్లోడ్ చేసుకుని మీ పీసీలో ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ అయ్యాక దీనిలో స్సీడ్ అడ్జెస్ట్మెంట్ బార్ మీద క్లిక్ చేసి స్పీడ్‌ను అడ్జెస్ట్ చేసుకోవాలి. బ్రౌజర్లో క్యాచెను ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తే కూడా నెట్ స్పీడ్ పెరుగుతుంది.