• తాజా వార్తలు
  •  

నెట్‌ బ్యాల‌న్స్ అయిపోతే..  మీ ఫోన్‌లో మెయిన్ బ్యాల‌న్స్ ఖ‌ర్చ‌యిపోకుండా ఉండ‌డానికి టిప్స్ 

మొబైల్‌లో ఇంట‌ర్నెట్ బ్యాల‌న్స్ వేయించుకోవ‌డం, అది ఎప్పుడు అయిపోతుందో కూడా చాలా మంది గుర్తించ‌రు.  డేటా అయిపోయాక కూడా నెట్ వాడితే మీ మెయిన్ బ్యాల‌న్స్‌లో నుంచి అమౌంట్ క‌ట్ అయిపోతుంటుంది. అది కూడా చాలా ఎక్కువ‌గా.  మొబైల్ డేటా యూజ్ చేసేవాళ్ల‌లో చాలా మంది ఎప్పుడో ఒకప్పుడు ఈ ప్రాబ్ల‌మ్‌ను ఫేస్ చేసే ఉంటారు.  ఇలా డేటా అయిపోతే మీ మెయిన్ బ్యాల‌న్స్ క‌ట్ అయిపోకుండా ఉండ‌డానికి రెండు ఈజీ మార్గాలున్నాయి.  
1) ఎస్ఎంఎస్ ద్వారా 
ఎయిర్‌టెల్‌, ఐడియా, వొడాఫోన్‌, మ‌రే ఇత‌ర నెట్‌వ‌ర్క్ సిమ్ వాడుతున్న‌వారైనా ఒక్క ఎస్ఎంఎస్‌తో మీ నెట్ యూసేజ్‌కు మెయిన్ బ్యాల‌న్స్ నుంచి మ‌నీ క‌ట్‌కాకుండా చూసుకోవ‌చ్చు. STOP అని టైప్ చేసి  1925 నెంబ‌ర్‌కు ఎస్ఎంఎస్ చేయాలి.  అర్ధ‌గంట‌లోమీకు మొబైల్ నెట్‌వ‌ర్క్ కంపెనీ నుంచి క‌న్ఫ‌ర్మేష‌న్ మెసేజ్ వ‌స్తుంది. ఆ త‌ర్వాత మీరు డేటాఅయిపోయాక పొర‌పాటున యూజ్ చేసినా యాక్సెస్ కాదు. దీంతో మీ మెయిన్ బ్యాల‌న్స్ ఖ‌ర్చ‌యిపోకుండా ఉంటుంది. 
2) టోల్‌ఫ్రీ నెంబ‌ర్‌కు కాల్ చేసి
 మీ మొబైల్ నుంచి టోల్‌ఫ్రీ నెంబ‌ర్  1925కి కాల్ చేయండి. ఐవీఆర్ ఇన్‌స్ట్ర‌క్ష‌న్ ఫాలో అయి మీ ఆప్ష‌న్‌ను సెలెక్ట్ చేసుకుంటే మీరు ఇంట‌ర్నెట్ స‌ర్వీస్‌ను  స‌క్సెస్‌ఫుల్‌గా డీయాక్టివేట్ చేసినట్లే. 
యాక్టివేట్ చేసుకోవాలంటే..
ఒకవేళ మీ మెయిన్ బ్యాల‌న్స్ నుంచి నెట్ యూసేజ్‌కు క‌ట్ అయినా ప‌ర‌వాలేదు యాక్టివేట్ చేసుకోవాల‌నుకుంటే start అని టైప్ చేసి 1925కు ఎస్ఎంఎస్ చేయాలి. లేదంటే 1925 టోల్‌ఫ్రీ నెంబ‌ర్‌కు కాల్ చేసి ఈ స‌ర్వీస్‌ను యాక్టివేట్ చేసుకోవ‌చ్చు.  

జన రంజకమైన వార్తలు

విజ్ఞానం బార్ విశేషాలు