• తాజా వార్తలు

ఎవ‌రిదైనా ఎఫ్‌బీ పబ్లిక్ ఇన్ఫ‌ర్మేష‌న్ చూడ‌డానికి అద్భుత‌మైన టూల్ స్టాక్‌స్కాన్‌

ఫేస్‌బుక్‌లో మీ ప్ర‌తి చిన్న క‌ద‌లిక ఫేస్‌బుక్ స‌ర్వ‌ర్స్‌లో సేవ్ అవుతుంది.  అకౌంట్ ఓపెన్ చేసిన‌ప్ప‌టి నుంచి మీరు పెట్టిన ఫొటోలు, లైక్స్‌, షేర్స్‌, కామెంట్స్ అన్నింటినీ స్టోర్ చేస్తుంది. అయితే ఇదంతా ప‌బ్లిక్ ఇన్ఫ‌ర్మేష‌న్ కింద‌కే వ‌స్తుంది కాబ‌ట్టి దాన్నేమీ అన‌లేని ప‌రిస్థితి. అయితే ఇలా ప‌బ్లిక్ ఇన్ఫ‌ర్మేష‌న్ కింద మ‌న అకౌంట్‌లోని ఏ స‌మాచారం అంద‌రికీ తెలియ‌డానికి వీలుందో మ‌నం  తెలుసుకోవ‌డానికి ఓ మంచి టూల్ ఉంది. దాని పేరు స్టాక్ స్కాన్‌.
ఎలా ప‌నిచేస్తుంది? 
స్టాక్ స్కాన్ ఫేస్‌బుక్ యొక్క సొంత ఏపీఐల‌ను ఉప‌యోగించుకుని ఏ ప్రొఫైల్‌కి సంబ‌ధించిన డేటాను అయినా యాక్సెస్ చేయ‌గ‌లుగుతుంది. అంటే ఫేస్‌బుక్ స్టోర్ చేస్తున్న డేటా హ్యాక‌ర్స్‌కి, స్టాక‌ర్స్‌కి అందుబాటులో ఉందన్న‌మాట‌. మీ ఇన్ఫ‌ర్మేష‌న్ ఎంత‌వ‌ర‌కూ అందుబాటులో ఉందో చూసుకోగ‌లిగితే మీకు దీనిపై అవ‌గాహ‌న ఉంటుంది. ఎందుకంటే ఫేస్‌బుక్ ప్రొఫైల్స్ చెక్ చేసి అబ్బాయి లేదా అమ్మాయి బిహేవియ‌ర్ మీద అనుమానంతో పెళ్లి సంబంధాలు చెడిపోయిన సంద‌ర్భాలు, భార్యాభ‌ర్త‌లు విడిపోయేదాకా వ‌చ్చిన‌వి కూడా ఉన్నాయి. కాబ‌ట్టి మీ ప్రైవ‌సీపై మీరు దృష్టి పెట్టాల్సిందే. 
ఎలా చెక్ చేసుకోవాలి?  
 StalkScan.com వెబ్‌సైట్‌లోకి వెళ్లి మీరు చెక్ చేయాల‌నుకున్న ఫేస్‌బుక్ ప్రొఫైల్ యూఆర్ఎల్‌ను ఎంట‌ర్ చేసి ఎంట‌ర్ బ‌ట‌న్ నొక్కండి.  
* ఇప్పుడు ఫ‌లానా ప్రొఫైల్ లోడ్ అయిందంటూఐ మీకు మెసేజ్ క‌నిపిస్తుంది.
* కింద‌కు స్క్రోల్ చేస్తే ఫొటోస్‌, ట్యాగ్స్‌, వీడియోస్ ఇలా ర‌క‌రకాల లింక్స్ క‌నిపిస్తాయి. 
* దేనిమీద క్లిక్ చేస్తే ఆ ఫేస్‌బుక్ అకౌంట్లో దానికి సంబంధించిన డేటాఅంతా  వ‌స్తుంది. గ్రూప్స్‌పై క్లిక్ చేస్తే ఆప‌ర్స‌న్ ఏయే గ్రూప్‌ల్లో జాయిన్ అయ్యాడో తెలుస్తుంది. ఫొటోస్ క్లిక్ చేస్తే వాళ్లు పోస్ట్ చేసిన పొటోలు, వాటికి వ‌చ్చిన లైక్‌లు, షేర్లు, కామెంట్స్ అన్నీ తెలుసుకోవ‌చ్చు. 
* దీన్ని మీది లేదా మీ ఫ్యామిలీ మెంబ‌ర్ల  ఫేస్‌బుక్  ప్రొఫైల్స్‌లో ఇన్ఫ‌ర్మేష‌న్ ఎంత‌వ‌ర‌కూ ప‌బ్లిక్‌లో అవాయిల‌బుల్‌గా ఉంద‌ని తెలుసుకోవ‌డానికి వాడండి. 

జన రంజకమైన వార్తలు