ఆండ్రాయిడ్ ఫోన్ చేతిలో ఉంటే చాలు మనం ఇష్టమొచ్చినట్లు యాప్‌లు, సాఫ్ట్వేర్లతో నింపేస్తాం. ఫొటోలు, వీడియోలు అయితే లెక్కేలేదు. మనం ఫోన్ కొన్న కొన్ని రోజులకే స్టోరేజ్ మొత్తం నిండిపోతుంది.మెమెరీ కార్డ్‌తో ఎక్సాపాండ్ చేసుకున్నా లాభం లేదు. అది కూడా నిండిపోతుంది. ఈ నేపథ్యంలో మన ఆండ్రాయిడ్ ఫోన్లో కొత్త యాప్‌లు డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉండదు. ఐతే కీలక సమయాల్లో ఏమైనా యాప్‌లు డౌన్లోడ్ చేయాలన్నా అవకాశం ఉండదు. మరి మనకు అవసరమైన డేటాను మన ఫోన్లో స్టోర్ చేసుకోవాలంటే ముందుగా ఆండ్రాయిడ్ ఫోన్లో స్టోరేజ్‌ను ఫ్రీ చేసుకోవాలి. మరి అదెలాగో చూద్దామా!
క్యాచె, డేటా తుడిచేయండి
మన ఫోన్లో ఎప్పటికప్పుడు డేటాతో పాటు అనవసరమైన డేటా కూడా పెరిగిపోతుంటుంది. దీని వల్ల మన స్టోరేజ్ స్పేస్ కూడా ఎక్కువగా ఖర్చు అవుతుంది. దీన్ని క్యాచె అంటారు. ముందుగా దీన్ని క్లీన్ చేస్తేనే మనకు స్పేస్ దొరుకుతుంది. సెట్టింగ్స్‌లోకి వెళ్లి ముందుగా స్టోరేజ్.. ఆ తర్వాత యాప్స్‌ను క్లిక్ చేయాలి. అందులో క్లియర్ క్యాచె అనే ఆప్షన్ ఉంటుంది. క్యాచెను తుడిచేస్తే మనకు చాలా వరకు స్పేస్ లభిస్తుంది. ప్రతి యాప్‌కు కొంత స్టోరేజ్ ఉంటుంది. అయితే మన వాడకంలో ఈ యాప్ స్టోరేజ్ పెరిగిపోతుంది. ఆ అదనపు స్టోరేజ్‌ను క్లియర్ చేస్తే చాలు.
క్లియర్ ఓల్డ్ డౌన్లోడ్స్
ఆండ్రాయిడ్ ఫోన్లో సెంట్రల్ డౌన్లోడ్ ఫోల్డర్ ఉంటుంది. దీనిలోనే మనం డౌన్లోడ్ చేసిన ఫైల్స్ అన్ని స్టోర్ అవుతాయి. ఇమేజెస్, జిప్ ఫైల్స్ అన్ని ఇందులోనే ఉంటాయి. అయితే కొన్ని సపోర్ట్ చేయాని ఫైల్స్ కూడా ఇందులోకి వచ్చి చేరుతాయి. వాటిని మనం గుర్తించం. మీరు డౌన్లోడ్ ఫోల్డర్‌ను ఓపెన్ చేస్తే అందులోనూ మీకు పనికిరాని ఫైల్స్ కనబడతాయి వెంటనే వాటిని డిలీట్ చేస్తే మీకు చాలా స్పేస్ కవర్ అవుతుంది.
మైక్రో ఎస్డీ కార్డులోకి యాప్స్
మన ఆండ్రాయిడ్ ఫోన్లో ఎక్కువ స్పేస్‌ను యాప్‌లే ఆక్రమిస్తాయి. అయితే వాటిలో ఎక్కువ యాప్‌లు మనకు ఉపయోగపడేవే. కానీ వాటిని తీసేయలేం. అలా అని ఉంచలేం. ఈ స్థితిలో మనకు స్పేస్ కావాలంటే కచ్చితంగా యాప్‌లు తీసేయాల్సిందే. ఐతే మనకు అవసరమైన యాప్‌లు తీసేయకుండా మైక్రో ఎస్డీ కార్డ్‌కు పంపిస్తే చాలా స్పేస్‌ను మిగుల్చుకోవచ్చు. అయితే కొన్ని ఇన్‌బిల్ట్ యాప్‌లు మైక్రో ఎస్డీ కార్డులోకి వెళ్లవు. వాటిని మినహాయించి మిగిలిన యాప్‌లను అన్నిటిని ఎస్డీ కార్డులోకి తరలించొచ్చు. గూగుల్ ఫొటోలు.. ఆప్షన్ ఉపయోగించడం వల్ల కూడా మీరు చాలా స్పేస్‌ను ఆదా చేసుకునే అవకాశం ఉంది. అంతేకాదు స్మార్ట్స్టోరేజ్ను ఎనేబుల్ చేయడం ద్వారా కూడా స్సేస్‌ను మిగుల్చుకునే అవకాశం ఉంది.