• తాజా వార్తలు
  •  

మీ ఐపీ అడ్ర‌స్‌ను హైడ్ చేయాలా ? ఐతే ఈ చిట్కాలు మీకోసం

కంప్యూట‌ర్‌లో ఐపీ అడ్ర‌స్ చాలా కీల‌క‌మైంది. మ‌నం ఏ కంప్యూట‌ర్ నుంచి ప‌ని చేస్తున్నామో.. ఆ కంప్యూట‌ర్ ఎక్క‌డ ఉందో తెలిపే కీల‌క ఆధార‌మే ఐపీ అడ్రెస్‌. ప్ర‌తి కంప్యూట‌ర్‌కు ఐపీ అడ్ర‌స్ మ‌స్ట్‌గా ఉంటుంది. చాలా ముఖ్య‌మైన సైబ‌ర్ కేసుల్లో ఐపీ అడ్ర‌స్ ఆధారంగా దోషుల‌ను ప‌ట్టుకున్న సంద‌ర్భాల్లో చాలా ఉన్నాయి. అయితే టెక్నాల‌జీ పెరిగిపోయిన త‌ర్వాత మ‌న ఐపీ అడ్రెస్‌ను కూడా ఎవ‌రికీ క‌న‌బ‌డ‌కుండా దాచేసే సాంకేతిక‌త అందుబాటులోకి వ‌చ్చింది. ఇది చెడుకు కాదు మంచికి కూడా ఉప‌యోగ‌ప‌డుతుంది. హ్యాక‌ర్లు, స్పామ‌ర్ల నుంచి కాపాడుకోవ‌డానికి ఇది ఉప‌యోగ‌ప‌డుతుంది. 

సున్నిత‌మైన స‌మాచారం
కంప్యూట‌ర్‌లో మ‌నం ఎంతో సున్నిత‌మైన స‌మాచారాన్ని భ‌ద్రం చేస్తాం. ఇది చాలా సుర‌క్షిత‌మ‌ని కూడా ఫీల్ అవుతాం. కానీ కంప్యూట‌ర్‌లో దాచిన స‌మాచారం 100 శాతం సుర‌క్షితం కాద‌న్న‌ది ప‌చ్చి నిజం. మ‌న ఐపీ అడ్ర‌స్‌ను హ్యాక్ చేయ‌డం ద్వారా స్పామ‌ర్లు సుల‌భంగా మ‌న కంప్యూట‌ర్‌లోకి చొర‌బ‌డి విలువైన స‌మాచారాన్ని దొంగిలించే అవ‌కాశం ఉంది.  ముఖ్యంగా వైఫై వచ్చిన త‌ర్వాత ప‌రిస్థితి మ‌రింత మారింది. వైఫై రోట‌ర్‌తో ఐఎస్‌పీకి క‌నెక్ట్ చేసేట‌ప్పుడు ప్రొఫెష‌న‌ల్ హ్యాక‌ర్లు సుల‌భంగా డేటాను దొంగిలిస్తున్నారు.   హ్యాక‌ర్లు మ‌రీ తెలివి మీరి మ‌న డేటాను దొంగిలించి క్రిప్టో క‌రెన్సీ కోసం మ‌న‌ల్నే బ్లాక్ మెయిల్ చేసే ప్ర‌మాదం కూడా ఉంది. 

వీపీఎన్ ఉప‌యోగించి..
వ‌ర్చువ‌ల్ ప్రైవేట్ నెట్‌వ‌ర్క్ ఉప‌యోగించ‌డం ద్వారా మీ డిఫాల్ట్  నెట్‌వ‌ర్క్ పాత్‌ను ప్రైవేటుగా మార్చుకోవ‌చ్చు.  ఇది మీ ఐపీ అడ్రెస్‌ను రాండమ్‌గా మారుస్తూ ఉంటుంది. మీ కంప్యూట‌ర్ లొకేష‌న్ బ‌ట్టి ఇది ఐపీ అడ్రెస్‌లో మార్పులు తెస్తుంది. మీ ఐపీ అడ్రెస్‌ను హైడ్ చేయ‌డానికి వీపీఎన్ అత్యుత్త‌మ మార్గం.  ఆన్‌లైన్‌లో మీకు ఎన్నో వీపీఎన్‌లు దొర‌కుతున్నాయి. వీటిలో ఉచితంగా దొరికేవి..డ‌బ్బులు పెట్టి కొనుక్కునేవి కూడా ఉన్నాయి. 

ప్రోక్సిని ఉప‌యోగించి.
ప్రోక్సిని ఉప‌యోగించ‌డం వ‌ల్ల మాన్యువ‌ల్‌గా ఐపీ అడ్రెస్‌ను మార్చుకోవ‌చ్చు. ఐఎస్‌పీ ద్వారా బ్లాక్ చేసిన వెబ్‌సైట్ల‌ను ప్రాక్సిని వాడి ఉప‌యోగించుకోవ‌చ్చు. అంతేకాదు ప్రాక్సిని ఉప‌యోగించి ఐపీ అడ్రెస్‌ను హైడ్ చేసే అవ‌కాశం ఉంది.  అయితే లొకేష‌న్ల నుంచి ఐపీ అడ్రెస్‌లు ఇచ్చేట‌ప్పుడు జాగ్ర‌త్త‌గా ఉండాలి. 

టొర్ బ్రౌజ‌ర్‌
టొర్ బ్రౌజ‌ర్ యాప్ ద్వారా కూడా ఐపీ అడ్రెస్‌లు హైడ్ చేసే అవ‌కాశం ఉంటుంది. సాధార‌ణంగా మొజిల్లా ఫైర్‌పాక్స్‌, గూగుల్ క్రోమ్ లాంటి వాటిని ఉప‌యోగిస్తే మ‌న యాక్టివిటీస్ హైడ్ చేయ‌వు. ఐతే టొర్ బ్రౌజ‌ర్ మాత్రం మీ యాక్టివిటీస్‌ను ట్రాక్ చేస్తుంది. అందుకే హ్యాక‌ర్లు మీ సిస్ట‌మ్‌ను యాక్సెస్ చేయ‌డం క‌ష్టం అవుతుంది. 

జన రంజకమైన వార్తలు