• తాజా వార్తలు
  •  

మీ పీసీలో ఫార్మాట్ లేదా డిలీట్ అయిన డేటాను తిరిగి రిక‌వ‌ర్ చేయడం ఎలా?

ప‌ర్స‌న‌ల్ కంప్యూట‌ర్ అంటేనే  మీ స‌మాచార నిధి.  ఆఫీస్ లేదా బిజినెస్ ఫైల్స్ నుంచి భార్యాపిల్ల‌ల‌తో టూర్‌కి వెళ్లిన‌ప్పుడు తీసుకున్న ఫొటోల వ‌ర‌కు అన్నీ అందులోనే స్టోర్ చేసుకుంటాం.  హార్డ్‌డిస్క్‌లున్నా, వ‌న్‌డ్రైవ్‌లు,గూగుల్ డ్రైవ్ అకౌంట్లున్నా కూడా అన్నింటినీ అందులో స్టోర్‌చేయ‌లేం. ఇలాంట‌ప్పుడు పొరపాటునో, గ్ర‌హ‌పాటునో మీ పీసీలో డేటా డిలెట్ అయిపోతే, సిస్టంను ఫార్మాట్ చేయాల్సిన ప‌ని వ‌చ్చి మీ డేటా కూడా ఎరేజ్ అయిపోతే ఇక అంతేనా? ఏళ‌్ల త‌ర‌బ‌డి అందులో ఉన్న డేటా పోవ‌ల్సిందేనా? అని బాధ‌ప‌డుతున్నారా? అక్క‌ర్లేదు. డిలీట్ లేదా ఫార్మాట్ అయిపోయిన డేటాను కూడారిక‌వ‌ర్ చేయ‌డానికి బోల్డ‌న్ని టెక్నిక్స్ ఉన్నాయి. అలాంటి వాటిలో ఇది కూడా ఒక‌టి.
కూల్‌మ‌స్టర్ డేటా రిక‌వ‌రీ సాఫ్ట్‌వేర్ (Coolmuster Data Recovery Software) 
మీ పీసీలోకి కూల్‌మాస్ట‌ర్ డేటా రిక‌వ‌రీ సాఫ్ట్వేర్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.  ఈ సాఫ్ట్‌వేర్‌తో మీరు నాలుగుర‌కాల డేటాను రిక‌వ‌ర్ చేయొచ్చు.
1. డిలెటెడ్ రిక‌వ‌రీ (Deleted recovery) :  దీనితో మీరు మీ పీసీలోని పార్టిష‌న్‌లో నుంచి లేదా రిమూవ‌బుల్ డిస్క్ నుంచిఫొటోలు, మీడియా, సాంగ్స్‌, ఎంపీ3 వీడియోల‌ను రిక‌వ‌ర్ చేసుకోవ‌చ్చు.
2. ఫార్మాట్ రిక‌వ‌రీ (Format recovery):   దీనితో మీ ఫార్మాటెడ్ డిస్క్‌ను రిక‌వ‌ర్ చేయొచ్చు.
3. రా రిక‌వ‌రీ (Raw Recovery) :   ఫైల్ సిస్ట‌మ్ క‌ర‌ప్ట్ అయినా లేదా ఇత‌ర ప్రాబ్ల‌మ్స్ వ‌చ్చినా, ట్రోజ‌న్ లేదా వైర‌స్ అటాక్ అయినా, రిజిస్ట్రీ డ్యామేజ్ అయినా మీ ప్రైమ‌రీ హార్డ్‌డ్రైవ్ పార్టిష‌న్స్ RAWగా మారిపోతాయి.  ఈ సాఫ్ట్‌వేర్‌తో ఇలాంటి ఫైల్స్‌ను మీరు ఈజీగా రివ‌క‌ర్ చేసుకోవ‌చ్చు.
4. పార్టిష‌న్ రిక‌వ‌రీ (Partition Recovery) : దీంతో మీరు సీ డ్రైవ్ లాంటి పార్టిష‌న్ డేటాను రిక‌వ‌ర్ చేసుకోగ‌లుగుతారు.
ఇప్పుడు  ఈ నాలుగింటిలో ఎలాంటి డేటా రిక‌వ‌ర్ చేసుకోవాల‌నుకుంటున్నారో దాన్ని క్లిక్‌చేయాలి.
ఫార్మాట్ అయిన హార్డ్ డిస్క్ నుంచి డేటా రికవ‌ర్ చేయ‌డం ఎలా?
ఇక మీ పీసీలోని  హార్డ్ డిస్క్‌లో నుంచి డేటా డిలీట్ అయినా కూడా రిక‌వ‌ర్ చేసుకోవ‌చ్చు.
* ఈసీయ‌స్ ఫ్రీ డేటా రిక‌వ‌రీ సాఫ్ట్‌వేర్ (Easeus Free Data Recovery Software)ను డౌన్‌లోడ్‌చేసుకోండి.
* సాఫ్ట్‌వేర్‌ను ఓపెన్ చేసి  Hard Disk partitionను సెలెక్ట్ చేసి స్కాన్ చేయండి.
* స్కాన్ కంప్లీట్ అయితే మీ హార్డ్ డిస్క్ నుంచి డిలీట్ అయిన ఫైల్స్ క‌నిపిస్తాయి.ఒక‌వేళ క‌నిపించ‌క‌పోతే డీప్ సెర్చ్‌కొట్టండి. ఇప్పుడు మీరు పోగొట్టుకున్న మొత్తం ఫైల్స్ క‌నిపిస్తాయి.
* ఇప్పుడు ఫైల్స్‌, ఫోల్డ‌ర్స్‌ను క్లిక్ చేసి రిక‌వ‌ర్ బ‌ట‌న్ మీద క్లిక్ చేయండి. 
* ఫోల్డ‌ర్‌ను ఎక్క‌డ  సేవ్ చేయాలో సెలెక్ట్ చేస్తే మీరు పోగొట్టుకున్న‌డేటా మొత్తం రిక‌వ‌ర్ అవుతుంది.

జన రంజకమైన వార్తలు