• తాజా వార్తలు
  •  

మీ ఫోన్‌లో వాట్సాప్ సైజ్‌ను త‌గ్గించుకోవ‌చ్చు.. ఎలాగంటే? 

మీ ఐ ఫోన్ లేదా ఐప్యాడ్‌లో స్పేస్ లేన‌ప్పుడు ఏ యాప్స్ తీసేద్దామా అని ఓ లుక్కేస్తే అన్నింటికంటే ఎక్కువ స్పేస్ తినేస్తున్న‌ది వాట్సాప్పేన‌ని క‌నిపిస్తుంది. ఈ రోజు వాట్సాప్‌లేని స్మార్ట్‌ఫోన్ లేదు. ప్ర‌తి ఒక్క‌రి వాట్సాప్‌లోనూ 10, 15 గ్రూప్స్ ఉంటున్నాయి. వాటిలో గుడ్మానింగ్‌, గుడ్‌నైట్ మెసేజ్‌లు, వీడియోలు, ఇమేజ్‌లు వ‌స్తుంటాయి. పైగా అవి వాట్సాప్‌లోనూ, గ్యాల‌రీలోనూ ఇలారెండు, మూడు చోట్ల సేవ్ అవుతాయి. ఇలా బోల్డంత స్పేస్ వేస్ట‌వుతుంది.  మీరు ఆటోసేవ్ ఆప్ష‌న్ డిజేబుల్ చేసినా కూడా గ్యాల‌రీలో సేవ్ అవ‌దు త‌ప్ప వాట్సాప్లో అది స్టోర‌యి స్పేస్ పోతుంది. ఈ ఆర్టిక‌ల్‌లో వాట్సాప్ యూజ్ చేసుకుంటున్న స్టోరేజ్ స్పేస్‌ను ఎలా త‌గ్గించుకోవ‌చ్చో చూడండి.  
ఎక్కువ స్పేస్ తీసుకుంటున్న చాట్స్‌ను గుర్తించండి
ఫ‌స్ట్ మీ వాట్సాప్‌లో ఎక్కువ స్పేస్ తీసుకుంటున్న బిగ్గెస్ట్ చాట్స్ ఏమిటో గుర్తించండి. మీరు స్టోరేజ్, ఐ క్లౌడ్ యూసేజ్ స్క్రీన్‌ను చూస్తే మొత్తం వాట్సాప్ యూసేజ్ ఎంతో క‌నిపిస్తుంది. ఇప్పుడు వాట్సాప్ ఓపెన్ చేసి బాట‌మ్‌లో ఉన్న‌ సెట్టింగ్స్‌లోకి వెళ్లి Data and Storageలోకి వెళ్లి Storage Usageమీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మీకు ఎక్కువ స్పేస్ ఆక్ర‌మించిన గ్రూప్స్‌, చాట్స్ లిస్ట్ క‌నిపిస్తుంది.  వీటిలో నుంచి మీరు డిలీట్ చేయాల‌నుకున్న‌ది గుర్తించ‌వ‌చ్చు. 
చాట్స్‌ను ఎక్స్‌పోర్ట్‌, క్లియ‌ర్ చేయండి
మీరు కావాల‌నుకుంటే చాట్స్‌ను ఎక్స్‌పోర్ట్ చేసుకోవ‌చ్చు. చాట్‌ను రైట్‌స్వైప్ చేస్తే అది మీరు సెలెక్ట్ చేసుకున్న థ‌ర్డ్ పార్టీ ప్రోగ్రామ్  (వ‌న్ డ్రైవ్‌, గూగుల్ డ్రైవ్‌, వ‌న్ నోట్ లేదా ఐ క్లౌడ్‌)లో సేవ్ అవుతుంది. ఆ   త‌ర్వాత  clear a chatను టాప్ చేస్తే ఆ చాట్ మొత్తం డిలీట్ అవుతుంది. 
* మీరు ఒక చాట్‌ను క్లియ‌ర్ లేదా ఎక్స్‌పోర్ట్ చేయాలంటే రూట్ నుంచి లెఫ్ట్‌కు స్వైప్ చేసి మోర్ ఐకాన్‌ను టాప్ చేస్తే చాలు.  
ఇప్పుడు మీకు చాలా స్పేస్ మిగులుతుంది. మీరు ఏదైనా గ్రూప్‌లో నుంచి ఎగ్జిట్ అయినా ఆ డేటా అంతా డిలీట్ కాదు. మీరు క్లియ‌ర్ చాట్‌లోకి వెళ్లి దాన్ని క్లియ‌ర్ చేయాలి.
* ఇలా  ఐక్లౌడ్‌లేదా ఏదైనా థ‌ర్డ్ పార్టీ ప్రోగ్రాంలో మీ వాట్సాప్ చాట్ డేటాను సేవ్ చేసుకుంటే ఫోన్ పోయినా మీ డేటా భ‌ద్రంగా ఉంటుంది. 
* చాట్ బ్యాక‌ప్ త‌ర్వాత చూస్తే మీకు ఎంతప్లేస్ మిగిలిందో తెలుస్తుంది.  
ఆండ్రాయిడ్ డివైస్‌ల్లో వాట్సాప్ సైజ్ త‌గ్గించుకోవ‌డం ఎలాగో మ‌రో ఆర్టిక‌ల్‌లో చూద్దాం.  

జన రంజకమైన వార్తలు