• తాజా వార్తలు

కాంటాక్ట్స్‌ని యాడ్ చేయకుండా ఆండ్రాయిడ్‌లో వాట్స‌ప్ మెసేజ్‌లు పంపడానికి బెస్ట్ ట్రిక్స్

ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఇన్‌స్టంట్‌గా మెసేజ్‌లు పంప‌డానికి వాట్స‌ప్‌ను మించిన యాప్ మ‌రొక‌టి ఉండ‌దు. సంప్ర‌దాయ మెసేజ్‌ల‌ను జ‌నం ప‌క్క‌న‌పెట్టి వాట్స‌ప్‌నే వాడుతున్నారు. రోజుకు దాదాపు బిలియ‌న్ యూజ‌ర్లు వాట్స‌ప్ చాట్‌ను ఉప‌యోగిస్తున్నార‌నేది ఒక అంచ‌నా. ఉద‌యం లేవ‌గానే వాట్స‌ప్ చూడ‌డం మెసేజ్‌లు అందుకోవ‌డం లేదా పంప‌డం మ‌న జీవితంలో భాగం అయిపోయింది. మెసేజ్‌లు మాత్ర‌మే కాదు ఫొటోలు, వీడియోలు సుల‌భంగా పంపే వీలుండ‌డం వ‌ల్ల వాట్స‌ప్ ఇంత‌గా పాపుల‌ర్ అయింది అయితే వాట్స‌ప్‌లో మ‌న కాంటాక్ట్స్‌కు మాత్ర‌మే మెసేజ్‌లు పంప‌గ‌లం మ‌రి కాంటాక్ట్స్ యాడ్ చేయ‌కుండా మ‌నం ఆండ్రాయిడ్‌, ఐఫోన్‌లో వాట్స‌ప్ మెసేజ్‌ల‌ను ఎలా పంపాలో తెలుసా?

సేవ్ చేయ‌ని నంబ‌ర్‌కు మెసేజ్‌లు పంపాలంటే..
వాట్స‌ప్ డైరెక్ట్ ద్వారా మీరు అన్ సేవ్డ్ నంబ‌ర్ల‌కు సైతం వాట్స‌ప్ ద్వారా మెసేజ్‌లు పంపే అవ‌కాశం ఉంది. ఈ యాప్‌లో సింపుల్‌, క్లీన్ ఇంట‌ర్‌ఫేస్ ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్‌, ఐఫోన్‌, విండోస్ ఫోన్ల‌లో ప‌ని చేస్తుంది. దీన్ని ఇన్‌స్టాల్ చేసుకోవాల్సిన అవ‌స‌రం కూడా లేదు. ఇది వెబ్ యాప్ కావ‌డంతో మీ హోమ్ స్క్రీన్ మీద షార్ట్ క‌ట్‌గా యాడ్ అవుతుంది. వాట్స‌ప్ క్లిక్ టు చాట్ ఫీచ‌ర్‌ని ఉప‌యోగించుకుని ఇది ప‌ని చేస్తుంది. దీని వ‌ల్ల మీ అడ్రెస్ బుక్‌లో లేని నంబ‌ర్ల‌కు కూడా సుల‌భంగా మెసేజ్‌లు పంపే అవ‌కాశం ఉంది. 

1. మీ మొబైల్ డివైజ్‌లో వాట్స‌ప్ డైరెక్ట్ మీద క్లిక్ చేయాలి

2 మీరు మెసేజ్ పంపాల‌నుకున్న వారి కంట్రీ కోడ్ ఎంట‌ర్ చేయాలి

3. వాళ్ల  ఫోన్ నంబ‌ర్ ఎంట‌ర్ చేయాలి. మెసేజ్‌ల‌ను యాడ్ చేయాలి

4. త‌ర్వాత సెండ్ బ‌ట‌న్ ట్యాప్ చేస్తే చాలు. 

ఇలా కూడా పంపొచ్చు
ఆండ్రాయిడ్‌లో అయితే కొన్ని యాప్‌ల‌ను ఉప‌యోగించి అన్ సేవ్డ్ నంబ‌ర్ల‌కు సైతం మెసేజ్‌లు పంపొచ్చు.  సెండ్ వాట్స‌ప్ మెసేజ్ వితౌట్ యూజింగ్ కాంటాక్ట్ అనే యాప్ కూడా మీకు ఇందుకు ఉప‌యోగ‌ప‌డుతుంది. దీనిలో ఉండే బెస్ట్‌, సింపుల్ ఇంట‌ర్‌ఫేస్ వ‌ల్ల మీ వాడ‌కం కూడా చాలా సుల‌భంగా ఉంటుంది. క్విక్ మెసేజ్ అనే యాప్ కూడా మీకు ఇదే ప‌ని చేసి పెడుతుంది. కానీ ఇది యాడ్ బేస్డ్‌గా ప‌ని చేస్తుంది. కాల్ లాగ్ నుంచి నంబ‌ర్‌ను కాపీ చేసి నేరుగా వారికి వాట్స‌ప్ నుంచి మెసేజ్ పంపొచ్చు. దీనిలో డివైజ్ కూడా చాలా చ‌క్క‌గా ఉంటుంది. 

జన రంజకమైన వార్తలు