• తాజా వార్తలు

వాట్సాప్‌లో ఎవ‌రైనా  మిమ్మ‌ల్ని బ్లాక్ చేస్తే..అన్‌బ్లాక్ చేయడానికి ట్రిక్ 

వాట్సాప్‌లో మీ ఫ్రెండ్స్ ఎవ‌రైనా మిమ్మ‌ల్ని బ్లాక్ చేశారా? అయితే దాన్ని మీరే అన్‌బ్లాక్ చేసి వాళ్ల‌ను స‌ర్‌ప్రైజ్ చేయొచ్చు. వాట్సాప్‌లో వ‌చ్చిన ఈ సీక్రెట్ ఫీచ‌ర్ వాట్సాప్ పాత, కొత్త వెర్ష‌న్లు అన్నింటిలోనూ ప‌ని చేస్తుంది. వాట్సాప్ ఇప్పుడు అంద‌రికీ అవ‌స‌రంగా మారుతోంది.  ఇలాంట‌ప్పుడు మిమ్మల్నిఎవ‌రైనా బ్లాక్‌చేసినా అన్‌బ్లాక్ చేసే ఈ ట్రిక్‌ను ఎలా చేయాలో నేర్చుకోండి.
ఎలా అన్‌బ్లాక్ చేయాలి?
1. మీ వాట్సాప్ చాట్ అంత‌టినీ బ్యాక‌ప్ తీసుకోండి. త‌ర్వాత వాట్సాప్ యాప్‌ను అన్ ఇన్‌స్టాల్ చేయండి.
2. త‌ర్వాత ప్లే స్టోర్‌లోకి వెళ్లి యాప్‌ను మ‌ళ్లీ ఇన్‌స్టాల్ చేయండి. 
3. ఓపెన్‌చేసి లాగిన్ అవ్వండి
4. మీ ప్రొఫైల్ పిక్చ‌ర్ రిమూవ్ చేయండి.చాట్స్ అన్నీ డిలీట్ చేయండి. గ్రూప్స్ అన్నింటిలో నుంచి లెఫ్ట్ అవండి.
5. వాట్సాప్ setting  ఆప్ష‌న్‌లోకి వెళ్లి Account క్లిక్ చేయండి.
6. మీ మొబైల్ నెంబ‌ర్‌ను ఎంట‌ర్ చేయండి. ఇప్పుడు మీ అకౌంట్‌ను డిలీట్ చేయండి.
6. డేటాను క్లియ‌ర్‌చేయండి. 
7. ఇప్పుడు మ‌ళ్లీ మీ మొబైల్‌లో నుంచి వాట్సాప్ అన్ ఇన్‌స్టాల్ చేయండి.
8. మ‌ళ్లీ ప్లే స్టోర్‌లోకి వెళ్లి వాట్సాప్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి.
9. యాప్‌ను ఓపెన్‌చేసి ఓటీపీ వెరిఫై చేయ‌డం ద్వారా లాగిన్ అవ్వండి.
అంతే.. వాట్సాప్‌లో మిమ్మ‌ల్ని బ్లాక్ చేసిన ఫ్రెండ్స్ అంద‌రినీ మీరు అన్‌బ్లాక్ అయిన‌ట్లే. ఇప్పుడు మీరు వాళ్ల‌కు మెసేజ్‌లు పంపేసిస‌ర్‌ప్రైజ్ చేయొచ్చు. 

జన రంజకమైన వార్తలు