• తాజా వార్తలు
  •  

రెండు ఫోన్ల‌లో ఒకే వాట్స‌ప్ అకౌంట్‌ను ఉప‌యోగించ‌డం ఎలా?

స్మార్ట్‌ఫోన్ వాడుతున్నాం అంటే క‌చ్చితంగా వాట్స‌ప్‌ను డౌన్‌లోడ్ చేస్తాం.సాధార‌ణంగా ఒక ఫోన్‌లో ఒక వాట్స‌ప్ అకౌంట్ వాడ‌డ‌మే మీకు తెలుసు. డ్యుయ‌ల్ సిమ్ ఉన్నా కూడా ఒక అకౌంట్‌కు మాత్ర‌మే ప‌ర్మిష‌న్ ఉంటుంది. అయితే ఒక వాట్స‌ప్ అకౌంట్‌ను రెండు ఫోన్ల‌లా వాడొచ్చా? .. అలా కూడా సాధ్యం కాదు. ఎందుకంటే ఆ సిమ్ ఒక్క ఫోన్లో మాత్ర‌మే వేయ‌గ‌లం. అప్ప‌డు మాత్ర‌మే వాట్స‌ప్ వెరిఫికేష‌న్ చేసుకోగ‌ల‌దు. మ‌రి ఒకే వాట్స‌ప్ అకౌంట్‌ను రెండు ఫోన్ల‌లో వాడాలంటే ఏం చేయాలి?

వాట్స‌ప్ వెబ్ ద్వారా..
వాట్స‌ప్ గురించి ఎక్కువ‌మందికి తెలుసు.  కానీ వాట్స‌ప్ వెబ్ గురించి ఎంతమందికి తెలుసు. ఒక‌వేళ తెలిసినా ఉప‌యోగించేవాళ్లు ఎంత‌మంది?..దీన్ని ఉప‌యోగించ‌డం ద్వారా ఒకే అకౌంట్‌ను మ‌నం మ‌ల్టీపుల్ ప్లేస్‌ల‌లో ఉప‌యోగించే అవ‌కాశం ఉంటుంది.అంటే వాట్స‌ప్‌ను ఒకే స‌మ‌యంలో మొబైల్ మ‌రియు ప‌ర్స‌న‌ల్ కంప్యూట‌ర్‌లో ఉప‌యోగించే అవ‌కాశం ఉంటుంది ఈ ఫీచ‌ర్ ద్వారా. అయితే వాట్స‌ప్ వెబ్ ద్వారా ఉప‌యోగించ‌డం కొంత‌మందికి తెలుసు. కానీ వాట్స‌ప్ వెబ్‌ను ఉప‌యోగిస్తు రెండు ఆండ్రాయిడ్ ఫోన్ల‌ను వాడ‌డం ఎలాగో తెలుసుకుందాం.  దీని వ‌ల్ల మీరు మీ పిల్ల‌ల వాట్స‌ప్ చాట్ హిస్ట‌రీని కూడా హ్యాక్ చేయ‌చ్చు. అదెలాగో చూద్దాం.

ఎలా ఉప‌యోగించాలంటే..
ముందుగా లేటెస్ట్ వాట్స‌ప్ వెర్ష‌న్‌ను మీ ఆండ్రాయిడ్ ఫోన్లో డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇక్క‌డ మెనూ ఆప్ష‌న్ మీద క్లిక్ చేయాలి. ఈ ఆప్ష‌న్ క్లిక్ చేయ‌గానే మీరు ఒక స్కాన్ కోడ్ ఓపెన్ అవుతుంది. ఆ స్కాన్ కోడ్ పీసీలో స్కాన్ చేయ‌గానే మ‌న వాట్స‌ప్ చాట్ పీసీలోనూ ప్ర‌త్య‌క్షం అవుతుంది. అయితే ఇది పీసీ కోసం స‌రిపోతుంది. మ‌రి వేరే మొబైల్‌లో మ‌న వాట్స‌ప్ ఓపెన్ చేసుకోవాలంటే వాట్‌స్కాన్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేయాల్సి ఉంటుంది. దీన్ని ఇన్‌స్టాల్ చేసి మ‌న వాట్స‌ప్ కోడ్ స్కాన్ చేస్తే మీ చాట్ వ‌చ్చేస్తుంది. దీని వ‌ల్ల మీరు వాట్స‌ప్ హిస్ట‌రీతో పాటు ఇమేజ్‌ల‌ను కూడా చూడొచ్చు. మెసేజ్‌ల‌ను రెండు ఫోన్ల నుంచి కూడా పొందొచ్చు. పేరెంట‌ల్ కంట్రోల్ కోసం ఉప‌యోగ‌ప‌డుతుంది. వాట్స‌ప్ మెసేజ్‌ల‌ను ట్రాక్ చేయ‌డానికి ఇదో మంచి ప్ర‌త్యామ్నాయం.

జన రంజకమైన వార్తలు