• తాజా వార్తలు

ఫోన్ స్క్రీన్‌ పగిలినా, ట‌చ్ ప‌ని చేయ‌క‌పోయినా.. మీ డేటాను యాక్సెస్ చేసుకోవ‌డానికి చిట్కాలు

వేల‌కు వేలు ఖ‌ర్చు పెట్టి కొన్న స్మార్ట్‌ఫోన్ పొర‌పాటున ప‌గిలిపోతే మ‌ళ్లీ స్క్రీన్ వేయించుకోవాలంటే చాలా ఖర్చ‌వుతుంది. ఈలోగా ట‌చ్ పని చేయ‌క‌పోతే కాంటాక్ట్స్ ఏమీ తీసుకోలేం. ఫోన్ నెంబ‌ర్ల నుంచి బ్యాంకు ట్రాన్సాక్ష‌న్ల వ‌ర‌కూ ఇప్పుడు అంతా స్మార్ట్‌ఫోన్ల మ‌య‌మే. బ‌స్‌టికెట్లకు రెడ్‌బ‌స్‌, అబీబ‌స్‌.. సినిమా టికెట్ల‌కు బుక్‌మై షో, ఈకామ‌ర్స్ సైట్లు మ‌న వివ‌రాలు, అడ్ర‌స్‌, బ్యాంకు డిటెయిల్స్‌, క్రెడిట్ కార్డ్ నెంబ‌ర్లు అన్నీ ఫోన్‌లో ఉండ‌డంతో ఫోన్ ప‌గిలిపోయి ట‌చ్ స్క్రీన్ ప‌ని చేయ‌క‌పోతే మైండ్ ప‌ని చేయ‌ని ప‌రిస్థితి చాలా మందికి అనుభ‌వ‌మే. ఇలాంట‌ప్పుడు కూడా ఫోన్‌ లోని డేటాను తీసుకోవ‌చ్చు. స్క్రీన్‌ పగిలినా, టచ్‌ పనిచేయకపోయినా ఫోన్‌లోని డేటాను యాక్సిస్ చేసుకోవ‌డానికి చిట్కాలున్నాయి. మీ స్మార్ట్‌ ఫోన్‌ను అన్‌లాక్‌ చేసేందుకు కొన్ని ప్రొసీజర్స్‌ అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఏదో ఒక ప్రొసీజర్‌ను మీరు అనుసరించటం ద్వారా ఫోన్‌ను అన్‌లాక్‌ చేయవచ్చు.
ఆండ్రాయిడ్ కంట్రోల్ ప్రోగ్రామ్‌
ముందుగా Android Control Program సాఫ్ట్‌వేర్‌ను ఇంటర్నెట్‌ నుంచి కంప్యూటర్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. ఇప్పుడు మీ ప‌గిలిపోయిన ఫోన్‌ ను కంప్యూటర్‌ కు యూఎస్‌బీ కేబుల్ తో కనెక్ట్‌ చేయండి. కీబోర్డ్‌ సహాయంతో ఆండ్రాయిడ్‌ కంట్రోల్‌ ప్రోగ్రామ్‌ మీ ఫోన్‌కు సంబంధించి యాక్సిస్‌ను ఎనేబుల్‌ చేసి మౌస్‌ అలానే కీబోర్డ్‌ ద్వారా ఆపరేట్‌ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. కీబోర్డ్‌ సహాయంతో ఫోన్‌ను అన్‌లాక్‌ చేసుకుని డేటా మొత్తాన్ని వేరొక డివైస్‌లోకి ట్రాన్స్‌ ఫర్‌ చేసుకోవచ్చు.
డివైజ్‌ మేనేజర్‌
ఇది మ‌రో ప‌ద్ధ‌తి. మీ కంప్యూటర్‌ నుంచి ఆండ్రాయిడ్‌Device managerవెబ్‌ సైట్‌ లోకి వెళ్లండి. దెబ్బ‌తిన్న మీ ఆండ్రాయిడ్‌ డివైస్‌లో గూగుల్‌ అకౌంట్‌ అలానే జీపీఎస్‌ ఫీచర్లు ఎనేబుల్‌ చేసి ఉన్నట్లయితే ఆ అకౌంట్‌లోకి లాగినై స్కాన్‌ చేయండి. మీ డివైస్‌ కనెక్ట్‌ అయిన వెంటనే ఆండ్రాయిడ్‌ డివైస్‌ మేనేజర్‌ పేజీలో Ring, Lock, Erase ఆప్షన్‌లు కనిపిస్తాయి. వాటిలో లాక్‌ ఆప్షన్‌ పై క్లిక్‌ చేయండి. అప్పటికే, మీ ఫోన్‌ లాక్‌ అయి ఉంటుంది కాబట్టి అన్‌లాక్‌ అవుతుంది.
మూడో పద్దతి.. వైజ‌ర్‌
Vysor అనే అప్లికేషన్‌ను ఉపయోగించుకుని కూడా కంప్యూటర్‌ ద్వారా మీ ఆండ్రాయిడ్‌ డివైస్‌ను కంట్రోల్‌ చేసుకోవచ్చు. దీనిలో యూఎస్‌బీ సహాయంతో మీ ఫోన్‌ను కంప్యూటర్‌కు కనెక్ట్‌ చేసి ఫోన్‌లో ఉన్న డేటాను తీసుకోవచ్చు. ఇలా మీకు అందుబాటులో ఉన్న పద్దతిలో ఫోన్‌ లోని డేటాను తీసుకోవచ్చు.

జన రంజకమైన వార్తలు