• తాజా వార్తలు
  •  

ఏ వైఫై నెట్ వర్క్ కి అయినా కనెక్ట్ అయి ఉన్న డివైస్ లను తెలుసుకోవడం ఎలా?

మీ వై ఫై నెట్ వర్క్ కి కనెక్ట్ అయి ఉన్న డివైస్ లను తెలుసుకోవడానికి ఏదైనా యాప్ ఉందేమో అని వెదుకుతున్నారా? అయితే మీ ప్రశ్నకు సమాధానం ఈ ఆర్టికల్ లో దొరుకుతుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఇంటర్ నెట్ లేని ప్రపంచాన్ని మనం ఊహించలేము.మీ ఇంటి దగ్గర నుండీ కార్పొరేట్ ఆఫీస్ ల వరకూ మీ డివైస్ వై ఫై కనెక్షన్ కోసం వెదుకుతూ ఉంటుంది. ప్రస్తుతం ఆండ్రాయిడ్ తో లభిస్తున్న అన్ని స్మార్ట్ ఫోన్ లలోనూ వైఫై టెక్నాలజీ ఉంటుంది. ఏ స్మార్ట్ ఫోన్ కైనా ఈ వైఫై అనేది ఒక ముఖ్యమైన భాగంగా తయారు అయింది. మీ ఇంట్లో ఉన్న వైఫై రూటర్ ను మీరు కాకుండా వేరే ఎవరైనా వాడుతున్నారేమో తెలుసుకోవాలని ఉందా? అయితే గూగుల్ ప్లే స్టోర్ లో దీనికోసం అనేక టూల్ లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో అత్యుత్తమమైన రెండు టూల్ లను నేటి ఈ ఆర్టికల్ లో మా కంప్యూటర్ విజ్ఞానం పాఠకుల కోసం అందిస్తున్నాం.
1. Netx – నెట్ వర్క్ డిస్కవరీ టూల్స్
మీ వైర్ లెస్ నెట్ వర్క్ అంతటినీ మరియు దానికి కనెక్ట్ అయి ఉన్న డివైస్ లన్నింటినీ అత్యుత్తమ క్వాలిటీ తో స్కాన్ చేస్తుంది. వై ఫై కి సంబందించిన అతి ముఖ్యమైన సమాచారం అయిన ఐపి అడ్రెస్స్, MAC అడ్రస్, వెండర్, బొంజుర్ నేమ్, నెట్ బయోస్ నేమ్ మరియు డొమైన్ లాంటి వాటిని మీకు చూపిస్తుంది.దీనిలో ఉండే సరికొత్త వేక్ ఆన్ లాన్ టెక్నాలజీ మీ డివైస్ ను రిమోట్ లాగా పనిచేయిస్తుంది. రిమోట్ డివైస్ లో ఇన్ స్టాల్ అయి ఉన్న ఆపరేటింగ్ సిస్టం ను చూపించే సెక్యూర్ షెల్ ను కూడా ఇది కలిగిఉంది. ఏ డివైస్ అయినా ఆఫ్ లైన్ అవుతుంటే దానిని పర్మినెంట్ గా డిలీట్ చేస్తుంది.
2. వైఫై ఇన్ స్పెక్టర్
వై ఫై నెట్ వర్క్ లేకుండా మీకు ఇంటర్ నెట్ కు యాక్సెస్ లభించదు.మీ నెట్ వర్క్ ను షేర్ చేసుకోవడానికి హాట్ స్పాట్ కోసం మీ డివైస్ ను టెథరింగ్ చేయడం అనేది ఒక పెద్ద పనిగా పరిగణించవచ్చు. ఎవరైనా అపరిచిత వ్యక్తి మీ అనుమతి లేకుండా మీ వైర్ లెస్ నెట్ వర్క్ కు కనెక్ట్ అయి ఉంటె మీరు ఏం చేస్తారు? ఖచ్చితంగా ఇలాంటి సందర్భాలలో మీ బ్రౌసింగ్ స్పీడ్ స్లో అవుతుంది .అంతేగాక మీ డేటా ను కూడా తస్కరించే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితులలో మీకు వైఫై ఇన్ స్పెక్టర్ బాగా ఉపయోగపడుతుంది. మీ కంప్యూటర్ అయినా, లాప్ ట్యాప్ అయినా లేక స్మార్ట్ ఫోన్ అయినా దాని నెట్ వర్క్ కు కనెక్ట్ అయి ఉన్న పరికరాలను స్కాన్ చేసి వాటిని మీకు చూపిస్తుంది. ఇది కూడా netx మాదిరిగానే మీ వైఫై కి సంబందించిన అన్ని వివరాలను ఇస్తుంది.

జన రంజకమైన వార్తలు

విజ్ఞానం బార్ విశేషాలు