• తాజా వార్తలు

యూఎస్‌బీ డ్రైవ్‌తోనే కంప్యూట‌ర్‌ను ఆఫ్ చేయడానికి చిట్కా

పీసీ మీద లేదా ల్యాప్‌టాప్ మీద వ‌ర్క్ చేసుకుంటున్నారు. ప‌ని అయిపోయాక ఆఫ్ చేయాలంటే ష‌ట్‌డౌన్ క‌మాండ్ నొక్కుతారు. కానీ ష‌ట్ డౌన్ బ‌ట‌న్ నొక్క‌కుండా యూఎస్‌బీ డ్రైవ్‌తో సిస్ట‌మ్‌ను ష‌ట్ డౌన్ చేసే ట్రిక్ మీకు తెలుసా?  ఆ ట్రిక్ ఏమిటో, ఎలా చేయాలో చూద్దాం ప‌దండి
 

యూస్‌బీ ష‌ట్‌డౌన్‌తో
యూఎస్‌బీ ష‌ట్‌డౌన్ అనే ఫ్రీ వేర్‌తో మీ ల్యాపీ లేదా పీసీని యూఎస్‌బీ డ్రైవ్ ఉప‌యోగించి ష‌ట్ డౌన్ చేయొచ్చు. మీ ప‌ని అయిపోయాక జ‌స్ట్ సిస్టం నుంచి యూఎస్‌బీ డ్రైవ్‌ను రిమూవ్ చేస్తే చాలు సిస్టం ష‌ట్ డౌన్ అయిపోతుంది. మీరు యూఎస్‌బీ డ్రైవ్ ఇన్‌సర్ట్ చేసినా కూడా ష‌ట్‌డౌన్ అయిపోతుంది. కాబ‌ట్టి ముందే ఇన్‌స‌ర్ట్ చేసి ఆ త‌ర్వాత సిస్టం ఆన్ చేయండి.

1. యూఎస్‌బీ ష‌ట్‌డౌన్ పోర్ట‌బుల్ యాప్‌ను మీ పీసీలో లేదా ల్యాపీలో డౌన్‌లోడ్ చేయండి.  

2. యాప్ డౌన్‌లోడ్ చేశాక USBShutdown.exeని అడ్మినిస్ట్రేట‌ర్‌గా సిస్ట‌మ్‌లో ర‌న్ చేయాలి. 

3. యాప్‌ను ర‌న్ చేయ‌డానికి ముందే మీ సిస్ట‌మ్‌కు యూఎస్‌బీ పెన్‌డ్రైవ్‌ను ఇన్‌స‌ర్ట్ చేయాలి. ఇన్‌స‌ర్ట్ చేశాక యాప్ ర‌న్ చేస్తే అది బ్యాక్‌గ్రౌండ్‌లో ర‌న్న‌వుతుంటుంది.

4.మీరు ప‌ని అయిపోయాక సిస్టం నుంచి యూఎస్‌బీ డ్రైవ్‌ను బ‌య‌టకు తీసేయండి.  ఇప్పుడు You are about to be signed out అనే మెసేజ్ మీ సిస్టం మీద క‌నిపిస్తుంది. మీరు యూఎస్‌బీ డ్రైవ్ తీసేశాక కూడా సిస్టం వాడుకోవాల‌నుకుంటే యాప్ ఇంట‌ర్‌ఫేస్‌లో ఉన్న abort shutdown ఆప్ష‌న్ క్లిక్ చేస్తేసిస్టం ష‌ట్ డౌన్ కాకుండా నిలిచిపోతుంది. అలా చేయ‌క‌పోతే నిముషంలోప‌ల మీ సిస్టం ష‌ట్ డౌన్ అయిపోతుంది.  

    యూఎస్‌బీ ష‌ట్‌డౌన్ ఆప్ష‌న్ విండోస్ 7, విండోస్ 8, విండోస్ 8.1, విండోస్ 10 ఓఎస్‌ల‌తో న‌డిచే పీసీలు, ల్యాపీల్లో ప‌నిచేస్తుంది.

జన రంజకమైన వార్తలు