• తాజా వార్తలు
  •  

టిప్స్ అండ్ ట్రిక్స్‌: పేటీఎం గురించి చాలామందికి తెలియ‌ని టిప్స్ అండ్ ట్రిక్స్‌

డీమానిటైజేష‌న్ పుణ్య‌మా అని దేశంలో చాలామందికి పేటీఎం యాప్ గురించి తెలుసు. మొబైల్  ద్వారా ఈ యాప్‌కు డ‌బ్బులు చెల్లించొచ్చ‌ని.. డ‌బ్బులు రిసీవ్ చేసుకోవ‌చ్చ‌ని  కూడా అంద‌రికి తెలిసిన విష‌యం. అయితే పేటీఎంను ఉప‌యోగించేట‌ప్పుడు కొన్ని టిప్స్ పాటిస్తే మ‌రింత స‌మ‌ర్థంగా ఉప‌యోగించుకోవ‌చ్చు. మ‌రి ఆ టిప్స్ అండ్ ట్రిప్స్ ఏమిటో చూద్దాం..

ఫింగ‌ర్‌ప్రింట్ అథంటికేష‌న్‌
పేటీఎంతో మ‌నం ఎన్నో ఆర్థిక లావాదేవీలు చేస్తాం. దీనికి పాస్‌వ‌ర్డ్‌లు స‌రిగా పెట్టుకోక‌పోతే మ‌న ఖాతాలో ఉన్న డ‌బ్బులు మాయం కావ‌డం ఖాయం. ఇందుకోసం పేటీఎం ఎన్నో సెక్యూరిటీ ఆప్ష‌న్లు అందిస్తోంది. అందులో కీల‌క‌మైంది.  ఫింగ‌ర్ ప్రింట్ అథంటికేష‌న్‌.  ఈ ఆప్ష‌న్‌ను మ‌నం డిజేబుల్ చేసుకుంటే చాలు మీ వాలెట్ మిస్‌యూజ్ కాకుండా ప్రొటెక్ట్ చేసుకోవ‌చ్చు. బ‌యో మెట్రిక్ ద్వారా మీరు పిన్ సెట్ చేసుకుంటే స‌రిపోతుంది. ఇదే కాక యాప్‌లాక్ పాస్‌వ‌ర్డ్‌ను కూడా సెట్ చేసుకోవచ్చు.   

ఆటోమెటిక్ రీలోడ్ 
పేటీఎంలో ఉన్న మ‌రో ఆప్ష‌న్ ఆటోమెటిక్ రీలోడ్‌. ప‌దే ప‌దే  వాలెట్ టాప్ అప్స్ చేసే వాళ్ల‌కు ఇది ఉప‌యోగ‌ప‌డుతుంది. అంటే మీ అకౌంట్ బాలెన్స్ త‌క్కువ‌గా ఉంటే వెంట‌నే ఈ ఆప్ష‌న్ రీలోడ్ చేస్తుంది.  ఆ యాప్‌కు క‌నెక్ట్ అయి ఉండే క్రెడిట్‌, డెబిట్ కార్డులు క‌నెక్ట్ అయి ఉండ‌డం వ‌ల్ల  డ‌బ్బులు కూడా వెంట‌నే రీలోడ్ అవుతాయి. దీని వ‌ల్ల మీరు ప‌నిగ‌ట్టుకుని మ‌నీ యాడ్ చేసుకోవాల్సిన అవ‌స‌రం ఉండ‌దు.

ఆటోమెటిక్ పేమెంట్స్‌
ఆటోమెటిక్ రీలోడ్ లాగా ఆటోమెటిక్ పేమెంట్స్ అనే ఆప్ష‌న్ కూడా ఉంది పేటీఎంలో. డీటీఎల్‌, టెలిఫోన్‌, క‌రెంట్ బిల్లులు చెల్లించ‌డం ఇవ‌న్నీ ప్ర‌తినెలా మ‌న‌కు సంబంధం లేకుండానే జ‌రిగిపోతాయి. అయితే మ‌నం మ‌నీ లోడ్ చేసుకుని పెట్టుకోవాలి.  ఆటోమెటిక్ పేమెంట్ ఆప్ష‌న్‌ను సెల‌క్ట్ చేసుకోవాలి. పేమెంట్ మోడ్‌, ఎంత  పే చేయాలి.. ఎప్పుడు పే చేయాలి లాంటి వివ‌రాలు ఇవ్వాలి. 

స్టోర్స్ నియ‌ర్ బై
మీ చేతిలో డ‌బ్బులు లేక‌పోతే.. మీరేమ‌న్నా కొనాల‌నుకుంటే..పేటీఎం నియ‌ర్ బై ఆప్ష‌న్ ఉప‌యోగ‌ప‌డుతుంది. ఆ స్టోర్ వివ‌రాలు మీకు రావ‌డం వ‌ల్ల అక్క‌డికి వెళ్లి పేటీఎం ట్రాన్సాక్ష‌న్ చేయ‌చ్చు.  బ్లూ బార్ మెనూలో కుడి చేతి వైపు ఆ ఆప్ష‌న్ ఉంటుంది.    

పేటీఎం గోల్డ్‌
ఎంఎంటీసీ, పీఏఎంపీ సౌజ‌న్యంతో పేటీఎం గోల్డ్ అమ్మ‌కాల‌ను ప్రారంభించింది. దీని ద్వారా ఎవ‌రైనా ఆన్‌లైన్‌లో 24 క్యారెట్ల బంగారాన్ని కొనుగోలు చేయ‌చ్చు. డిజిట‌ల్ గోల్డ్ మీద ఇన్‌వెస్ట్ చేయ‌డానికి ఈ ఆప్ష‌న్ ఉపయోగ‌ప‌డుతుంది. మీ ఇంటికే గోల్డ్ నేరుగా వ‌చ్చేస్తుంది.  దీంతో పాటు డ‌బ్బుల‌ను పంపించుకునే లిఫాఫా, యూపీఐ లాంటి ఆప్ష‌న్లు పేటీఎంలో ఉన్నాయి.                                     

జన రంజకమైన వార్తలు

విజ్ఞానం బార్ విశేషాలు