చైనా మొబైల్ కంపెనీ షియోమి రెడ్మీ సిరీస్‌లో మరో కొత్త మోడల్ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది.రెడ్మీ నోట్ 5 పేరుతో నిన్ననే ఫస్ట్ ఫ్లాష్ సేల్ కూడా ప్రారంభించింది. 10వేల లోపు ధరలోనే 4జీబీ ర్యామ్, బీజిల్‌లెస్ డిస్ప్లే వంటి ఫీచర్లతో ఈ ఫోన్ ఇప్పుడు బాగా క్రేజ్ సంపాదించుకుంది. ఫ్లాష్ సేల్‌లో ఎంఐ మొబైల్ కొనడం చాలా కష్టం. ఎందుకంటే షియోమి నుంచి కొత్త మొబైల్ వస్తుందంటే చాలా ఆతృతగా ఎదురుచూస్తుంటారు. నిమిషాలోనే అన్నీ అమ్ముడైపోతాయి. నిన్న జరిగిన ఫ్లాష్ సేల్‌లో మీరు రెడ్మీ నోట్5 కొందామని ట్రైచేసినా అప్పటికే స్టాక్ అయిపోయిందని చూపించిందా? మళ్లీ ఈ నెల 28న మరోసారి ఫ్లాష్ సేల్ రానుంది. ఈసారి ఫ్లాష్ సేల్‌లో రెడ్మీ నోట్5 ఫోన్ కచ్చితంగా కొనుక్కోవాలంటే ఈ ట్రిక్ పాటించండి.
స్క్రిప్ట్ ట్రిక్ ద్వారా
స్క్రిప్ట్ ట్రిక్ ద్వారా మీరు ఫ్లాష్ సేల్‌లో ఈజీగా ఫోన్ కొనుక్కోవచ్చు. స్క్రిప్ట్ ట్రిక్ అంటే దీనిలో ఒక కోడ్ ఉంటుంది. దీన్ని క్లిక్‌చేసి పర్టిక్యులర్ వెబ్‌పేజీ లింక్‌ను ఆటోమేటిక్‌గా క్లిక్ చేస్తుంది. ఇది మిల్లీ సెకండ్లలో ఆటోమేటిగ్గా రన్ అవుతుంది. కాబట్టి ఫ్లాష్ సేల్‌లో మొబైల్ కొనడం మిస్సవ్వదు.
ఇలా చేయండి
1.ఫ్లిప్‌కార్ట్ లేదా ఎంఐ.కామ్‌లో ఫ్లాష్ సేల్కు 5 నిముషాల ముందు రెడ్మీ నోట్5 మొబైల్ బయ్ పేజీకి వెళ్లండి.
2.రిజిస్టర్ లేదా లాగిన్ అవ్వండి
3.ఇప్పుడు మీకు ఫ్లిప్ కార్ట్‌లో అయితే setInterval(function(){ var d = new Date(); var eta = 1454999400000-d.getTime(); console.log(eta/1000); if(eta<0){ $(‘.sale-btn’).trigger(‘click’); } },10); అనే స్క్రిప్ట్ కనిపిస్తుంది. దీన్ని అప్లయి చేయండి. మీ బ్రౌజర్లో రైట్ క్లిక్‌తో దీన్నిఓపెన్ చేసి ఇన్స్పెక్ట్ ఎలిమెంట్లోకి వెళ్లి కన్సోల్ చేయండి.[ Right Click >> Inspect Element >> Console) ఎంఐ.కామ్‌లో మరో డిఫరంట్ స్క్రిప్ట్ ఉంటుంది.
4. Enterను ప్రెస్ చేయండి. అంతే మీ స్క్రిప్ట్ వర్కవుట్ అవడం ప్రారంభమవుతుంది.
5. రెడ్మీ ఫ్లాష్‌సేల్ మొబైల్ సైట్ ఓపెన్‌కాగానే మొబైల్ ఫ్లిప్‌కార్ట్ లేదా ఎంఐ.కామ్‌లోని మీ కార్ట్‌లో ఆటోమేటిగ్గా యాడ్ అయిపోతుంది.
6.మీరు Checkout ను క్లిక్ చేసి ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకోండి. 15 నిముషాల్లో ఈ ప్రాసెస్ పూర్తయిపోవాలి.
ఈ జాగ్రత్తలు పాటించండి
* మీ డేటా కనెక్షన్ స్పీడ్‌గా ఉండేలా చూసుకోండి. బ్రాడ్‌బ్యాండ్ లేదా వైఫైకనెక్షన్ వాడండి
* ఒక బ్రౌజర్లో స్క్రిప్ట్ ట్రిక్ ద్వారా ట్రై చేస్తూనే ఇంకో బ్రౌజర్లో మాన్యువల్‌గా కూడా ప్రయత్నించండి
*