• తాజా వార్తలు

రెడ్‌మీ5 ఫోన్ గురించి మీకు క‌చ్చితంగా తెలియ‌ని సూప‌ర్ ట్రిక్స్‌

షియోమి.. త‌న రెడ్‌మీ సిరీస్ ఫోన్ల‌లో భాగంగా రీసెంట్‌గా లాంచ్ చేసిన రెడ్‌మీ 5 యూజ‌ర్లను బాగానే ఆక‌ట్టుకుంటోంది. ఎప్ప‌టిక‌ప్పుడు ఈ ఫోన్ల‌లో ఫీచ‌ర్లు అప్‌డేట్ చేస్తున్న షియోమి..రెడ్‌మీ 5లోనూ చాలా కొత్త ఫీచ‌ర్ల‌ను ప్ర‌వేశ‌పెట్టింది. అవేంటో ఓ లుక్కేద్దాం రండి. 
 

యాప్స్‌కి ఫుల్ స్క్రీన్ మోడ్ Fullscreen Mode for Apps
రెడ్‌మీ 5 స్మార్ట్‌ఫోన్‌18:9 డిస్‌ప్లేతో వ‌చ్చింది. ఇది ఫోన్ డిస్‌ప్లేకి మామూలు వాటికంటే మ‌రింత ఎక్కువ స్పేస్ ఇస్తుంది. అంటే ఫోన్ చిన్న‌గా ఉన్నా డిస్‌ప్లే పెద్ద‌గా ఉంటుంది. అయితే ఇలాంటి ఫోన్ల‌లో యాప్స్ అన్నీ ఫుల్ డిస్‌ప్లే రావు.కొన్ని యాప్స్ అయితే అంత డిస్‌ప్లే రాక కిందా పైనా న‌ల్ల‌టి బోర్డ‌ర్ లైన్స్ వ‌స్తాయి. చూడ్డానికి ఎబ్బెట్టుగా కనిపిస్తుంది. అయితే రెడ్‌మీ 5లో ఈ ఇబ్బందిని తొల‌గించేలా యాప్స్‌కి ఫుల్ స్క్రీన్ మోడ్ తీసుకొచ్చింది.   దీన్ని ఎనేబుల్ చేసుకోవాలంటే  Settings > Additional Settings > Button and gesture shortcutsలోకి వెళ్లి  Fullscreen modeని అప్ల‌యి చేసుకోవాలి.    
 

క‌స్ట‌మైజ్ యాప్ వాలెట్ Customize App Vault
యాప్ వాల్ట్ అనేది రెడ్‌మీ 5లో వ‌చ్చిన మ‌రో ఇంట్ర‌స్టింగ్ ఫీచ‌ర్‌.  హోం స్క్రీన్‌లో లెఫ్ట్ నుంచి రైట్‌కు స్వైప్ చేస్తే చాలు యాప్ షార్ట్ క‌ట్స్‌, నోట్స్‌, యాప్స్, వాటికి సంబంధించి నోటిఫికేష‌న్  అన్నింటినీ ఒకే విండోలో చూడొచ్చు. ఇండియ‌న్ యూజ‌ర్స్ కోసం దీనిలో ఇండియా స్పెసిఫిక్ ఫీచ‌ర్ల‌ను కూడా తెచ్చింది.
 

క్విక్ బాల్ (Quick Ball)
రెడ్‌మీ 5లో ఇంట‌ర్‌ఫేస్‌ను ఈజీగా నావిగేట్ చేయ‌డానికి క్విక్ బాల్ అనే కొత్త ఫీచ‌ర్‌ను తెచ్చింది. ఇది ఫోన్ డిస్‌ప్లే మీద ఫ్లోటింగ్ బాల్‌లా ఉంటుంది. దీన్ని టాప్ చేసి ర‌క‌ర‌కాల కమాండ్స్‌ను యాక్సెస్‌చేయొచ్చు. దీన్ని ఎనేబుల్ చేసుకోవాలంటే Settings > Additional settings లోకి వెళ్లి  Quick ballను సెలెక్ట్ చేయాలి. Turn on Quick ball ప‌క్క‌నున్న టూగుల్‌ను ఆన్ చేయాలి. ఈ క్విక్ బాల్‌ను స్క్రీన్ మీద ఎక్క‌డైనా పెట్టుకోవ‌చ్చు.
 

సెకండ్ స్పేస్ (Second Space)
ఇక రెడ్‌మీ 5లో అదిరిపోయే ఫీచ‌ర్ అంటే సెకండ్ స్పేస్ గురించే చెప్పుకోవాలి.  సెకండ్ స్పేస్‌తో మీరు ఒకే ఫోన్‌లో ఒకేలాంటి యాప్‌లు రెండు వాడుకోవ‌చ్చు. అంటే ఒకే ఫోన్‌లో రెండు వాట్సాప్‌లు లేదా రెండు ఫేస్‌బుక్ అకౌంట్లు వాడుకోవ‌చ్చు. దీంతో మీరు ప‌ర్స‌న‌ల్ ఒక‌టి, ఆఫీస్ లేదా బిజినెస్ ప‌ర్ప‌స్ మ‌రొక‌టి యూజ్ చేసుకునే సౌల‌భ్యం ఏర్ప‌డుతుంది.  సెకండ్ స్పేస్‌ను ఎనేబుల్ చేసుకోవాలంటే Settings > Second Space లోకి వెళ్లి Turn on Second Space అనే బ‌ట‌న్‌ను టాప్ చేయాలి. సెకండ్   స్పేస్ ఎనేబుల్ చేసుకున్నాక ఒకే ఫోన్‌లో రెండు ఫోన్లు వాడుతున్న‌ట్లే.  సెకండ్ స్పేస్‌ను డిజేబుల్ చేయాలంటే notification shadeని కిందికి లాగి  permanent space switching అనే నోటిఫికేష‌న్‌ను టాప్ చేయాలి. మీ లాక్ స్క్రీన్ పాస్‌వ‌ర్డ్‌తో క‌న్ఫ‌ర్మ్ చేస్తే సెకండ్ స్పేస్ డిజేబుల్ అవుతుంది.
 

గెస్చ‌ర్స్, బ‌ట‌న్స్‌తో మ‌రింత ప్రభావ‌వంతంగా 
గెస్చ‌ర్స్‌తో కెమెరా లాంచ్ చేయ‌డం, స్క్రీన్ షాట్లు తీసుకోవ‌డం, గూగుల్ అసిస్టెంట్‌ను లాంచ్ చేయ‌డం వంటివి చేసుకోవ‌చ్చు. అంతేకాదు ఈ యాక్ష‌న్స్ అన్నింటినీ మీకు కావాల్సిన‌ట్లు క‌స్ట‌మైజ్ చేసుకోవ‌చ్చు.  ప‌వ‌ర్ బ‌ట‌న్ లేదా వాల్యూమ్ బ‌ట‌న్‌ను రెండుసార్లు టాప్ చేస్తే కెమెరా ఆన్ అయ్యేలా, లేదంటే రెండు, మూడు వేళ్ల‌తో స్లైడ్ చేస్తే స్క్రీన్‌షాట్లు తీసుకునేలా మార్చుకోవ‌చ్చు.  ఇందుకోసం Settings > Additional settings> Button and gesture Shortcutని ఎనేబుల్ చేసుకోవాలి.
 

స్ప్లిట్ స్క్రీన్ మ‌ల్టీటాస్కింగ్ (Split-Screen Multitasking)
రెడ్‌మీ 5.. 5.7ఇంచెస్ డిస్‌ప్లేతో వ‌చ్చింది. అదికూడా బీజిల్‌లెస్ డిస్‌ప్లే కావ‌డంతో ఈజీగా మ‌ల్టీటాస్కింగ్ చేసుకోవ‌చ్చు మ‌ల్టీ టాస్కింగ్‌ను స్టార్ట్ చేయాలంటే recent బ‌ట‌న్‌ను టాప్ చేసి స్క్రీన్ పైభాగాఉన్న Split screen బ‌ట‌న్‌ను టాప్ చేయాలి. ఇప్పుడు కావ‌ల్సిన యాప్‌లు సెలెక్ట్ చేస్తే స్ప్లిట్ స్క్రీన్ మోడ్ ఓకే అయిపోతుంది. స్ప్లిట్ స్క్రీన్‌ను స‌గం స‌గం వ‌స్తుంది. కావాలంటే ఒక స్క్రీన్ సైజు త‌గ్గించి, మ‌రొక‌టి పెంచుకోవ‌చ్చు.
 

క‌స్ట‌మైజ‌బుల్ వ‌న్ హ్యాండెడ్ మోడ్‌      
ఫోన్‌ను సింగిల్ హ్యాండ్‌తో ఆపేట్ చేసేలా వ‌న్‌హ్యాండెడ్ మోడ్ సెట్ చేసుకోవ‌చ్చు. Settings -> Additional settings -> One-handed modeను సెలెక్ట్ చేయండి. ఇప్పుడు స్క్రీన్ సైజ్‌ను అక్క‌డున్న ఆప్ష‌న్ల‌లో ఒక‌దాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఆ సైజ్‌కు మీ స్క్రీన్ రీసైజ్ అవుతుంది.
 

హోం స్క్రీన్ లేఅవుట్ లాకింగ్ 
మీ హోం స్క్రీన్‌మీద ఉన్న‌యాప్స్ నోటిఫికేష‌న్ సెట్టింగ్స్ మాటిమాటికీ క‌దిలిపోకుండా హోం స్క్రీన్ లేఅవుట్‌ను లాక్ చేసుకోవ‌చ్చు.   హోం స్క్రీన్‌ను రెండు వేళ్ల‌తో పించ్‌చేసి ఎడిటింగ్ మోడ్‌లోకి ఎంట‌ర‌వ్వాలి. Lock Home screen layout ఆప్ష‌న్‌ను అనేబుల్ చేసుకోవాలి. ఇవేకాక నావిగేష‌న్ బార్‌ను క‌స్ట‌మైజ్ చేసుకోవ‌చ్చు. 
 

జన రంజకమైన వార్తలు