• తాజా వార్తలు
  •  

ఇంట‌ర్నేష‌నల్ కాల్స్ చేయ‌డానికి 5 బెస్ట్ ఆండ్రాయిడ్ యాప్స్ ఇవీ   

ఇండియాలో మొబైల్ టారిఫ్ చౌక‌యిపోయింది. డేటా చీప్‌గా వస్తుంది. VoLTE టెక్నాల‌జీ వ‌చ్చాక వాయిస్ కాల్స్‌కు డెడ్ చీప్ అయిపోయాయి.  కానీ ఇదంతా మీరు మీ టెలికం స‌ర్కిల్‌లో ఉన్నంత వ‌ర‌కే ఒక్క‌సారి మీరు రోమింగ్‌లోకి వెళితే బిల్లు చూస్తే క‌ళ్లు తిర‌గ‌డం ఖాయం.  ముఖ్యంగా ఇంట‌ర్నేష‌న‌ల్ కాల్స్‌, డేటా, రోమింగ్ ఛార్జెస్ ఇప్ప‌టికీ చాలా ఎక్కువ‌గా ఉన్నాయి. దీనికి చ‌క్క‌టి ప‌రిష్కారంగా ఇంట‌ర్నేష‌నల్ కాల్స్‌ను కేవ‌లం డేటా ఖ‌ర్చుతో చేసుకోగ‌లిగే యాప్స్ ఆండ్రాయిడ్‌లో ఉన్నాయి.  అవేంటో చూడండి.. చూసి వాడుకోండి.  
విబ‌ర్ (Viber)
ఇంట‌ర్నెట్ క‌నెక్ష‌న్ ఉంటే చాలు ఈ ఆండ్రాయిడ్ యాప్‌తో దేశ విదేశాల్లో ఉన్న మీ ఫ్రెండ్స్‌, రిలేటివ్స్‌తో వాయిస్ కాల్ చేసుకోవ‌చ్చు.  వీడియో కాల్ మాట్లాడుకోవ‌చ్చు. చాట్ చేసుకోవ‌చ్చు. విబ‌ర్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకుంటే మీ కాంటాక్ట్ లిస్ట్‌తో ఆటోమేటిగ్గా సింక్ చేసుకుని కాల్స్ చేసుకుంటుంది.  మొబైల్స్‌కే కాకుండా ల్యాండ్ లైన్స్‌కు కూడా కాల్ చేసుకోగ‌ల‌గ‌డం దీనిలో ఉన్న పెద్ద అడ్వాంటేజ్ 
స్కైప్ (Skype)
విదేశాల్లో ఉన్న పిల్ల‌ల‌తో, ఫ్రెండ్స్‌, రిలేటివ్స్‌తో మాట్లాడుకునేవారికి ఇప్పుడు స్కైప్ బాగా పాపుల‌ర్ యాప్‌. కానీ ఇది 2003 నుంచే అందుబాటులో ఉంద‌ని చాలా మందికి తెలియ‌దు. మ‌న ద‌గ్గ‌ర డేటా చౌక‌య్యాక ఇది జ‌నాల్లో బాగా పాపుల‌ర‌యింది. దీని ద్వారా విదేశాల్లో ఉన్న‌వారితో టెక్స్ట్ చాట్‌, వీడియో చాట్ చేయొచ్చు. దీనిలో కూడా మొబైల్‌, ల్యాండ్‌లైన్ల‌కు కాల్ చేసే ఆప్ష‌న్ ఉంది. అయితే మిగిలిన యాప్స్‌తో పోల్చితే స్కైప్‌లో కాలింగ్ కొద్దిగా ఎక్స్‌పెన్సివ్‌.  ఈ యాప్ వాడుకోవాలంటే అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. అవ‌త‌లివారికి కూడా యాప్ ఉండాలి. 
డింగ్‌టోన్ (Dingtone)
మీ మొబైల్ ఫోన్‌ను వాకీటాకీలా వాడుకోవాలంటే, వాయిస్ చాట్స్ చేసుకోవాల‌న్నా డింగ్ టోన్ యాప్ ఉండాల్సిందే. ఇత‌ర డింగ్‌టోన్ యూజ‌ర్ల‌కు దీనితో కాల్ చేసుకోవ‌చ్చు. ప్రీమియం (పెయిడ్‌) వెర్ష‌న్ యాప్ తీసుకుంటే కాల్ బ్లాకింగ్‌, కాల్ ఫార్వార్డింగ్ కూడా చేసుకోవ‌చ్చు.  
ఫేస్‌బుక్ మెసెంజ‌ర్ (Facebook Messenger)
 ఫేస్‌బుక్‌లాగే ఫేస్‌బుక్ మెసెంజ‌ర్ యాప్ కూడా ప్ర‌పంచంలో అత్య‌ధిక మంది వాడే యాప్స్‌లో  ఒక‌టి.   దీంతో మీ ఫేస్‌బుక్ ఫ్రెండ్స్ లిస్ట్‌లో ఉన్న ఎవ‌రితోనైనా చాట్ చేసుకోవ‌చ్చు.  మీ కాంటాక్ట్స్‌ను సింక్ చేసుకుని ఈ యాప్ లేని వాళ్ల‌తో కూడా చాట్ చేయొచ్చు.  దీంతో ఫ్రీ కాల్స్ చేసుకోవ‌చ్చు. గ్రూప్ కాలింగ్ ఆప్ష‌న్ కూడా ఉంది. అయితే స్పామ్ కాల్స్‌, వైర‌స్ ఎటాక్ అవ‌డం వాటి ప్రాబ్ల‌మ్స్ ఉన్నాయి. కాల్ క్వాలిటీ కూడా చాలాసార్లు పూర్‌గా ఉంటుంది.  
వోనేజ్ (Vonage)
లాండ్ లైన్లు ఫోన్లు మాత్ర‌మే వాడుతున్న‌వారికి బాగా యూజ్‌ఫుల్ యాప్ ఇది.  దీనిలో యూజ‌ర్ ఒక అకౌంట్‌తో రెండు మొబైల్ నెంబ‌ర్ల‌కు క‌నెక్ట్  అయి ఇంట‌ర్నేష‌న‌ల్ కాల్స్ మాట్లాడుకోవ‌చ్చు. లాండ్, మొబైల్ ఫోన్ నుంచి కూడా కాల్స్‌చేసుకోవ‌చ్చు. గ్రూప్ మెసేజింగ్‌, వీడియో మెసేజింగ్ వంటి ఫీచ‌ర్లున్నాయి. అయితే  AT&T,  T-Mobile స‌బ్‌స్క్రైబ‌ర్ల‌కు మాత్ర‌మే ఈ యాప్ ప‌ని చేస్తుంది. అది కూడా అమెరిక‌న్ ఫోన్ నెంబ‌ర్ల‌కు మాత్ర‌మే కాల్ చేయ‌గలం. కాబ‌ట్టి ఈ యాప్ మ‌న‌కు ఉపయోగ‌ప‌డ‌దు.  

జన రంజకమైన వార్తలు

విజ్ఞానం బార్ విశేషాలు