• తాజా వార్తలు
  •  

జియో సిమ్ లేకున్నా జియో మ్యూజిక్ యాప్ వాడ‌డానికి ట్రిక్స్

హై క్వాలిటీ మ్యూజిక్ వినాల‌ని ఎవ‌రికి ఉండ‌దు? అందుకే సావ‌న్‌, గానా లాంటి యాప్‌ల‌ను డ‌బ్బులు పెట్టి మ‌రీ కొంటుంటారు సంగీత ప్రియులు. అయితే జియో త‌న క‌స్ట‌మ‌ర్ల కోసం జియో మ్యూజిక్ యాప్‌ను అందిస్తోంది. ఇది కేవ‌లం క‌స్ట‌మ‌ర్ల‌కు మాత్ర‌మే. అంటే జియో సిమ్ ఉంటే మాత్ర‌మే మ‌నం ఈ మ్యూజిక్‌ను ఆస్వాదించొచ్చు. అయితే మీరు ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌, ఐడియా, బీఎస్ఎన్ఎల్ లాంటి నెట్‌వ‌ర్క్స్ ఉప‌యోగిస్తూ కూడా 4జీ సిమ్ లేకుండా జియో మ్యూజిక్ యాప్ ద్వారా సంగీతం విన‌డం ఎలాగో తెలుసా?

ఏంటీ జియో మ్యూజిక్ యాప్‌?
త‌న క‌స్ట‌మ‌ర్ల కోసం జియో అందిస్తోన్న యాపే ఈ మ్యూజిక్ యాప్‌. దీని ద్వారా మ‌నం అన్‌లిమిటెడ్ హెచ్‌డీ మ్యూజిక్‌ను పొందొచ్చు. అంతేకాదు మీకు న‌చ్చిన భాష‌ల్లో మీ ఫేవ‌రెట్ సాంగ్స్‌ను వినే అవ‌కాశాన్ని అందిస్తోంది ఈ యాప్‌. విన‌డం మాత్ర‌మే కాదు మీకు న‌చ్చిన పాట‌ల్ని ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకునే స‌దుపాయం కూడా దీనిలో ఉంది. సావ‌న్‌,  గానా లాంటి యాప్‌లు సాంగ్స్ డౌన్‌లోడ్ కోసం అద‌నంగా ఛార్జ్ చేస్తాయి కానీ జియో మాత్రం ఎలాంటి అద‌న‌పు రుసుములు లేకుండా పాట‌ల్ని డౌన్‌లోడ్ చేసుకునే ఛాన్స్ ఇస్తోంది. 

ఈ యాప్‌ను ఎందుకు వాడాలంటే..
1. డ‌బ్బులు చెల్లించాల్సిన అవ‌స‌రం లేదు
2. ఎలాంటి యాడ్స్ ఉండ‌వు
3. 320 కేపీబీఎస్‌తో హైక్వాలిటీ స్పీడ్‌
4. రేడియో, సాంగ్స్‌ను ఆఫ్‌లైన్‌లోనూ డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు
5. స్మార్ట్ రిక‌మండేష‌న్స్‌, కాల‌ర్ ట్యూన్స్‌ను ఎన్నిసార్లైనా మార్చుకోవ‌చ్చు. ఇది పూర్తిగా ఉచితం.

4జీ సిమ్ లేకుండా ఎలా పొందాలంటే..
1. మొద‌ట మోడెడ్ ఏపీకేను డౌన్‌లోడ్ చేసుకోవాలి
2. ఆ యాప్‌ను మీ ఫోన్లో ఇన్‌స్టాల్ చేసుకోవాలి
3. ఆ త‌ర్వాత మీ స్నేహితుల జియో ఐడీ ద్వారా లాగిన్ కావాలి. లేక‌పోతే ఒక‌సారి జియో సిమ్ మీ ఫోన్లో వేసుకుని తీసేసినా చాలా లాగిన్ అవుతుంది
4. అంతే.. అంద‌రూ జియో యూజ‌ర్ల మాదిరిగానే మీరూ మ్యూజిక్ యాప్‌ను వాడుకోవ‌చ్చు. పాట‌లు వినొచ్చు. డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. 

జన రంజకమైన వార్తలు