• తాజా వార్తలు
  •  

ఏరోప్లేన్ మోడ్‌లో చేయ‌గ‌ల ట్రిక్స్ ఇన్న‌న్ని కాద‌యా!

మ‌న సెల్‌ఫోన్లు అన్నింటిలోనూ ఏరో ప్లేన్ మోడ్ ఉంటుంది. రెగ్యుల‌ర్ సెట్టింగ్స్‌లో క‌నిపించే ఈ ఏరో ప్లేన్ మోడ్ మ‌నం ఉప‌యోగించ‌డ‌మే చాలా త‌క్కువ‌. అస‌లు ఈ ఏరోప్లేన్ మోడ్ కథేంటి? ఏరోప్లేన్ మోడ్‌లో చేయ‌గ‌లిగిన ట్రిక్స్ ఏంటో చూద్దాం రండి..
ఏరోప్లేన్ మోడ్ అంటే..
ఏరోప్లేన్ మోడ్ అంటే మీ సిగ్న‌ల్స్ ట్రాన్స్‌మిష‌న్‌ను అడ్డుకునే ఓ ఏర్పాటు. విమాన‌యాన సంస్థ‌లు ప్ర‌యాణికులు వైర్‌లైస్ డివైస్‌లు తీసుకెళ్ల‌నివ్వ‌వు. అయితే సెల్‌ఫోన్లు వ‌చ్చాక అది కుద‌ర‌ని ప‌ని కావ‌డంతో ఫోన్ సిగ్న‌ల్స్ విమానం ప్ర‌యాణానికి అవ‌స‌ర‌మైన సిగ్న‌ల్స్‌ను అడ్డుకోవ‌డం, అంత‌రాయం క‌లిగించ‌డం వంటివి చేయ‌కుండా ఈ ఏరోప్లేన్ మోడ్‌ను సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఇత‌ర స్మార్ట్ డివైస్‌ల్లో పెట్టారు.ఈ మోడ్‌లో మీ డివైస్‌ను పెడితే మీ సెల్యుల‌ర్ క‌నెక్ష‌న్ డిజేబుల్ అవుతుంది. కాబ‌ట్టి మీరు కాల్స్‌చేయ‌లేరు. రిసీవ్ చేసుకోలేరు. మెసేజ్ పంప‌లేరు. మొబైల్ డేటా కూడా వాడుకోలేరు.  వైఫై కూడా క‌నెక్ట్ కాదు. బ్లూటూత్ ప‌ని చేయ‌దు.
బ్యాట‌రీ సేవింగ్‌.. ఫాస్ట్ ఛార్జింగ్‌
ఏరోప్లేన్ మోడ్లో మీ ఫోన్ ఎలాంటి మొబైల్ నెట్‌వ‌ర్క్‌ను యాక్సెస్ చేయ‌లేదు  కాబట్టి ఈ మోడ్‌లో ఉంచితే బ్యాట‌రీ ఆదా అవుతుంది. అంతేకాదు మీరు అర్జెంటుగా ఫుల్‌ ఛార్జింగ్ పెట్టాలంటే  ఏరోప్లేన్ మోడ్‌లో ఉంచి ఛార్జింగ్ పెట్టండి. ఫాస్ట్‌గా ఛార్జింగ్ అవుతుంది.
 వైఫై వాడొచ్చు
ఇప్పుడు వ‌స్తున్న లేటెస్ట్ ఫోన్ల‌లో ఈ ఫీచ‌ర్ ఉంది. మీరు ఏరోప్లేన్ మోడ్ ఆన్ చేయ‌గానే వైఫై ఆఫ్ అయిపోతుంది. కొన్ని సెక‌న్స్ ఆగి మ‌ళ్లీ వైఫై ఆన్ చేస్తే ఆన్ అవుతుంది.  ఇప్పుడు దాదాపు అన్ని ఎయిర్‌లైన్స్‌లు ఇన్‌ఫ్లైట్ వైఫెను ఆఫ‌ర్ చేస్తున్నాయి కాబ‌ట్టి ఈ ఫీచ‌ర్ బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది.
బ్లూటూత్ ప‌నిచేస్తుంది
ఇది కూడా వైఫై లాగానే. . మీరు ఏరోప్లేన్ మోడ్ ఆన్ చేయ‌గానే బ్లూటూత్ ఆఫ్ అయిపోతుంది. షార్ట్ క‌ట్ కీస్‌లోంచి మళ్లీ బ్లూటూత్ ఆన్ చేస్తే ఆన్ అవుతుంది.  అయినా బ్లూటూత్ సిగ్న‌ల్ రేంజ్ త‌క్కువ కాబ‌ట్టి  ఎయిర్‌లైన్స్ మీ బ్లూటూత్ గురించి ప‌ట్టించుకోవు. బ్లూటూత్ ప‌నిచేస్తుంటే మీ డివైస్‌ల‌ను కీబోర్డ్‌కి లేదా ఇయ‌ర్ ఫోన్స్ వంటి వాటికి క‌నెక్ట్ చేసుకుని వాడుకోవ‌చ్చు.
గేమ్స్‌కీ ప‌నికొస్తుంది
మీరు యాడ్స్ లేకుండా గేమ్స్ ఆడాల‌నుకుంటున్నారా? అయితే ఏరోప్లేన్ మోడ్ మీకు హెల్ప్‌చేస్తుంది.  ఈ మోడ్‌లో మీ నెట్ క‌నెక్ష‌న్ డిజేబుల్ అవుతుంది కాబ‌ట్టి యాడ్స్ రావు. అయితే ఎప్పుడూ ఆన్‌లైన్‌లో మాత్ర‌మే ఆడ‌గ‌లిగే ఈ ట్రిక్ ఉప‌యోగ‌ప‌డదు.
* ఏరోప్లేన్ మోడ్‌లో అలారం ప‌నిచేస్తుంది.
* మీరు మీ ఫోన్‌లో సేవ్ చేసుకున్న మ్యూజిక్‌ను, వీడియోల‌ను ఎంజాయ్ చేయొచ్చు. 

* జీపీఎస్ ఎలాంటి రేడియో వేవ్స్‌ను ట్రాన్స్‌మిట్ చేయ‌దు కాబ‌ట్టి కొన్ని డివైస్‌ల్లో ఏరోప్లేన్ మోడ్ ఆన్‌లో ఉన్నా కూడా జీపీఎస్ ప‌నిచేస్తుంది.

జన రంజకమైన వార్తలు