కంప్యూటర్ నుండి ఎలాంటి ఫైల్‌నయినా మీ స్మార్ట్‌ఫోన్‌కు ట్రాన్స్ఫర్ చేయాలంటే ఏం చేస్తారు? ఈ మెయిల్ చేసి అక్కడి నుంచి ఫోన్లో డౌన్లోడ్ చేస్తారు. లేదంటే డేటా కేబుల్‌తో ట్రాన్స్ఫర్ చేస్తారు. వాటికంటే ఈజీ వే ఉంది. అదే పోర్టల్.
ఏంటీ పోర్టల్?
పోర్టల్ అనేది ఒక యాప్. ఐవోఎస్, ఆండ్రాయిడ్ ప్లే స్టోర్ల నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీని ద్వారా వైఫై ఉపయోగించి ఫైల్ లేదా ఫుల్ ఫోల్డర్‌ను కంప్యూటర్ నుంచి ఫోన్‌కు ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు.
ఆండ్రాయిడ్‌లో పోర్టల్‌ను వాడడం ఎలా?
1. పోర్టల్ యాప్‌ను ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోవాలి.
2. పోర్టల్ యాప్‌ను ఓపెన్ చేసి పీసీలో క్యూ ఆర్ కోడ్‌ను స్కాన్ చేసుకోవాలి. అది మీ ఫోన్ కెమెరాను యాక్సెస్ చేయడానికి పర్మిషన్ అడుగుతుంది. ఆ పర్మిషన్ ఇస్తే మీ ఫోన్లో పోర్టల్ సెటప్ ఓకే అయినట్లే.
3. ఇప్పుడు మీ పీసీలోంచి ఫైల్‌ను డ్రాగ్ చేసి పోర్టల్ యాప్‌లో డ్రాప్ చేయండి. ఇప్పుడు ఆ ఫైల్ మీ ఫోన్లో కనిపిస్తుంది. ఆ ఫైల్‌ను ఓపెన్ చేసి షేర్ బటన్‌ను టాప్ చేయండి.
4.ఈ సెషన్ క్లోజ్ అవగానే మీరు ట్రాన్స్ఫర్ చేసిన మొత్తం ఫైల్స్ లిస్ట్ కనిపిస్తుంది. ఆండ్రాయిడ్‌లో ఇమేజెస్, మ్యూజిక్ డిస్ప్లే కావు. ఎందుకంటే అవి
మీ ఫోన్లోని ఆయా ఫోల్డర్లలో సేవ్ అవుతాయి.
5. ఒకవేళ మీ ఫోన్లో ఇమేజెస్, మ్యూజిక్ ఫైల్స్ ఆటో సేవ్ కాకపోతే పోర్టల్ సెట్టింగ్స్ మెనూలోకి వెళ్లండి. రైట్ కార్నర్లో ఉన్న మూడు డాట్స్‌ను క్లిక్ చేసి సెట్టింగ్స్‌ను సెలక్ట్ చేసుకోండి.
6. మీరు ఫైల్ ఎక్కడ సేవ్ చేయాలనుకుంటున్నారో దాన్ని అనేబుల్ చేయండి. అంతే మీ పీసీలోని ఫైల్స్ మీ ఫోన్లోకి సేవ్ అయిపోతాయి.
అంతే. ఈ ప్రాసెస్ జరగాలంటే మీ ఫోన్, పీసీ రెండూ వైఫైతో కనెక్ట్ అయి ఉండాలి. ఐవోఎస్‌లో కూడా ఇదే ప్రొసీజర్