• తాజా వార్తలు
  •  

వాట్సాప్‌ను మీ మాతృభాషలో వాడ‌డానికి టిప్స్‌

వాట్సాప్‌.. ఈ పేరు తెలియ‌ని స్మార్ట్‌ఫోన్ యూజ‌ర్లు ప్ర‌పంచంలో లేరు. స‌మాచార మార్పిడిలో ఓకొత్త విప్ల‌వాన్ని సృష్టించిన ఈ మెసెంజ‌ర్ యాప్ నిర‌క్ష‌రాస్యుడిని కూడా చేరిపోయింది. భాష రాన‌క్క‌ర్లేదు. క‌నిపించిన దృశ్యాన్నిఫొటో తీసి సెండ్ చేసి కూడా త‌న భావాన్నివ్య‌క్త‌ప‌రిచే సౌక‌ర్యం వాట్సాప్ సొంతం. అందుకే వాట్సాప్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా 200 కోట్ల మందికి పైగా వాడుతున్నారు. దీనికి ఉన్న క్రేజ్‌చూసి ఫేస్‌బుక్ వాట్సాప్‌ను కొనేసింది. అయితే వాట్సాప్‌లో మెసేజ్ పంపాలంటే ఇంగ్లీష్‌లోనే పంపాల‌ని చాలామంది అనుకుంటారు. అదేం కాదు. మీ మాతృభాష‌లో కూడా వాట్సాప్ మెసేజ్ పంపుకోవ‌చ్చు. అది కూడా చాలా సింపుల్ ట్రిక్‌.. ఎలా చేయాలో చూసిమీరు కూడా మీ మాతృభాష‌లో మెసేజ్‌లు పంపేసుకోండి మ‌రి.
 

10 భార‌తీయ భాష‌ల్లో ల‌భ్యం
ఇండియాలోనూ వాట్సాప్‌కు కోట్ల మంది యూజ‌ర్లున్నారు. అందుకే మ‌న దేశంలోని ప్ర‌ముఖ భాషల్లో ప‌దింటిని వాట్సాప్ త‌న సెట్టింగ్స్‌లో చేర్చింది. హిందీ,బెంగాలీ, పంజాబీ, మ‌రాఠీ, తెలుగు, త‌మిళం, మ‌లయాళం, క‌న్న‌డ, ఉర్దూ, గుజ‌రాతీ భాష‌ల్లో మ‌నం వాట్సాప్ మెసేజ్‌లు పంపుకోవ‌చ్చు. దీనికోసం వాట్సాప్ సెట్టింగ్స్ లోనే మీకు కావాల్సిన లాంగ్వేజ్‌ను సెట్ చేసుకోవ‌చ్చు.

1. వాట్సాప్ ఓపెన్‌చేసి మెనూ బ‌ట‌న్ నొక్కండి.
2. సెట్టింగ్స్‌లోకి వెళ్లి చాట్ బ‌ట‌న్ క్లిక్ చేసి App Languageను ఓపెన్ చేయండి.
3. ఇప్పుడు మీకు ఇంగ్లీష్‌తోపాటు పైన చెప్పిన 10 భాష‌ల లిస్ట్ కనిపిస్తుంది. మీకు కావాల్సిన లాంగ్వేజ్‌ను సెలెక్ట్ చేసుకోండి.
4. అంతే మీరు ఇంగ్లీష్‌లో టైప్ చేసినా అది మీ భాష‌లోకి మారిపోతుంది. ఉదాహ‌ర‌ణ‌కు మీరు తెలుగు లాంగ్వేజ్‌ను సెట్ చేసుకున్నార‌నుకోండి. ఇంగ్లీష్‌లో Ramudu అని టైప్ చేయ‌గానే తెలుగులో రాముడు అని వ‌చ్చేస్తుంది.

ఫోన్‌లోనూ మార్చుకోవ‌చ్చు
వాట్సాప్ యాప్ సెట్టింగ్స్‌లోనే కాదు మీరు ఫోన్ సెట్టింగ్స్‌లోనూ భాష మార్చుకోవ‌చ్చు.
ఆండ్రాయిడ్ ఫోన్‌లో..
1. సెట్టింగ్స్‌యాప్ ఓపెన్ చేసి Languages and Inputను టాప్ చేయాలి.
2.లాంగ్వేజెస్‌ను ఓపెన్ చేసి మీకు కావాల్సిన భాష‌ను ఎంచుకోవాలి.
3. ఇప్పుడు వాట్సాప్‌ను ఓపెన్ చేసి ఇంగ్లీష్ కీబోర్డులో టైప్‌చేసినా మీరు సెలెక్ట్ చేసుకున్న భాష‌లోనే వ‌స్తుంది.

ఐఫోన్‌లో:
1. సెట్టింగ్స్‌యాప్ ఓపెన్ చేసి  Generalను టాప్ చేయాలి.
2. అక్క‌డి నుంచి Language & Regionలోకి వెళ్లి  ఐఫోన్ లాంగ్వేజ్‌ను ఎంచుకోవాలి.
3. ఇప్పుడు మీకు కావాల్సిన భాష‌ను ఎంచుకోండి. వాట్సాప్‌ను ఓపెన్ చేసి ఇంగ్లీష్ కీబోర్డులో టైప్‌చేసినా మీరు సెలెక్ట్ చేసుకున్న భాష‌లోనే వ‌స్తుంది.


అయితే ఫోన్ సెట్టింగ్స్‌లో లాంగ్వేజ్ మారిస్తే మొత్తం ఫోన్ మోనూ అంతా ఆ లోక‌ల్ లాంగ్వేజ్‌లోకి మారిపోతుంది. కాబ‌ట్టి వాట్సాప్ యాప్‌లో లాంగ్వేజ్ మార్చుకోవ‌డ‌మే ఉత్త‌మం.

జన రంజకమైన వార్తలు