• తాజా వార్తలు
  •  

వాట్సాప్ మెసేజ్ ఫార్వార్డింగ్‌లో క‌చ్చితంగా మీకు తెలియ‌ని ట్రిక్స్ -2

వాట్సాప్ మెసేజ్‌ల‌ను ఫార్వార్డ్ చేయ‌డంలో కొన్ని ట్రిక్స్‌ను గ‌త ఆర్టిక‌ల్‌లో చెప్ప‌కున్నాం.  వాట్సాప్  క‌న్వ‌ర్సేష‌న్‌ను ఫార్వార్డ్ చేయ‌కుండానే ఒక ఫోన్ నుంచి మ‌రో ఫోన్‌కు ఎలా  పంప‌వ‌చ్చు, వాట్సాప్ చాట్‌ను ఈమెయిల్‌కు ఎలా పంపొచ్చు లాంటి ట్రిక్స్ ఈ ఆర్టిక‌ల్‌లో తెలుసుకుందాం.                     
వాట్సాప్ చాట్స్ అన్నింటినీ వేరే ఫోన్‌కు పంప‌డం ఎలా?
మీ ఫోన్ పాడైంది.  స‌ర్వీసింగ్‌కు ఇస్తే  ఫోన్ బాగు చేసి ఇచ్చాక అప్పుడు మీ వాట్సాప్ చాట్స్ అన్నింటినీ బ్యాక్ అప్ తీసుకోవ‌చ్చు.  కానీ ఈలోగానే మీ వాట్సాప్ చాట్స్ మీకు అవ‌స‌ర‌మైతే?  లేదా కొత్త ఫోన్ కొన్నాక పాత ఫోన్‌లోని చాట్స్ అన్నీ కొత్త‌దానిలోకి మార్చుకోవాల‌నుకుంటే?    దీనికో సింపుల్ చిట్కా ఉంది. 
1.వాట్సాప్ ఓపెన్ చేయండి. టాప్ రైట్ కార్న‌ర్‌లో ఉన్న మూడు చుక్క‌ల ఐకాన్‌ను క్లిక్ చేయండి. దానిలోకి వెళ్లాక సెట్టింగ్స్‌ను సెల‌క్ట్ చేయండి.
2.  త‌ర్వాత స్క్రీన్లో వ‌చ్చే Chats ఆప్ష‌న్‌ను టాప్‌చేయండి.
3. చాట్స్ ఆప్ష‌న్‌లోకి వెళ్లాక మీకు  ChatBack up ఆప్ష‌న్ క‌నిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయండి.
4. చాట్ బ్యాక‌ప్‌లోకి వెళ్లాక Back up Google Drive ఆప్ష‌న్‌ను సెలెక్ట్ చేయండి. బ్యాక‌ప్ పూర్త‌వుతుంది.
5. ఇప్పుడు వేరే ఫోన్‌లో మీ నెంబ‌ర్‌తో వాట్సాప్‌తో రిజిస్ట‌ర్ చేయండి.  అప్పుడు మీ చాట్ బ్యాక‌ప్ స్టోర్ చేయాలా అని అడుగుతుంది.  
6. Restoreను టాప్ చేయ‌గానే మీ పాత ఫోన్‌లోని వాట్సాప్ చాట్ అంతా గూగుల్ డ్రైవ్ ద్వారా మీ కొత్త ఫోన్‌లోకి వ‌చ్చేస్తుంది.. 
ఇవి గుర్తుంచుకోండి* మీరు కొత్త ఫోన్‌లో వాట్సాప్ ఓపెన్ చేయ‌గానే పాత ఫోన్‌లో సేమ్ నెంబ‌ర్‌తో ఉన్న వాట్సాప్ ప‌ని చేయ‌డం ఆగిపోతుంది. * మీరు బ్యాక‌ప్ క్రియేట్ చేయ‌డానికి ఏ గూగుల్ అకౌంట్ వాడారో కొత్త  ఫోన్‌లో రీస్టోర్ చేయ‌డానికి కూడా అదే అకౌంట్ వాడాలి. 
వాట్సాప్ మెసేజ్‌ల‌ను ఈమెయిల్‌కు పంప‌డం ఎలా?
వాట్సాప్ చాట్‌ను మొత్తం ఈమెయిల్ కూడా చేయొచ్చు.
1.వాట్సాప్ చాట్‌ను ఓపెన్ చేసి టాప్ రైట్ కార్న‌ర్‌లోని త్రీ డాట్స్‌నుక్లిక్ చేయండి. మెనూలో నుండి More క్లిక్ చేయండి.
2.  Moreలోకి వెళ్లాక Email chat ఆప్ష‌న్ సెలెక్ట్ చేయండి. 
3. వాట్సాప్ చాట్‌లో ఉన్న మీడియా (ఫొటోలు, వీడియోలు, జిఫ్‌)ను కూడా ఎటాచ్‌చేయాలా అని అడుగుతుంది.  మీరు సెలెక్ట్ చేసుకున్నాక 
కావ‌ల్సిన ఈ మెయిల్ ఐడీ టైప్ చేసి సెండ్ చేస్తేచాలు వాట్సాప్ చాట్ ఈ మెయిల్‌కు వెళ్లిపోతుంది.

జన రంజకమైన వార్తలు