• తాజా వార్తలు
  •  

టిప్స్ అండ్ ట్రిక్స్‌: ఆండ్రాయిడ్ బ్యాట‌రీ ఆప్టిమైజేష‌న్ వ‌ల్ల  డ్యామేజే ఎక్కువా?

ఆండ్రాయిడ్ బ్యాట‌రీ.. మ‌న‌కిదో పెద్ద స‌మ‌స్య‌. ఎప్పుడు బ్యాట‌రీ అయిపోతుందా అని దానివైపే చూడాల్సిన ప‌రిస్థితి. ఛార్జింగ్ అవ‌కుండానే ఛార్జింగ్ పెట్టేయాలి లేక‌పోతే ఛార్జింగ్ వెంట‌నే అయిపోయి పెద్ద ఇబ్బందే ఎదుర‌వుతుంది. అయితే ఆప్టిమైజేష‌న్ చేయ‌డం వ‌ల్ల ఏమైనా స‌మ‌స్య ప‌రిష్కారం అవుతుందా? ..అంటే  అవుతుంది అని ప‌క్కాగా చెప్ప‌లేని ప‌రిస్థితి. ఇంకో మాట చెప్పాలంటే ఆప్టిమైజేష‌న్ వ‌ల్ల లాభం కంటే న‌ష్ట‌మే ఎక్కువ. అయితే ఇలా న‌ష్టం జ‌ర‌గ‌కుండా ఉండాలంటే కొన్ని టిప్స్ పాటించాలి.

ఏం చేయాలంటే..
డివైజ్‌లో సెట్టింగ్స్ ఓపెన్ చేసి బ్యాట‌రీ ఆప్ష‌న్ క్లిక్ చేయాలి.                  

మెనూ  పైభాగంలో ఉన్న‌మూడు డాట్స్‌ను క్లిక్ చేసి బ్యాట‌రీ ఆప్టిమైజేష‌న్ ఎంచుకోవాలి

బ్లూ బార్ మీద క్లిక్ చేసి అన్ని యాప్స్‌ను సెల‌క్ట్ చేసుకోవాలి.  

బ్యాట‌రీ నుంచి ఎక్స్‌క్లూడ్ చేయాల‌నుకున్న యాప్‌ను సెల‌క్ట్ చేసుకుని డోన్ట్ ఆప్టిమైజ్ అనే ఆప్ష‌న్ క్లిక్ చేయాలి. 

అన్ని యాప్స్‌కు ఇలాగే డోన్ట్ ఆప్టిమైజ్ అనే ఆప్ష‌న్ పెట్టుకోవ‌చ్చు. 

అన్నియాప్‌ల‌కు కాదు..
అయితే అన్ని యాప్‌ల‌కు ఆప్టిమైజేష‌న్ డిజేబుల్ చేయ‌డం స‌రికాదు. దీన్ని నిపుణులు రిక‌మండ్ చేయ‌డం స‌రికాదు. ఒక‌వేళ అలా చేస్తే  ఆ యాప్‌లు మిస్ బిహేవ్ చేసే అవ‌కాశాలున్నాయి. ఫ‌లితంగా మీ బ్యాట‌రీ లైఫ్ పెరిగే బ‌దులు దాని లైఫ్ త‌గ్గిపోయే ప్ర‌మాదం ఉంది. అంతేకాదు ప‌వ‌ర్ కంజెంప్ష‌న్ పెరిగే అవ‌కాశాలు ఉన్నాయి. 
 

జన రంజకమైన వార్తలు

విజ్ఞానం బార్ విశేషాలు