• తాజా వార్తలు

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌కు అప్‌డేట్స్ రావ‌డం లేదా? ఏం చేయాలంటే..

ఆండ్రాయిడ్ ఫోన్‌..చేతిలో లేక‌పోతే ఇప్పుడు మ‌న‌కు ఊసుపోదు. ప్ర‌తి ప‌ని ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌తో లింక్ పెట్టేసుకున్నాం. ఎక్క‌డికైనా వెళుతున్నా.. షాపింగ్ చేస్తున్నా.. చివ‌రికి మార్నింగ్ వాక్ చేస్తున్నా కూడా ఆండ్రాయిడ్ ఫోన్‌ను వ‌ద‌ల‌డం లేదు.  అయితే అండ్రాయిడ్ ఫోన్‌కు ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ రావ‌డం చాలా కీల‌కం. అది మ‌రింత మెరుగ్గా ప‌ని చేయాలంటే ఈ అప్‌డేట్స్ త‌ప్ప‌నిస‌రి. అయితే ఏదైనా టెక్నిక‌ల్ కార‌ణాలతో ఆండ్రాయిడ్ ఫోన్‌లో అప్‌డేట్స్ ఆగిపోతే ఏం చేయాలి?

అప్‌డేట్స్ ఎందుకు రావు?
ఆండ్రాయిడ్ ఫెర్మార్‌మెన్స్ బాగుండాలంటే  క‌చ్చితంగా అప్‌డేష‌న్ కావాలి.  వీలైనంత త‌రుచుగా ఇది అప్‌డేట్ అవుతూ ఉంటే ఉత్త‌మం. శాంసంగ్‌, హెచ్‌టీసీ, మోట‌రోలా వీలైనంత ఎక్కువ‌సార్లు త‌మ డివైజ్‌ల‌ను అప్‌డేట్ చేయ‌డానికే ప్ర‌య‌త్నిస్తాయి. అయితే ప్ర‌తి ఫోన్‌కు ఒక ప్ర‌త్యేక‌మైన అప్‌డేటెడ్ వెర్ష‌న్ ఉంటుంది. ఆ కంపెనీలు మాత్ర‌మే ఆ వెర్ష‌న్‌ను అప్‌డేట్ చేయాల్సి వ‌చ్చేది. మ‌నంత‌ట మ‌నం ఏ అప్‌డేట్ చేసుకోలేని ప‌రిస్థితి ఉండేది. కానీ గూగుల్ దీనికి ఒక ప్ర‌త్యేక‌త‌మైన అప్‌డేటింగ్ సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. గూగుల్ విడుద‌ల చేసిన ఈ వెర్ష‌న్ అన్ని డివైజ్‌ల‌లోనూ ప‌ని చేస్తుంది. అయితే అన్ని ఫోన్లు ఈ కొత్త సాఫ్ట్‌వేర్‌ను ఎంత‌వ‌ర‌కు అడాప్ట్ చేసుకుంటాయ‌నేదే చూడాలి. శాంసంగ్, ఎల్‌జీ లాంటి కంపెనీలు తాము  డివైజ్‌ల‌ను త‌యారు చేసేట‌ప్పుడే స్టాండ్ ఔట్‌గా అప్‌డేట్స్‌ను పెట్టేస్తాయి. దీనివ‌ల్ల ఆరంభంలోనే ఒక‌టి రెండుసార్లు వెర్ష‌న్ ఛేంజ్ అవుతాయి. ఆ త‌ర్వాత అవి అలాగే ఉండిపోతాయి.
 
అప్‌డేట్స్ వేగంగా పొంద‌డం ఎలా?
మీకు ప్ర‌స్తుతం వేగంగా ఆండ్రాయిడ్ అప్‌డేట్స్ రావాలంటే గూగుల్ పిక్స‌ల్‌కు మించిన ఆప్ష‌న్ లేదు.  గూగుల్ డిజైన్ చేసి అమ్ముతున్న ఈ ఫోన్ల‌లో అప్‌డేష‌న్స్ చాలా వేగంగా ఉంటాయి. ఆండ్రాయిడ్‌లో కొత్త వెర్ష‌న్ ఎప్పుడు అందుబాటులోకి వ‌చ్చినా.. వెంట‌నే పిక్స‌ల్ కూడా అప్‌డేట్ అయిపోతుంది. రెండేళ్ల పాటు అండ్రాయిడ్ అప్‌డేట్స్‌కు ఎలాంటి ఢోకా ఉండ‌ద‌ని గూగుల్ భ‌రోసా ఇస్తోంది. పిక్స‌ల్ కొన‌లేక‌పోతే లేటెస్ట్ శాంసంగ్ గెలాక్సీ కొన్నా చాలు. మీకు ఆండ్రాయిడ్ అప్‌డేట్స్ చాలా వేగంగా ఉంటాయి. శాంసంగ్ గెలాక్సీ ఎస్‌7తో పాటు ఎస్‌8లో ఆండ్రాయిడ్ అప్‌డేట్స్ వేగంగా ఉన్నాయి. అందుకే ఏదైనా ఫోన్ కొనేముందే ముందుగా ఆండ్రాయిడ్ అప్‌డేట్స్ ఫెర్మార్‌మెన్స్ ఎలా ఉందో తెలుసుకుని కొనుక్కోవ‌డం చాలా ముఖ్యం.

జన రంజకమైన వార్తలు