• తాజా వార్తలు

మీకు క‌చ్చితంగా తెలియాల్సిన  బెస్ట్ ఆండ్రాయిడ్ ట్రిక్స్ ఇవీ..

నూటికి 90 శాతం స్మార్ట్‌ఫోన్‌లు ఆండ్రాయిడ్‌తో ర‌న్న‌య్యేవే.  ఏళ్ల త‌ర‌బ‌డి మ‌నం ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నాం. కానీ అందులో కొన్ని సింపుల్ టెక్నిక్స్‌, ట్రిక్స్ మ‌నలో చాలామందికి తెలియ‌వు.  అవేంటో తెలుసుకుంటే ఆండ్రాయిడ్ డివైస్‌ను మ‌రింత ఎఫెక్టివ్‌గా వాడుకోవ‌చ్చు. అవేంటో చూద్దాం ప‌దండి.
1. మ‌ల్టిపుల్ జీమెయిల్ అకౌంట్స్ యాడ్ చేయ‌డం
ఆండ్రాయిడ్ డివైస్‌ను జీ మెయిల్‌తో లాగిన్ కాకుండా వాడ‌లేం. కానీ  ఒక‌టి కంటే ఎక్కువ జీ మెయిల్ అకౌంట్ల‌ను కూడా దీనిలో యాడ్ చేసుకోవ‌చ్చు. 
* Settings >> Add accountsలోకివెళ్లాలి. 
* Setup New లేదా   Login with Existing account అనే రెండు ఆప్ష‌న్లు క‌నిపిస్తాయి. 
* మీకు ఆల్రెడీ జీ మెయిల్ ఐడీ ఉంటే  Choose Existing Option తీసుకుని లాగిన్ కావాలి. 
* త‌ర్వాత ఇదే ప్రొసీజర్‌ను ఫాలో అయి మ‌రిన్ని జీమెయిల్ అకౌంట్స్‌ను యాడ్ చేసుకోవ‌చ్చు.  
2. మొబైల్ డేటా లిమిట్‌ను సెట్ చేసుకోవ‌డం
డేటా లిమిట్‌ను కూడా చేసుకోవ‌చ్చు. దీనివ‌ల్ల ఒక వేళ డేటా అయిపోతే మీ  మెయిన్ బ్యాల‌న్స్ నుంచి అమౌంట్  క‌ట్ అయిపోకుండా కాపాడుకోవ‌చ్చు.  
 * Settingsలోకి  వెళ్లి Data Usage Option క్లిక్ చేయాలి 
* ఇప్పుడు  data Limit సెట్ చేసుకోవాలి. 
* అంతే.  మీరు సెట్ చేసుకున్న డేటా లిమిట్ దాట‌గానే డేటా ఆటోమేటిగ్గా ఆఫ్ అయిపోతుంది.  
3. ఆటో అప్‌డేట్స్‌ను డిజేబుల్ చేయడం 
మ‌నం ప్లే స్టోర్ నుంచి చాలాయాప్స్ ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకుంటాం. అవి ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్ అవుతుంటాయి. ఆటో అప్‌డేట్ ఆప్ష‌న్ ఆన్ అయి ఉంటే అవి ఆటోమేటిగ్గా అప్‌డేట్ అయిపోతాయి. మీకు తెలియ‌కుండానే డేటా మంచినీళ్ల‌లా ఖర్చ‌యిపోతుంది. దీన్ని కంట్రోల్ చేయాలంటే.. 
* ప్లే స్టోర్‌ను ఓప‌న్ చేయండి. త‌ర్వాత సెట్టింగ్స్‌లోకి వెళ్లండి.  
*  Auto Updates ని క్లిక్ చేయండి.
*  Do not-auto Updates or Wifi ని సెలెక్ట్ చేసుకోండి.  ఇప్పుడు మీ యాప్స్ వైఫై అందుబాటులో ఉన్న‌ప్పుడే అప్‌డేట్ అవుతాయి. 
4.ట‌ర్న్ ఆన్/ ఆఫ్ ఆటో క‌రెక్ష‌న్ యాప్స్‌
ఆండ్రాయిడ్ కీ బోర్డ్స్‌లో ఆటో క‌రెక్ష‌న్ ఫీచ‌ర్ ఉంటుంది. ఇవి చాలా సంద‌ర్భాల్లో మ‌న‌కు బాగా ఉప‌యోగ‌ప‌డ‌తాయి. అయితే కొన్నిసార్లు మ‌నం ఒక వ‌ర్డ్ కొడితే ఆటో కరెక్ష‌న్‌లో ఆ పదం మారిపోతుంది. దీంతో మీనింగే మారిపోతుంది. దీన్ని కంట్రోల్ చేయాలంటే.. 
* settingsలోకి వెళ్లి  Language and Input లోకి వెళ్లండి.
* ఇక్క‌డున్న ఆప్ష‌న్ల‌లో నుంచి  Auto correction Option  సెలెక్ట్ చేసుకోండి
* దీన్ని ఆన్ / ఆఫ్ చేయండి.  
5.  డిఫాల్ట్ యాప్స్‌ని ఛేంజ్ చేయ‌డం
 Settings >> Apps లోకి వెళ్లండి 
మీరు మార్చాల‌నుకున్న యాప్‌ను సెలెక్ట్ చేసి  Clear Defaults క్లిక్ చేయండి. 
అంతే మీ ఆండ్రాయిడ్‌లో డిఫాల్ట్‌గా వ‌చ్చిన యాప్స్ ఛేంజ్ అయిపోతాయి. 

జన రంజకమైన వార్తలు