ఆండ్రాయిడ్ పరికరాలలో ఎవరికీ తెలియని బెస్ట్ ఆండ్రాయిడ్ ట్రిక్స్ మరియు టిప్స్ గురించి క్రితం ఆర్టికల్ లో పార్ట్ -1 రూపం లో చదువుకునియున్నాము. మిగిలినవాటి గురించి ఈ రోజు పార్ట్-2 రూపం లో చూద్దాం.
ట్రిక్ 6
ఆండ్రాయిడ్ ఫోన్లలో డాక్యుమెంట్లను క్లియర్‌గా స్కాన్ చేయటం ఎలా..?
గతంలో లాంచ్ అయిన ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లతో పోలిస్తే ప్రస్తుతం లాంచ్ అవుతోన్న స్మార్ట్ఫోన్లలో కెమెరా క్వాలిటీ ఆకట్టుకునే స్థాయిలో ఉంటోంది. దీంతో స్కానర్లతో పనిలేకుండా వీటి ద్వారానే డాక్యుమెంట్లను క్లియర్‌గా స్కాన్ చేసుకోగలుగుతున్నారు. ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ డ్రైవ్, క్యామ్‌స్కానర్, ఎవర్‌నోట్ వంటి అప్లికేషన్లను తమ ఫోన్లలో ఇన్స్టాల్ చేసుకోవటం ద్వారా డాక్యుమెంట్ స్కానింగ్ ప్రాసెస్ మరింత యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది.
ట్రిక్ 7
ఆండ్రాయిడ్ ఫోన్లలో మీరు వింటోన్న పాట గురించి పూర్తి వివరాలు తెలియాలంటే..?
ఆండ్రాయిడ్ ఫోన్లలో మీరు వింటోన్న పాటలను సౌండ్‌హౌండ్ యాప్ ఇట్టే ఐడెంటిఫై చేయగలుగుతంది. ఈ యాప్ మీ ఆండ్రాయిడ్ డివైస్‌లో ఉన్నట్లయితే Google Now , Siri & cortana వంటి వాయిస్ అసిస్టెంట్ ఫీచర్లతో పనే ఉండదు. మీరు ఆస్వాదిస్తోన్న మ్యూజిక్కు సంబంధించి ఇన్స్టెంట్ ఫలితాలను ఈ యాప్ అందించగలుగుతుంది.
ట్రిక్ 8
లాక్ స్ర్కీన్ పై కాంటాక్ట్ డిటెయిల్స్‌ను ఉంచటం ఎలా..?
లాక్ స్ర్కీన్ పై యూజర్ తన కాంటాక్ట్ వివరాలను ఉంచటం వల్ల, మొబైల్ మిస్ అయిన సమయంలో అవి మరింతగా ఉపయోగపడతాయి. మీ ఫోన్ ఎవరికైనా దొరికినట్లయితే లాక్ స్ర్కీన్ పై ఉన్న వివరాలను చూసి నేరుగా వారు మిమ్మల్ని సంప్రదించే వీలుంటంది. ఆండ్రాయిడ్ యూజర్లకు ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లటం ద్వారా ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకునే వీలుంటుంది.
ట్రిక్ 9
మీరు ఉన్న ప్రదేశాన్ని బట్టి ఆండ్రాయిడ్ టైమ్ జోన్ మారుతుండాలా..?
గూగుల్ క్యాలెండర్ యాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి పలు సెట్టింగ్స్‌ను మాడిఫై చేసకోవటం ద్వారా, మీరు ఉన్న ప్రదేశాన్ని బట్టి ఆండ్రాయిడ్ టైమ్ జోన్ మారిపోతుంటుంది. అంతేకాకుండా మీరు ఉన్న ప్రదేశంలో చోటుచేసుకునే ప్రధాన ఈవెంట్స్‌ను కూడా తెలుసుకునే వీలుంటుంది.
ట్రిక్ 10
వాయిస్ కమాండ్స్ ఆధారంగా వై-ఫై, బ్లుటూత్ను టర్నాఫ్ చేసుకోవటం ఎలా..?
గూగుల్ అభివృద్ధి చేసిన అత్యుత్తమ యాప్‌లలో ‘Google Now’ ఒకటి. వాయిస్ కమాండ్స్ ఆధారంగా స్పందించగలిగే ఈ యాప్ ద్వారా మొబైల్ ఆప్షన్లను సులువుగా కంట్రోల్ చేసుకునే వీలుంటుంది. ఉదాహరణకు ఆన్ అయి ఉన్న వై-ఫైను ఆఫ్ చేయాలంటే ‘Off Wifi’ అని గూగుల్ నౌకు చెబితే సరిపోతుంది. ఆన్ అయి ఉన్న బ్లుటూత్ ఆప్షన్‌ను ఆఫ్ చేయాలంటే ‘Off Bluetooth’ అని గూగుల్ నౌకు చెబితే సరిపోతుంది.
ట్రిక్ 11
ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను, కంప్యూటర్ మౌస్లా ఉపయోగించుకోవటం ఎలా..?
మీకు తెలుసా, మీ చేతిలోని ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను కంప్యూటర్ మౌస్లా కూడా ఉపయోగించుకోవచ్చు. ఇందుకు చాలానే యాప్స్ గూగుల్ ప్లే స్టోర్‌లో సిద్దంగా ఉన్నాయి. వీటిలో మంచి యాప్‌ను ఇన్స్టాల్ చేసుకోవటం ద్వారా మీ స్మార్ట్‌ఫోన్ టచ్ కాస్తా, వైర్లెస్ టచ్ మౌస్ కీబోర్డ్‌లా మారిపోతుంది.
ట్రిక్ 12
ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లలో స్ర్కీన్ షాట్లను క్యాప్చుర్ చేసుకోవటం ఎలా..?
స్ర్కీన్ షాట్లను క్యాప్చుర్ చేసుకునే పద్ధతి ఒక్కో ఫోన్లో ఒక్కో విధంగా ఉంటంది. అయితే, చాలా వరకు ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లలో స్ర్కీన్ షాట్లను క్యాప్చుర్ చేసుకోవాలంటే వాల్యుమ్ డౌన్ + హోమ్ బటన్లను ఒకేసారి ప్రెస్ చేయవల్సి ఉంటుంది.
ట్రిక్ 13
అలారమ్ సౌండ్ మరింత బిగ్గరగా వినిపించాలంటే
ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లలో అలారమ్ సౌండ్‌ను లో రేంజ్ నుంచి హై రేంజ్ వరకు వివిధ మోడ్లలో సెట్ చేసుకునే వీలుంటంది. ఫోన్ సెట్టింగ్స్‌లోని ‘సౌండ్స్ అండ్ నోటిఫికేషన్స్’ విభాగంలోకి వెళ్లటం ద్వారా అలారమ్ సౌండ్స్‌ను కావల్సిన విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు.
ఆండ్రాయిడ్ యూజర్లు గుర్తుపెట్టుకోవల్సిన పలు సీక్రెట్ కోడ్స్...
IMEI నెంబర్‌ను చెక్ చేసుకునేందుకు *#06#
బ్యాటరీ స్టేటస్‌ను చెక్ చేసుకునేందుకు #0228#
బ్యాటరీ యూసేజ్‌ను చెక్ చేసుకనేందుకు *#*#4636#*#*
కెమెరా సమాచారాన్ని తెలుసుకునేందుకు *#*#34971539#*#*
ర్యామ్ వెర్షన్‌ను తెలుసుకునేందుకు *#*#3264#*#*
ఆండ్రాయిడ్ డివైస్‌ను ఫార్మట్ చేసేందుకు *2767*3855#