• తాజా వార్తలు
  •  

ట్రూ కాలర్ లో మీకు తెలియని ఫీచర్ల పరిచయం

ప్రస్తుతం ఉన్న ప్రతీ స్మార్ట్ ఫోన్ లోనూ తప్పనిసరిగా ఉంటున్న యాప్ లలో ట్రూ కాలర్ కూడా ఒకటి. అపరిచిత నెంబర్ లనుండి వచ్చే కాల్ లను గుర్తించడం, కాల్ బ్లాకింగ్ మరియు స్పాం కాల్ లను రాకుండా చేయడం లాంటి పనులను ఇది చేస్తుంది,. ఇందులో అనేక ఫీచర్ లు ఉన్నప్పటికీ చాలా మందికి వాటి గురించి తెలియదు. ట్రూ కాలర్ అంటే కేవలం నెంబర్ ఐడెంటిఫికేషన్ మాత్రమే అని అనుకునే వారికోసం ఇందులో ఉన్న ఎన్నో ఆకర్షణీయమైన ఫీచర్ల  గురించిన వివరాలతో ఈ ఆర్టికల్ మీకోసం ఇస్తున్నాం.

మీ స్వంత ప్రొఫైల్ ను క్రియేట్ చేసుకోవడం

ట్రూ కాలర్ లో మీ ప్రొఫైల్ ను మీరే క్రియేట్ చేసుకోవడమే గాక మీకు నచ్చిన రీతిలోదానిని కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. మీ పేరుకు అదనపు సమాచారాన్ని , పిక్చర్ లనూ యాడ్ చేసుకోవచ్చు. మీ ఎకౌంటు ను గూగుల్ మరియు ఫేస్ బుక్ లకు కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. మీకు ప్రైవసీ కావాలి అనుకుంటే జనరల్ సెట్టింగ్ లలోనికి వెళ్లి మీకు ఇష్టమైన వారే మీ ప్రొఫైల్ చూసేలా కూడా సెట్ చేసుకోవచ్చు.

స్పామ్ చేయడం

అనునిత్యం మనకు వచ్చే కాల్ లలో కొంతమంది పదేపదే ఫోన్ చేసి విసిగిస్తూ ఉంటారు. లేదా నిర్దిష్ట వ్యక్తులతో మాట్లాడడం మీకు ఇష్టం లేకపోవచ్చు. అలాంటి వారందరినీ స్పాం గా సెట్ చేసేయవచ్చు. కంపెనీల ప్రమోషనల్ ఆఫర్ లకు సంబందించిన కాల్ లు ఈ లిస్టు లో ఎక్కువ ఉంటాయి. ఎక్కువమంది చే బ్లాక్ చేయబడిన నెంబర్ లను ట్రూ కాలర్ ఎరుపు రంగులో సూచిస్తుంది.

వీడియో కాల్ లను చేయడం

ఈ ట్రూ కాలర్ యాప్ ను ఉపయోగించి వీడియో కాల్ లను కూడా చేయవచ్చు. కాకపోతే మీ ఫోన్ లో ట్రూ కాలర్ యాప్ తో పాటు గూగుల్ డుయో వీడియో కాలింగ్ యాప్ కూడా ఇన్ స్టాల్ చేయబడి ఉండాలి. ట్రూ కాలర్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఐకాన్ పై క్లిక్ చేస్తే దీనికి సంబందించిన సమాచారం కనిపిస్తుంది.

ట్రూ కాలర్ ను డిఫాల్ట్ డయలర్ మరియు డిఫాల్ట్ మెసేజింగ్ యాప్ గా సెట్ చేసుకోవడం

సెట్టింగ్ లలోనికి వెళ్లి జనరల్ ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకుని క్రిందకు స్క్రోల్ చేస్తే అక్కడ మిస్డ్ కాల్ నోటిఫికేషన్ కనిపిస్తుంది. దీనిని ఎనేబుల్ చేస్తే డిఫాల్ట్ డయలర్ కు సంబందించిన సమాచారం కనిపిస్తుంది. అలాగే డిఫాల్ట్ మెసేజింగ్ యాప్ గా కూడా ట్రూ కాలర్ ను సెట్ చేసుకోవచ్చు.

కాంటాక్ట్ లను పేర్లు మరియు ఈ మెయిల్ ఐడి ప్రకారం సెర్చ్ చేయండి.

మీకు కావలసిన పేరును టైపు చేసి సెర్చ్ చేస్తే ట్రూ కాలర్ తన డేటా బేస్ లో ఆ పేరు లేదా ఈ మెయిల్ ఐడి కి సంబందించిన సమాచారం అంతటినీ చూపిస్తుంది. అలాగే ఈ ట్రూ కాలర్ లో వివిధ రకాల ఎయిర్ లైన్స్,రైల్వేస్, హెల్త్ కేర్ సర్వీస్ లు, బ్యాంకు లు, హోటల్ లు మొదలైనవాటి కి సంబందించిన నెంబర్ లు కూడా ఉంటాయి.

యాప్ లో నుండి మీ నెంబర్ ను అన్ లిస్టు చేయండి.

మీ నెంబర్ మరియు పేరు ట్రూ కాలర్ డేటా బేస్ లో చూపించడం మీకు ఇష్టం   లేదా?https://www.truecaller.com/unlisting ను విజిట్ చేసి మీ ఫోన్ నెంబర్ ను కంట్రీ కోడ్ తో సహా టైపు చేసి అన్ లిస్టు ఫోన్ నెంబర్ ను సెలెక్ట్ చేసుకుంటే చాలు. అయితే ఇకపై మీ ఫోన్ లో ఈ యాప్ ఇన్ స్టాల్ చేసియుండకూడదు.

చెక్ లాస్ట్ సీన్

కాంటాక్ట్ పక్కన ఉండే ఇన్ఫర్మేషన్ ఐకాన్ ను సెలెక్ట్ చేయండి. అక్కడ ఉండే కాంటాక్ట్ కార్డు పై క్లిక్ చేస్తే దానికి సంబందించిన సమాచారం అంతా అక్కడే ఉంటుంది. ఆ వ్యక్తి ఆన్ లైన్ లో ఉన్నాడా? లాస్ట్ సీన్ స్టేటస్ లను కూడా చెక్ చేయవచ్చు.

 

 

జన రంజకమైన వార్తలు