• తాజా వార్తలు
  •  

వాట్స్ అప్ స్టేటస్ కి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేసుకోవడానికి టిప్స్

ప్రస్తుతం ఉన్న అనేక రకాల సోషల్ మీడియా మెసేజింగ్ యాప్ లలో అగ్ర స్థానం వాట్స్ అప్ దే అని ఘంటాపథంగా చెప్పవచ్చు. ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతూ సరికొత్త ఫీచర్ లను తీసుకువస్తూ ఉండడమే దీనికి కారణం. తాజాగా వాట్స్ అప్ తన లేటెస్ట్ అప్ డేట్ లో మరొక ఫీచర్ ను తీసుకువచ్చింది. అదే వాట్స్ అప్ స్టేటస్ కు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేసుకోవడం. వాట్స్ అప్ ను ఉపయోగించే ప్రతీ ఒక్కరూ దాదాపుగా ప్రతీ రోజూ తమ స్టేటస్ ను అప్ డేట్ చేస్తూ ఉంటారు. ఏదో ఒక పిక్చర్ ను గానీ లేదా వీడియో ను గానీ స్టేటస్ రూపం లో అప్ డేట్ చేస్తారు. అయితే ఇకపై మీరు అప్ డేట్ చేసే మీ స్టేటస్ కు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ నుకూడా యాడ్ చేసుకోవచ్చు. అదెలాగో ఈ ఆర్టికల్ లో చూద్దాం.

వాట్స్ అప్ స్టేటస్ కు మ్యూజిక్ యాడ్ చేయడం ఎలా ?

మనం పైన చెప్పుకున్నట్లు వాట్స్ అప్ స్టేటస్ ను అప్ డేట్ చేసేటపుడు మ్యూజిక్ రికార్డు చేసి స్టేటస్ కు యాడ్ చేసుకోవచ్చు. వీడియో కైనా ఇంతే . దీనికి కొన్ని స్టెప్ లు ఉంటాయి.

స్టెప్ 1: మొదటగా మీరు ఏ పాటనైతే మీ స్టేటస్ లో బ్యాక్ గ్రౌండ్ గా సెట్ చేయాలి అనుకుంటున్నారో ఆ పాట ను ఏదేని మ్యూజిక్ ప్లేయర్ యాప్ ను ఉపయోగించి మీ ఫోన్ లో ప్లే చేయాలి. దీనికోసం మీరు ఆన్ లైన్ మ్యూజిక్ యాప్ లను కూడా ఉపయోగించుకోవచ్చు.

స్టెప్ 2: మీరు ప్లే చేస్తున్న పాట లేదా మ్యూజిక్ స్పీకర్ లో నుండి వచ్చేట్లు చూడాలి. అంటే ఏదేని హెడ్ ఫోన్స్ ద్వారాగానీ, వైర్ లెస్ హెడ్ సెట్ ద్వారా గానీ వినకూడదు.

స్టెప్ 3 : ఈ మ్యూజిక్ బ్యాక్ గ్రౌండ్ లో ప్లే అవుతున్నపుడు వాట్స్ అప్ ను ఓపెన్ చేయాలి. స్టేటస్ కు వెళ్లి మీ స్టేటస్ ను రికార్డు చేయడం  ప్రారంభించాలి. మీరు ప్లే చేస్తున్న మ్యూజిక్ యొక్క వాల్యూం ఎంత పెద్ద గా వీలయితే అంత పెద్దగా ఉంచాలి. దీనివలన మీ వాట్స్ అప్ స్టేటస్ లో వచ్చే మ్యూజిక్ క్వాలిటీ గా ఉంటుంది.

స్టెప్ 4 : రికార్డింగ్ పూర్తి అయిన తరవాత సరి చూసుకోవడానికి ప్రివ్యూ చూసుకోవాలి. అంతా సరే అనుకున్న తర్వాత క్రింద ఉండే గ్రీన్ బటన్ ను హిట్ చేస్తే చాలు. మ్యూజిక్ తో కూడిన మీ సరికొత్త స్టేటస్ ను అందరూ చూడగలుగుతారు.

 

జన రంజకమైన వార్తలు