• తాజా వార్తలు
  •  

మీ ఆధార్ ఎక్కడ వాడారో తెలుసుకోండి, ( సింపుల్ ట్రిక్స్ )

దేశంలో ఇప్పుడు ఏ పని చేయలన్నా ఆధార్ అనేది తప్పనిసరి అయింది. పాన్ కార్డ్, మొబైల్, బ్యాంక్ లోన్లు ఇలా ప్రతి అంశమూ ఆధార్‌తోనే ముడిపడింది. ఈ కార్డులో మన వ్యక్తిగత సమాచారం మొత్తం నిక్షిప్తమై ఉంటుంది. ఈ నేపథ్యంలో మనం ఆధార్ ఎక్కడెక్కడ వాడామో తెలుసుకోవడం ఎలా అనే సందేహం రావచ్చు.. అలా తెలుసుకునేందుకు ఆధార్ కార్డు జారీ చేసే యూఏడీఏఐ వెబ్‌సైట్ మీకు అవకాశం కల్పిస్తోంది. ఈ కింది స్టెప్స్ పాటించడం ద్వారా మీరు తెలుసుకోవచ్చు.

స్టెప్ 1 
ఈ సమాచారం కావాలనుకున్న వారు ముందుగా యూఐడీఏఐ ఆధార్ ఆథెంటికేషన్ హిస్టరీ పేజ్‌కు వెళ్లాలి.. ఈ పేజీ Website ఇదే.. https://resident.uidai.gov.in/notification-aadhaar 

స్టెప్ 2
 అక్కడ మీకు కనిపించే పేజీలో మీ UID నంబర్ , క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేయాలి. జనరేట్ ఓటీపీ క్లిక్ చేస్తే.. రిజిస్టర్డ్ మొబైల్‌కు ఓటీపీ వస్తుంది.

స్టెప్ 3 
ఆ తరువాత పేజీలో మీకు ఎటువంటి సమాచారం కావాలో మీకు కొన్ని ఆప్షన్స్ డిస్‌ప్లే అవుతాయి. బయోమెట్రిక్, డెమొగ్రాఫిక్‌లాంటివి. ప్రస్తుత తేదీ నుంచి గరిష్ఠంగా ఆరు నెలల కిందటి వరకు మీరు ఆధార్‌ను ఎలా ఎక్కడ వాడారో తెలుసుకోవచ్చు.

స్టెప్ 4 
బయోమెట్రిక్, డెమొగ్రాఫిక్‌లాంటివి. ప్రస్తుత తేదీ నుంచి గరిష్ఠంగా ఆరు నెలల కిందటి వరకు మీరు ఆధార్‌ను ఎలా ఎక్కడ వాడారో తెలుసుకోవచ్చు. అయితే ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఆప్సన్స్ ఎంటర్ చేయాలి లేకుంటే మీకు ఎర్రర్ చూపించే అవకాశం ఉంది.

స్టెప్ 5
 అన్ని వివరాలు ఎంటర్ చేశాక చివరి కాలంలో ఓటీపీ ఎంటర్ చేసి సబ్‌మిట్ చేస్తే మొత్తం డీటెయిల్స్ వస్తాయి. మీరు ఏ రోజు, ఏ సమయానికి, ఎలాంటి పని కోసం ఆధార్‌ను ఇచ్చారన్న వివరాలు వస్తాయి.

ఆధార్ వాడిన కంపెనీ లేదా ఏజెన్సీ పేర్లు .. అయితే ఈ పేజీలో మీ ఆధార్ వాడిన కంపెనీ లేదా ఏజెన్సీ పేర్లు మాత్రం చూపించదు. దానికి సంబంధించిన వివరాలను మాత్రమే అది చూపిస్తుంది.
 

జన రంజకమైన వార్తలు

విజ్ఞానం బార్ విశేషాలు