• తాజా వార్తలు
  •  

కాల్ డ్రాప్ సమస్యను మనమే పరిష్కరించుకోవడానికి 5 చిట్కాలు

ఒక్కోసారి మన ఇంట్లోని కొన్ని ప్లేస్ లలోనికి వెళ్ళినపుడు మన ఫోన్ లోని సిగ్నల్ సడన్ గా వీక్ అవుతుంది. ఈ విషయాన్ని ఎంతమంది గమనించారు? ఇంటి బయట ఎంత ఎక్కువ సిగ్నల్ ఉన్నా సరే ఇంట్లో ని ఆయా ప్రదేశాలకు వచ్చినపుడు ఆటోమాటిక్ గా సిగ్నల్ స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది. మనం ఫోన్ లో ఎవరితోనైనా మాట్లాడుతూ ఈ ప్రదేశాలకు వచ్చామంటే ఇక అంతే సంగతులు! కాల్ డ్రాప్ అవుతుంది. ఇక మనం ఏదైనా ముఖ్యమైన విషయాన్ని ఫోన్ లో మాట్లాడుతున్నామంటే ఈ కాల్ డ్రాప్ అనేది ఎక్కడలేని చికాకు ను తెచ్చిపెడుతుంది. దీనికి అనేక రకాల కారణాలు ఉంటాయి. అయితే ఇలాంటి సందర్భాలలో కాల్స్ డ్రాప్ అవకుండా ఈ సమస్యను మనమే పరిష్కరించుకోవడానికి గల 5 మార్గాలను ఈ ఆర్టికల్ లోఇవ్వడం జరిగింది.

సిగ్నల్ ఎక్కువగా ఉన్న లొకేషన్ లోనే మాట్లాడండి

ఇలాంటి సమస్యకు లొకేషన్ అనేది కీలక కారణం అవుతుంది. కాబట్టి మన ఇంట్లో ఏ ఏ లొకేషన్ లలో సిగ్నల్ వీక్ గా ఉంటుందో గమనించి మనం ఫోన్ మాట్లాడేటపుడు అక్కడకు వెళ్ళకుండా ఉంటేనే మంచిది. ఈ విషయాన్ని మన మనసులో ఒక బండ గుర్తు లాగ గుర్తుoచుకోవాలి. దీనివలన కాల్ డ్రాప్ సమస్యలో ఉండే చికాకును తగ్గించవచ్చు. అలాగే మన చుట్టూ ఎలక్ట్రానిక్ డివైస్ లు ఉన్నపుడు కూడా ఇదే సమస్య ఎదురవడం మనం గమించే ఉంటాము. కాబట్టి ఫోన్ లో మాట్లాడేటపుడు ఇలాంటి పరిసరాలకు దూరంగా ఉండడమే మంచిది.

మీ ఫోన్ లో సిగ్నల్ ఎలా ఉంటుందో ఎప్పటికప్పుడు గమనించుకోండి

ఒక్కోసారి ఈ కాల్ డ్రాప్ సమస్యకు కారణం మీ ఫోన్ లోనే ఉంటుంది.  ఒకసారి మీ రోమింగ్ సెట్టింగ్ లను వెరిఫై చేసుకోండి. అది కేవలం రోం కు మాత్రమే సెట్ చేసి ఉండవచ్చు. అది దగ్గరలోని అందుబాటులో ఉన్న టవర్ కోసం వెదుకుతూ ఉండి ఉండవచ్చు.మీ ప్లాన్ అపరిమిత రోమింగ్ ను యాక్సెస్ చేసేలా చూసుకోండి. సింపుల్ గా చెప్పాలి అంటే మీ ఫోన్ లోని నెట్ వర్క్ డిటెక్టర్ ఎన్ని ఎక్కువ టవర్ లను సెర్చ్ చేయగలిగితే మీ సిగ్నల్ అంత ఎక్కువవచ్చే అవకాశం ఉంది.

సిగ్నల్ బూస్టర్ కిట్ ను తీసుకోండి.

సిగ్నల్ బూస్టర్ కిట్ ను తీసుకోవడం అనేది మరొక అవకాశం గా భావించవచ్చు. మీ అవసరాలకు తగిన సిగ్నల్ బూస్టర్ కిట్ ను తెచ్చుకోవడం పెద్ద సమస్య కాదు. మీ దగ్గర లోని స్టోర్ లకు వెళ్తే లభించవచ్చు. లేదా ఆన్ లైన్ లో వెదికినా సరే వివిధ రకాల ఆప్షన్ లతో కూడిన సిగ్నల్ బూస్టర్ కిట్ లు లభిస్తాయి. ఆన్ లైన్ లో అనేక రకాల సిగ్నల్ బూస్టర్ కిట్ లు మనకు అందుబాటు ధరల లోనే లభిస్తాయి. వీటిని తెచ్చుకొని మీ ఇంట్లో ఎక్కడైతే తక్కువ సిగ్నల్ వస్తుంది ఆయా ప్రదేశాలలో సెట్ చేసుకుంటే చాలు, మళ్ళీ ఇక ఎప్పుడూ మీకు కాల్ డ్రాప్ సమస్య అనేదే తలెత్తదు.

మీ ఫోన్ ను ఎప్పుడూ నిట్ట నిలువుగా ఉంచండి.

ఇప్పుడు వస్తున్న స్మార్ట్ మరియు ఫీచర్ ఫోన్ లలో కూడా యాంటెన్నా ఉంటుందని మీలో ఎంతమందికి తెలుసు?  సెల్యూలర్ ఫోన్ లు వచ్చిన మొదటి రోజులలో వాటికి ఒకవైపు యాంటెన్న ఉండడం మనం గమనించే ఉంటాము. ల్యాండ్ లైన్ లకు ఎలాగూ ఈ యాంటెన్న ఉంటుంది. ఇక ప్రస్తుతం వస్తున్న ఫోన్ లలోనూ ఇది ఉంటుంది. కాకపోతే ఇది బయటకు కనపడకుండా ఫోన్ యొక్క లోపలి భాగం లో ఉంటుంది. సిగ్నల్ రావాలంటే తప్పనిసరిగా యాంటేన్నా ఉండాల్సిందే కదా! ఫోన్ కు పై భాగం లో ఇది ఉంటుంది. కాబట్టి ఫోన్ ను ఎలా పడితే అలా ఉంచకూడదు. ఫోన్ ను క్రిందకు గానీ ఒక ప్రక్కకు గానీ ఉంచినపుడు సిగ్నల్ వీక్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మన ఫోన్ ను ఎప్పుడూ నిట్ట నిలువుగానే ఉంచాలి.

మీ సర్వీస్ ప్రొవైడర్ ను చెక్ చేసుకోండి

ఇలాంటి సమస్యలు ఎదురయినపుడు మీకు సహాయం చేసేవారు ఎవరైనా ఉన్నారు అంటే అది మీ సర్వీస్ ప్రొవైడర్ మాత్రమే. ఈ కాల్ డ్రాప్ సమస్య మీకు తరచుగా ఎదురవుతూ ఉంటే మీ సర్వీస్ ప్రొవైడర్ నుండి టెక్నికల్ సపోర్ట్ తీసుకోవడమే మంచిది.కాల్ సెంటర్ కు ఫోన్ చేస్తే మీ సమస్య ను వెంటనే పరిష్కరిస్తారు లేకపోతే కనీసం పరిష్కారాన్ని సూచిస్తారు.

జన రంజకమైన వార్తలు