• తాజా వార్తలు
  •  

మీ ఫోన్ నీళ్ళల్లో పడిందా? అయితే వెంటనే చేయాల్సిన పనులు ఇవే !

ఇది దాదాపుగా అందరికీ అనుభవం లో ఉండే విషయమే. ఫీచర్ ఫోన్ అయినా లేక స్మార్ట్ ఫోన్ అయినా మన వద్ద ఉండే ఫోన్ నీళ్ళల్లో పడడం అది ఇక పనిచేయకుండా పోవడం మనకు తెలిసిన విషయమే. మరి ఫోన్ అలా నీళ్ళలో పడినపుడు మనం ఏమి చేస్తాము? ఏముంది , సర్వీస్ సెంటర్ కి తీసుకు వెళ్తాము. మన బడ్జెట్ లో అది బాగవుతుంది అనుకుంటే బాగు చేయిస్తాము లేదా రీ ప్లేస్ మెంట్ కు గానీ , కొత్త ఫోన్ కొనుక్కోవడానికి గానీ మొగ్గు చూపుతాము. అయితే ఇవన్నీ ఏమీ లేకుండా కేవలం కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మన ఫోన్ నీళ్ళల్లో పడినా సరే ఎంచక్కా తిరిగి మళ్ళీ మామూలుగా ఉపయోగించుకోవచ్చు. అవేమిటో ఈ ఆర్టికల్ లో చూద్దాం.

ప్రస్తుతం మార్కెట్ లో లభిస్తున్న ఫోన్ లలో కేవలం 5 శాతం కంటే తక్కువ మాత్రమే నీళ్ళ నుండి రక్షణ ను కలిగి ఉంటున్నాయి. వీటినే వాటర్ ప్రూఫ్ అని అంటున్నాము. అంటే 95% ఫోన్ లు వాటర్ ప్రూఫ్ లేనివే అన్నమాట. వీటిపై ఒక్క నీటి చుక్క పడినా సరే జరగాల్సిన నష్టం జరిగి పోయే అవకాశమే ఎక్కువ. కాబట్టి నీటికి మన ఫోన్ లను వీలైనంత దూరంగా ఉంచాలి.

చేయకూడనివి

ఇంతకుముందు చెప్పుకున్నట్లు నీటికి మన ఫోన్ లను వీలైనంత దూరంగా ఉంచాలి. అయితే ప్రమాదవశాత్తూ జరిగే వాటికి మనం ఏమీ చేయలేము. కావున మన ఫోన్ నీటిలో పడినప్పుడు ఎంత తొందరగా వీలయితే అంత తొందరగా దానిని నీటిలోనుంచి బయటకు తీయాలి.

స్విచ్ ఆన్ చేయడం కానీ , నీరు బయటకు పోయే విధంగా షేక్ చేయడం కానీ చేయకూడదు,

ఒక వేల మీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయినట్లయితే ఎలా ఉందో చూద్దామని స్విచ్ ఆన్ చేయడం లాంటి చేయకూడదు. ఒకవేళ మీ ఫోన్ ఇంకా ఆన్ లో ఉన్నట్లయితే జాగ్రత్తగా స్విచ్ ఆఫ్ చేయండి.

మీ ఫోన్ ను డ్రై చేయడానికి కొన్ని సొల్యూషన్ లు వాడడం, లేదా వేడిగా ఉంచడానికి ఎండలో ఉంచడం , వేడి ఎక్కువగా వచ్చే ప్రదేశాలలో ఉంచడం లాంటివి చేయకూడదు.

చేయవలసినవి

మీ ఫోన్ ను స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత చాలా జాగ్రత్తగా దానిని ఓపెన్ చేయాలి. ఎంతవరకూ వీలయితే అంతవరకూ ఓపెన్ చేయాలి.

అంటే అన్ని ఎక్స్ టర్నల్ భాగాలైన పానెల్, బ్యాటరీ, ఫోన్ కేస్, సిమ్ కార్డు, మెమరీ కార్డు లాంటివన్నీ ఫోన్ నుండి తీసివేయాలి.

కళ్ళద్దాలు లేదా స్మార్ట్ ఫోన్ స్క్రీన్ తుడుచుకునే ఒక మెత్తటి గుడ్డను తీసుకుని నిదానంగా లోపలి భాగాలను తుడవాలి. దీనివలన పైన ఉన్నతేమ శాతం తీసివేయబడుతుంది.

ఒక చిన్న సంచిలో కొంత బియ్యం తీసుకుని మీ ఫోన్ ను ఆ బియ్యం లోపల ఉంచాలి. అంటే మీ ఫోన్ ను ఆ బియ్యం తో కప్పివేయాలి.

బియ్యం డీ హైడ్రేటింగ్ వాతావరణాన్ని సృష్టిస్తుంది. గుడ్డతో తుడవలేని భాగాలను పొడిగా ఉంచడం లో ఇది బాగా సహాయపడుతుంది.

ఇలా మీ ఫోన్ ను అ బియ్యపు సంచిలో 24 గంటల పాటు ఉంచాలి.

24 గంటల తర్వాత మీ ఫోన్ ను బయటకు తీసి దాని భాగాలను తిరిగి దానికి అసెంబుల్ చేసి ఆన్ చేసి చూడండి.

ఆన్ అయితే సరే, లేకపోతే కాసేపు ఛార్జింగ్ పెట్టి మళ్ళీ ఆన్ చేయండి.

బ్యాటరీ తొందరగా వేడెక్కడం లాంటి అంశాలు ఏవైనా ఉన్నాయేమో చెక్ చేయండి.

మీ ఫోన్ కనుక ఛార్జ్ అవ్వకపోతే సమస్య కేవలం బ్యాటరీ లోనే ఉన్నట్లు కావున బ్యాటరీ ఒక్కటి మారిస్తే సరిపోతుంది. అప్పటికీ పనిచేయకపోతే ఇక కొత్త ఫోన్ కొనుక్కోవడమే బెటర్.

జన రంజకమైన వార్తలు