• తాజా వార్తలు
  •  

కోల్పోయిన ఫోన్‌ను క్యాచ్ చేయ‌డానికి గూగుల్ చూపిస్తున్న 5 కొత్త మార్గాలు 

ఆండ్రాయిడ్ యూజ‌ర్ల‌  కోసం గూగుల్ కొత్త కొత్త టూల్స్‌, ఫీచ‌ర్ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ఇంట్ర‌డ్యూస్ చేస్తుంది. 2013లో గూగుల్..డివైస్ మేనేజ‌ర్ స‌ర్వీస్‌ను అనే కొత్త స‌ర్వీస్‌ను తీసుకొచ్చింది. డివైస్ ఎక్క‌డుందో లొకేట్ చేయ‌డానికి ఇది బాగా ఉప‌యోడ‌పడుతుంది. గ‌త సంవ‌త్స‌రం కంపెనీ దీనికి మ‌రిన్ని ఫీచర్ల‌ను యాడ్‌చేసి ఫైండ్ మై డివైస్ (Find My Device) పేరుతో రిలీజ్ చేసింది. ఆండ్రాయిడ్ కిట్‌కాట్‌, ఆ త‌ర్వాత వ‌చ్చిన ఓఎస్‌లున్న అన్ని స్మార్ట్‌ఫోన్ల‌లోనూ ఈ ఫీచ‌ర్ పని చేస్తుంది. అయితే ఆ ఫోన్ గూగుల్ అకౌంట్‌తో సైన్ ఇన్ అయ్యి ఉండి,ఇంట‌ర్నెట్‌తో క‌నెక్ట్ అయి ఉండాలి.  ఇవ‌న్నీ ఉంటే మీ ఫోన్ పోగొట్టుకున్నా ఈజీగా ట్రేస్ అవుట్ చేయ‌వ‌చ్చు. అలా లేక‌పోయినా ఫోన్ వెతికిప‌ట్టుకోవ‌డానికి కొత్త స‌ర్వీస్‌లో 5 ఫీచ‌ర్ల‌ను తీసుకొచ్చింది.
1.డిస్‌ప్లే లాస్ట్ నోన్ లొకేష‌న్ (Display last known location)
మీ ఫోన్ పోగొట్టుకున్నారు.దానికి ఇంట‌ర్నెట్ క‌నెక్ష‌న్ లేక‌పోతే ఫైండ్ మై డివైస్ ప‌నిచేయ‌దు. కానీ నెట్ క‌నెక్ష‌న్ క‌ట్ అయ్యేస‌రికి ఆ డివైస్ ఏ లొకేష‌న్‌లో ఉందో గూగుల్ మ్యాప్స్‌లో చూపిస్తుంది.  ఏ టైమ్‌లో ఆ ప్రాంతంలో డివైస్ ఉందో కూడా తెలుసుకోవ‌చ్చు.
2. డిస్‌ప్లే లాస్ట్ క‌నెక్టెడ్ వైఫై యాక్సెస్ పాయంట్ (Display last connected Wi-Fi access point)
అంతేకాదు ఈ యాప్ ద్వారా మీ డివైస్ లాస్ట్ క‌నెక్ట‌యిన వైఫై యాక్సెస్ పాయింట్ ఏమిటో కూడా చూపిస్తుంది. దాన్ని బ‌ట్టి డివైస్ ఎక్క‌డుందో క‌నిపెట్టే అవ‌కాశాలున్నాయి. 
3. డిస్‌ప్లే బ్యాట‌రీ లెవెల్ (Display battery level)
ఫైండ్ మై డివైస్ టూల్ ద్వారా డివైస్‌లో బ్యాట‌రీ ఎంత ప‌ర్సంటేజ్ ఉందో కూడా తెలుస్తుంది.త‌మ స్మార్ట్ ఫోన్ ఎంత దూరంలో ఉందో బ్యాట‌రీ ప‌ర్సంటేజ్ ద్వారా కూడా అంచ‌నాకు రావ‌చ్చు.
4.రింగ్‌, లాక్ అండ్ ఎరేజ్ 
ఫోన్‌ను రింగ్‌చేయ‌డం వంటి కామ‌న్ యాక్ష‌న్స్ కూడా ఈ కొత్త స‌ర్వీస్‌లో మెరుగుప‌రిచారు. దీని ద్వారా కూడా డివైస్‌ను క‌నుక్కోవ‌చ్చు.
5.ఆండ్రాయిడ్ వేర్‌, గూగుల్ హోంతోనూ..
స్మార్ట్ వాచ్‌ల వంటి స్మార్ట్ డివైస్‌లు వాడుతున్న‌వారికి మ‌రో ఆప్ష‌న్ కూడా ఉంది.మీ ఫోన్‌తో  స్మార్ట్ వాచ్ వంటివి క‌నెక్ట‌యి ఉన్నంత కాలం దాన్ని ఈజీగా లొకేట్ చేయొచ్చు. అంతేకాదు Google Homeను Ok Google, where is my Phone అని అడిగినా కూడా ఫోన్ ఎక్క‌డుందో చూపిస్తుంది. అయితే గూగుల్ అకౌంట్‌తో మీ ఫోన్ సైన్ ఇన్ అయి ఉండాలి.
 

జన రంజకమైన వార్తలు