• తాజా వార్తలు

ఆన్‌లైన్‌లో ఫ్రీగా చట్టపరంగా సినిమాలు చూడడానికి టాప్ వెబ్ సైట్స్

ఆన్‌లైన్‌లో సినిమా అన‌గానే పైర‌సీ సినిమా చూస్తున్నామేమో అని కాస్త బెరుకు ఉంటుంది. పర్వాలేదులే అని చూసినా దాని క్వాలిటీ అంత బాగుండ‌దు. సౌండ్ క్లియ‌రెన్స్ సంగ‌తి స‌రేస‌రి. ఎందుకంటే ఇలాంటి ఊరూపేరూ లేని సైట్ల‌లో వ‌చ్చే మూవీల్లో ఎక్కువ భాగం థియేట‌ర్ల‌లో హిడెన్ కెమెరాలు పెట్టి దొంగ‌చాటుగా తీసిన‌వే. కానీ అవేమీ లేకుండా ఫ్రీగా సినిమాలు కూడా ద‌ర్జాగా లీగల్‌గా చూసేందుకు ఇంట‌ర్నెట్లో బోల్డన్ని సైట్లున్నాయి. డ్రామా, కామెడీ, యాక్ష‌న్‌, రొమాన్స్‌.. ఇలా ఏ జెన‌ర్‌లో అయినా కావాల్సిన‌న్ని సినిమాలు అందించే వెబ్‌సైట్లు కోకొల్ల‌లు. బాలీవుడ్‌, టాలీవుడ్ వంటి ఇండియ‌న్ లాంగ్వేజెస్ మూవీలు అందించే సైట్లు కూడా ఉన్నాయి. వీటిలో కొన్నింటి గురించి చూడండి..
Tubi TV
ఆన్‌లైన్‌లో ఫ్రీ మూవీస్‌ను లీగ‌ల్‌గా చూడ‌డానికి ఉన్న బెస్ట్ సైట్ల‌లో ఇదొక‌టి. 1970,80,90 ల నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన వేలాది సినిమాలు, టీవీ షోలు ఇందులో ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు ఫ్ల‌గిన్ యాడ్ చేసుకోకుండా నేరుగా వీడియోలు చూడ‌డానికి ఇందులో ఇన్‌బిల్ట్ వీడియో ప్లేయ‌ర్ కూడా ఉంది. త‌ర్వాత చూడాల‌నుకుంటే దాన్ని Queueలో పెట్టొచ్చు.డ్రామా, హ‌ర్ర‌ర్‌, కామెడీ, థ్రిల్ల‌ర్స్‌, యాక్ష‌న్‌, రొమాన్స్‌,.. ఇలా 25 కేట‌గిరీల్లో మూవీస్ ఈ సైట్‌లో అందుబాటులో ఉంటాయి.ఈ సినిమాల‌న్నీ ట్యూబీ టీవీ అఫీషియ‌ల్ పార్ట్‌న‌ర్స్ అయిన ట్యూబీ టీవీ, ల‌య‌న్స్‌గేట్‌, ఎంజీఎం, స్టార్జ్ వంటి వాటి నుంచి తీసుకుంటారు. Tubi TV వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఫ్రీగా రిజిస్ట‌ర్ చేసుకుని చూడొచ్చు.
SnagFilms
స్నాగ్ ఫిలిమ్స్ కూడా ఆన్‌లైన్ ఫ్రీ మూవీస్ సైట్ల‌లో ఒకటి. దీనిలో కూడా ఫెస్టివ‌ల్‌, ఫారిన్‌, లాటినో, వార్‌, పాలిటిక్స్‌, బాలీవుడ్‌, ఫాంట‌సీ, మూవీ ఇలా 30 కేటగిరీల్లో వేల కొద్దీ సినిమాలున్నాయి. పాపుల‌ర్ ఫిలిమ్స్‌, రీసెంట్ ఫిలిమ్స్ అనే రెండు కేట‌గిరీలు.. మీ సెర్చ్‌ను ఈజీ చేస్తాయి. దీనిలో కూడా Queue ఫీచ‌ర్ ఉంది.
Viewster
వ్యూస్ట‌ర్‌లో కూడా వేల‌కొద్దీ సినిమాలున్నాయి. సైన్స్ ఫిక్ష‌న్‌, అడ్వెంచ‌ర్‌, కొరియ‌న్ డ్రామా, వెస్ట్ర‌న్‌, ఎల్జీబీటీ లాంటి ఇరవై కేటగిరీలున్నాయి. దీనిలో కూడా ప్ల‌గిన్ అవ‌స‌రం లేకుండా నేరుగా వీడియోలు చూడ‌డానికిఇన్‌బిల్ట్ వీడియో ప్లేయ‌ర్ ఉంది. వ్యూస్ట‌ర్ సినిమాల‌న ఐ ఫోన్‌, ఆండ్రాయిడ్ ఫోన్ల లోచూడ‌డానికి యాప్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. కూడా ఇవి కాక మ‌న‌కు ఇంత‌కుముందే ప‌రిచ‌యం ఉన్న యూట్యూబ్‌, హాట్‌స్టార్‌తోపాటు మ‌రిన్ని వెబ్‌సైట్లు కూడా ఉన్నాయి. అవి
Classic Cinema Online
Retrovision
Moviezoot
Archive.org

జన రంజకమైన వార్తలు