• తాజా వార్తలు
  •  

సుడోకు సాల్వ్ చేయడానికి ఉచిత వెబ్ సైట్లు ఉన్నాయని తెలుసా?

సుడోకు...ఇది అత్యంత ప్రజాదరణ పొందిన పజిల్ క్రీడలలో ఒకటి. ఈ పజిల్ ను బుర్ర ఉపయోగించి ఆడాల్సి ఉంటుంది. అందుకే దీన్ని అద్భుతమైన మైండ్ గేమ్ అని కూడా అంటారు. న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్ లోనే కాదు ఆన్ లైన్లోనూ ఫ్రీగా ఆడవచ్చు. సుడోకు ఈజీగా సాల్వ్ చేసేందుకు కొన్ని బెస్ట్ ఫ్రీ వెబ్ సైట్లు ఉన్నాయి. ఈ వెబ్ సైట్లు మీరు సుడోకు స్టెప్ బై స్టెప్ ఎలా పూర్తిచేయాలో క్లుప్తంగా వివరిస్తాయి. వాటి గురించి తెలుసుకుందాం.

1.    సుడోకు-సొల్యూషన్స్.....

ఈ వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్లో సుడోకు ఆడుతుంటే...స్టెప్ బై స్టెప్ సాల్వ్ చేసేందుకు ఉపయోగపడుతుంది. ఈ సైట్లో 3వేలకు పైగా ఫ్రీ సుడోకు పజిల్స్ ఉన్నాయి. ఇందులో సులభ స్థాయి నుంచి కఠిన స్థాయి వరకు పజిల్స్ ఉంటాయి. 9 × 9 సుడోకు రెప్లికేట్ చేసేందుకు సీడ్ నెంబర్స్ ఉపయోగించవచ్చు. అంతేకాదుసుడోకు పజిల్ను పూర్తిచేసేందుకు మూడు ఆప్షన్స్ ఉంటాయి.

సాల్వ్ సెల్:  స్టెప్ బై స్టెప్ పరిష్కరించడానికి, ట్యాబ్లో సెలక్ట్ చేసుకున్న పజిల్ ఆధారంగా పరిష్కరించవచ్చు. ఒకే సందర్భంలో పజిల్ను పూర్తిగా పరిష్కరించవచ్చు. ఒక పజిల్ను పూర్తిచేసిన తర్వాత, మీరు దానిని మీ పీసీలో టెక్ట్స్ ఫైల్ గా కూడా సేవ్ చేసుకోవచ్చు.

2. సుడోకు 9x9

దీనిని ఆన్ లైన్లో స్టెప్ బై స్టెప్ ఈజీగా పూర్తిచేయవచ్చు. ఒక పజిల్ పూర్తి చేయడానికి కావాల్సిన సెట్, నాక్డ్ సెట్ వ్యూహాలను ఇది ఉపయోగిస్తుంది. కిండర్ గార్టెన్, ఎలిమెంటరీ, హైస్కూల్, కాలేజ్, గ్రాడ్యుయేట్ లాంటి ఐదు కఠిన లెవల్స్ కూడా ఇందులో ఉంటాయి. మీకు ఏ లెవల్ కావాలో సెలక్ట్ చేసుకుని క్లిక్ చేయండి. ఇక స్టెప్ బై స్టెప్  పజిల్ సాల్వ్ చేసేందుకు...సుడోకు బాటమ్ లో రైట్ సైడ్ ఉన్న నెక్ట్స్ బటన్ను ప్రెస్ చేయండి. మీరు చేసే ప్రతి దశను కూడా మెసేజ్ బోర్డులో చూపిస్తుంది. సుడోకు సాల్వ్ ప్రొసెస్ అర్థం చేసుకోవడానికి చాలా సులభంగా ఉంటుంది.

3.    Stolaf.edu...

ఆన్ లైన్ సుడోకు అసిస్టెంట్ అనేది యూజర్లకు స్టెప్ బై స్టెప్ పజిల్ను ఎలా పరిష్కరించాలో తెలియజేయడానికి డిజైన్ చేయబడింది. ఇక్కడ కొన్ని సూచనలు ఉంటాయి. వాటితో మీరు పజిల్ను పూర్తిచేయవచ్చు. అంతేకాదు ఒక స్పెసిఫిక్ నెంబర్ కోసం అన్ని అభ్యర్థనలను కనుగొనవచ్చు. దీనిగురించి

క్రాస్ క్యాచ్ స్కానింగ్ ద్వారా నాక్డ్ మరియు హిడెన్ సింగిల్స్ కనుగొనవచ్చు.

·       రేంజ్ చెకింగ్ ( లాక్డ్ అభ్యర్థులు)

·       రో/సెల్/బ్లాక్ సబ్సెట్ ఎలిమినేషన్

·       గ్రిన్ అనాలసిస్ (x-వింగ్స్, xy-వింగ్స్)

·       3D మెడుసా చైన్ అనాలసిస్

·       చైన్ ఆప్షన్స్.

4.    Sudoku.ironmonger..

ఈ వెబ్ సైట్ ద్వారా సుడోకు స్టెప్ బై స్టెప్ చక్కగా పరిష్కరించవచ్చు. ఇది చాలా ఈజీగా...అందరికీ అర్ధమయ్యేలా ఉంటుంది. ఇందులో 27 డిఫరెంట్ సుడోకు సాల్వ్ స్ట్రాటజీలు ఉన్నాయి. ఒక సమస్య పరిష్కరించడానికి మీరు అన్ని వ్యూహాలను ఉపయోగించాల్సి ఉంటుంది. అంతేకాదు మీకు ప్రతి స్టెప్ కు సంబంధించిన వివరాలను చూపించే ఒక పజిల్ టెక్ట్స్ బాక్స్ కూడా ఉంటుంది.

మీరు ఒక సెల్ పై క్లిక్ చేసినట్లయితే...ఎల్లో కలర్ బాక్స్ ను డిస్ల్పే చేస్తుంది. ప్రతి బాక్స్ నుంచి వ్యాలూవ్స్ తొలగించేందుకు క్లిక్ చేయండి. వీటితోపాటు మీకు అసిస్టెంట్ గా ఉండేదుకు కొన్ని సెల్స్ కు కలర్స్ కూడా వేయవచ్చు.

5.    Sudoku hints....

సుడొకు హింట్స్ ....సుడోకును ఈజీగా పరిష్కరించేందుకు ఉపయోగపడుతుంది. అంతేకాదు దీనిలో ప్రతిరోజు కొత్త పజిల్ ను యాడ్ అవుతుంది. .డ్రాప్ డౌన్ నుంచి ఒక పజిల్ సెలక్ట్ చేసుకోవచ్చు. మీకు కఠినమైన పజిల్ కావాలంటే టాబ్ సెలక్ట్ చేసుకుని మీకు కావాల్సిన పజిల్ను ఎంచుకోవచ్చు.  టెక్ట్స్ బాక్స్ లో సుడోకు హింట్స్ అనేది రైట్ సైడ్ ఉంటుంది. ఇది ఆటోమెటిగ్గా పనిచేస్తుంది. చెక్ బాక్స్ ద్వారా అభ్యర్థుల విలువలను సెలక్ట్ చేసుకోవడంతో దీన్ని ప్రారంభించవచ్చు. హింట్ బటన్ మీకు కావాల్సిన బాక్స్ ను  చూపిస్తే...బిగ్ హింట్ మీరు ఏ సంఖ్యను ఇన్సర్ట్ చేయాలో చెప్పుతుంది.

చెకింగ్ చెక్ బాక్స్ తో మీరు పజిల్ను సరిగ్గా పరిష్కరిస్తున్నారో లేదో తెలుసుకోవచ్చు. సుడోకుహింట్స్ మీ టైం సూచనలతో దశలవారీగా పజిల్ ను పరిష్కరిస్తుంది. 

జన రంజకమైన వార్తలు