• తాజా వార్తలు

వాట్సాప్ ఫార్వార్డింగ్‌లో మీకు క‌చ్చితంగా తెలియ‌ని ట్రిక్స్‌

వాట్సాప్ లేని స్మార్ట్‌ఫోన్  వెత‌కడం చాలా క‌ష్టం. అంత‌గా పాపుల‌ర‌యిన ఈ మెసేజింగ్ యాప్ ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త కొత్త ఫీచ‌ర్ల‌తో యూజ‌ర్లను ఎట్రాక్ట్ చేస్తూనే ఉంది. వాట్సాప్‌లో మ‌న‌కు వ‌చ్చిన మెసేజ్‌ను న‌చ్చితేనో లేదంటే బంధు మిత్రుల‌తోనో, ఆఫీస్‌లో కొలీగ్స్‌తోనో పంచుకోవాల్సి వ‌స్తే వెంట‌నే ఫార్వ‌ర్డ్ చేస్తుంటాం. ఇలా ఫార్వ‌ర్డ్ చేయ‌డంలో చాలా ట్రిక్స్ ఉన్నాయి. వాట్సాప్ యూజ‌ర్‌‌లో పెద్ద‌గా ఎవ‌రికీ తెలియ‌ని,  ఆ యూజ్‌ఫుల్ ట్రిక్స్ మీకోసం..
ఒరిజ‌న‌ల్ క్యాప్ష‌న్‌తో ఫొటో షేర్ చేయ‌డం 
వాట్సాప్‌లో మీకు ఓ క్యాప్ష‌న్‌తో ఓ ఫోటో వ‌చ్చింది. దాన్ని వేరే వాళ్ల‌కు షేర్ చేయాలంటే ఫార్వ‌ర్డ్ చేస్తాం.అయితే అప్పుడు ఆ ఇమేజ్ మాత్ర‌మే షేర్ అవుతుంది. క్యాప్ష‌న్ రాదు. క్యాప్ష‌న్‌తోపాటు మీ ఫోటో వాళ్ల‌కు షేర్ చేయాలంటే ఓ ట్రిక్ ఉంది.
1. మీ వాట్సాప్ చాట్ ఓపెన్ చేసి మీరు క్యాప్ష‌న్‌తో సహా పంపాల‌నుకున్న ఫోటోను ఒక్క‌సారి టాప్ చేయండి. త‌ర్వాత వాట్సాప్ పేజీలో టాప్‌లోనైట్ సైడ్ క‌నిపించే త్రీ డాట్స్ (...) మెనూను క్లిక్ చేయండి.
2.మెనూలో నుంచి Share బ‌ట‌న్‌ను ట్యాప్ చేయండి. షేరింగ్ ఆప్ష‌న్స్‌లో నుంచి WhatsAppను సెలెక్ట్ చేయండి.
3.Send to స్క్రీన్‌లో వాట్సాప్ ఓపెన్ అవుతుంది. మీరు ఇమేజ్ పంపాల‌నుకున్న కాంటాక్ట్‌ను టాప్ చేసి కింద ఉన్న గ్రీన్ క‌ల‌ర్ బ‌ట‌న్‌ను నొక్కండి.
4.ఇప్పుడు మీకు ఆ ఇమేజ్ క్యాప్ష‌న్‌తో పాటు కాపీ అవ‌డం క‌నిపిస్తుంది. కావాలంటే ఆ క్యాప్ష‌న్‌ను ఎడిట్ చేయొచ్చు. ఎమోజీలు యాడ్ చేయొచ్చు. సెండ్ చేస్తే క్యాప్ష‌న్‌తో పాటు ఇమేజ్ సెండ్ అవుతుంది.
వాట్సాప్ మెసేజ్‌ను సెండ‌ర్ నేమ్‌, టైమ్ స్టాంప్‌తో సెండ్ చేయడం
ఏదైనా వాట్సాప్ చాట్ హిస్ట‌రీని మీ ఫ్రెండ్‌కు సెండ్ చేయాలంటే మామూలుగా సెండ్ చేస్తారు.  సెండ‌ర్ నేమ్‌, చాట్ హిస్ట‌రీని స్క్రీన్‌షాట్ తీసిన టైమ్‌తో స‌హా మీ ఫ్రెండ్‌కు  సెండ్ చేయొచ్చు తెలుసా.. దానికి ఏం చేయాలంటే..
1. వాట్సాప్‌ చాట్‌ను ఓపెన్ చేయండి.  రిసీవ్‌డ్ మెసేజ్‌ను టాప్ చేసి హోల్డ్ చేయండి. మ‌రిన్ని మెసేజ్‌లు కావాలంటే వాటిని వ‌న్ బై వ‌న్ సెలెక్ట్ చేయాలి. త‌ర్వాత టాప్ బార్‌లో ఉన్న కాపీ  ఐకాన్‌ను క్లిక్ చేయాలి.
2. ఇప్పుడు బ్యాక్‌కు వెళ్లి చాట్ త్రెడ్‌ను ఓపెన్‌చేయాలి.  మెసేజ్ బాక్స్‌ను లాంగ్ ట‌చ్  చేసి అక్క‌డ మీరుకాపీ చేసిన మెసేజ్‌ను పేస్ట్ చేయాలి.
3. మీరు కాపీ చేసిన మెసేజ్‌లు నేమ్‌, టైమ్‌తో స‌హా  మెసేజ్ బాక్స్‌లో పేస్ట్ అవుతాయి.  సెండ్ బ‌ట‌న్ నొక్కి షేర్ చేయండి.

జన రంజకమైన వార్తలు