• తాజా వార్తలు

 ఆధార్ కార్డు పోయిందా?  డోంట్ వ‌ర్రీ.. ఆన్‌లైన్లో డూప్లికేట్ తీసుకోండి ఇలా.

 

 

 

 

 

ఇండియాలో ఇప్పుడు ప్ర‌తి ప‌నికీ ఆధార్ తోనే లింక్‌. బ‌ర్త్ స‌ర్టిఫికెట్ నుంచి విమానంలో ప్ర‌యాణం వ‌ర‌కు ఏ ప‌ని చేయాల‌న్నా ముందుగా ఆధార్ నెంబ‌ర్ చెప్ప‌మంటున్నారు.  అలాంటి ఆధార్ కార్డు పోతే మ‌ళ్లీ ఆధార్ సెంట‌ర్‌కో, ఈ సేవ‌కో, మీసేవ‌కో వెళ్లి డూప్లికేట్ తీసుకోవాలంటే చాలా హెడేక్‌. ఇప్పుడా బాధ మీకు లేదు. ఈ సింపుల్ టిప్స్ పాటించి మీ ఇంట్లో నుంచే ఆధార్ కార్డు డూప్లికేట్‌ను పొంద‌వ‌చ్చు.

 

ఆధార్ డూప్లికేట్ పొందే విధానం..

1.https://uidai.gov.in/  వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి

2. దీనిలో  'Aadhaar Online Servicesస‌   హెడ్ కింద  ఫ‌స్ట్ లైన్‌లో లాస్ట్  'Retrieve Lost UID/EID ఆప్ష‌న్ ఉంటుంది. దాన్ని టాప్ చేయండి

3 ఇప్పుడు వెబ్‌సైట్ మిమ్మ‌ల్ని మ‌రో పేజీలోకి డైరెక్ట్ చేస్తుంది. ఈ పేజీలో మీ పేరు, మొబైల్ నెంబ‌ర్ న‌మోదు చేయాలి. మీరు ఆధార్ నెంబ‌ర్ (UID) తిరిగి పొందాల‌నుకుంటున్నారా లేదా  ఎన్‌రోల్‌మెంట్ నెంబ‌ర్ (EID) కోసం ప్ర‌య‌త్నిస్తున్నారా స్పెసిఫై చేయాలి.

4.  ఈ వివ‌రాలు ఫిల్ చేశాక  'Send One Time Password ఆప్ష‌న్‌ను క్లిక్ చేయాలి.

5. మీ మెయిల్ ఐడీతోపాటు మొబైల్ నెంబ‌ర్‌కు ఓటీపీ వ‌స్తుంది. దాన్ని న‌మోదు చేసి వెరిఫై చేసుకోవాలి.

6. ఇప్పుడు మీ మెయిల్ ఐడీ లేదా మొబైల్ నెంబ‌ర్‌కు ఆధార్ నెంబ‌ర్ లేదా ఎన్‌రోల్‌మెంట్ నెంబ‌ర్ (మీరు ఏది ఆప్ష‌న్ ఇస్తే అది) వ‌స్తుంది.  దీని ఈ-కాపీని కూడా డౌన్లోడ్ చేసుకోవ‌చ్చు.

7.  'Download Aadhaar' ఆప్ష‌న్‌ను క్లిక్ చేస్తే కొత్త పేజీకి డైరెక్ట్ చేస్తుంది. ఇక్క‌డ మీరు ఆధార్ నెంబ‌ర్‌/ ఎన్‌రోల్‌మెంట్ ఐడీ, నేమ్‌, పిన్‌కోడ్‌, మీ ఇంటి  అడ్ర‌స్  వంటి డిటెయిల్స్ ఫిల్ చేయాలి. 

8. త‌ర్వాత 'Get One Time Password ఆప్ష‌న్‌ను టాప్ చేస్తే మీ రిజిస్ట‌ర్డ్ మొబైల్ నెంబ‌ర్‌కు ఓటీపీ వ‌స్తుంది. ఈ ఓటీపీ రిసీవ్ చేసుకుని  ఆ పేజీలో ఓటీపీ అని ఉన్న చోట రికార్డు చేస్తే ఈ-ఆధార్ కాపీని పీడీఎఫ్ రూపంలో డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.

9. ఈ పీడీఎఫ్ పైల్ పాస్‌వ‌ర్డ్‌తో ఓపెన్ అవుతుంది. మీ ఇంటి చిరునామాకు ఉన్న పిన్‌కోడ్ నెంబ‌రే దాని పాస్‌వ‌ర్డ్‌.  

 

మొబైల్ నెంబ‌ర్ లేదా ఈ మెయిల్ ఐడీకి ఓటీపీ రాక‌పోతే UIDAI వెబ్‌సైట్ హోం పేజీలో ఉన్న 'Verify Email/Mobile Number' ఆప్ష‌న్‌ను క్లిక్ చేసి మీ మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడీని వెరిఫై చేసుకోవాలి. అప్ప‌డు మ‌ళ్లీ డిటెయిల్స్ ఫిల్ చేస్తే మీరు ఈ-కాపీని డౌన్లోడ్ చేసుకోవ‌చ్చు.

 

జన రంజకమైన వార్తలు