• తాజా వార్తలు
  •  

ఫోన్ నీళ్ళల్లో పడినపుడు ఏం చేయాలి? ఏం చేయకూడదు?

మన ఫోన్ తడవడం గానీ లేదా నీళ్ళలో పడడం గానీ సాధాణంగా జరిగేదే. అయితే ఆ సమయం లో మనం కంగారు పడి ఏదో ఒకటి చేసేస్తాము. దానివలన మన ఫోన్ పాడయ్యే ప్రమాదం ఉంది. ఫోన్ నీళ్ళలో పడినపుడు మనం ఏంచేయాలి ? ఏం చేయకూడదు? తదితర విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం

వెంటనే స్విచ్ ఆఫ్ చేసేయాలి

మనం ఫోన్ నీళ్ళలో పడిన మరుక్షణం మనం చేయాల్సిన పని దానిని స్విచ్ ఆఫ్ చేయడమే. వీలైతే బ్యాటరీ తీసి ప్రక్కన పెట్టాలి. తడి ఫోన్ ను వాడడం వలన మరింత రిస్క్ ఉంటుంది. అది మొత్తానికే చెడిపోయే అవకాశం ఉంటుంది.

శుభ్రంగా తుడిచి షేక్ చేయండి

మీ స్మార్ట్ ఫోన్ ను స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత నీట్ గా ఉన్న పొడి గుడ్డ ఒకటి తీసుకుని ఫోన్ మొత్తం శుభ్రంగా తుడవాలి. ఆ తర్వాత దానిని పేపర్ టిష్యూ లలో గానీ కిచెన్ టవల్ లో గానీ వీలైనంత ఎక్కువసేపు ఉంచాలి. దీనివలన దానికి ఏదైనా తేమ ఉన్నట్లయితే అది పోయే వీలు ఉంటుంది. హెడ్ ఫోన్ లు , కేబుల్ లు లాంటి యాక్సేసరీ లు ఏవైనా ఉంటే వాటిని వెంటనే తీసివేసి సిమ్ కార్డు, మెమరీ కార్డు లను కూడా తీసివేయాలి. ఇలా చేసిన తర్వాత మీ ఫోన్ ను వివిధ రకాల యాంగిల్ లలో షేక్ చేయాలి. దీనివలన ఫోన్ లోపల ఇంకా ఏదైనా నీరు అదనంగా ఉంటే అది బయటకు వచ్చే వీలు ఉంటుంది.

మీ స్మార్ట్ ఫోన్ ను ఒక బియ్యం సంచిలో ఉంచండి

ఈ తరహా ట్రిక్ గురించి ఇంతకుముందు మనం ఒక ఆర్టికల్ లో ఇచ్చియున్నాము. ఫోన్ నీళ్ళలో పడినపుడు చేయవలసిన అసలైన పని దానిని తేమను గ్రహించగలిగే సాచెట్ లు ఉన్న ఎయిర్ టైట్ బాక్స్ లో ఉంచడం. అయితే ఇలాంటివి సాధారణ జనాలకి అందుబాటులో ఉండవు కదా! దీనికి చక్కటి ప్రత్యామ్నాయం మీ ఫోన్ ను బియ్యంలో ఉంచడం. ఎందుకంటే బియ్యం గింజలు ఎక్కువ తేమను గ్రహించగలుగుతాయి. ఒక చిన్న సంచిలో బియ్యం తీసుకుని దానిలో మీ ఫోన్ పూర్తిగా మునిగేటట్లు ఉంచి 24-48 గంటల పాటు అలాగే ఉంచాలి.

ఎండలో కూడా ఉంచవచ్చు

మీ ఫోన్ ను మరింత డ్రై గా ఉంచడానికి ఎండలో కూడా ఉంచవచ్చు.

మీరు మీ ఫోన్ టర్న్ ఆన్ చేసిన తర్వాత మీ డేటా అంతటినీ బ్యాక్ అప్ తీసుకోండి

మీ ఫోన్ తడిసినది కాబట్టి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. కొన్ని సందర్భాల్లో వెంటనే ఆన్ అయ్యే అవకాశం ఉంటుంది. పైన చెప్పిన విధాలలో మీ ఫోన్ ను డ్రై చేసిన తర్వాత ఆన్ చేసి అందులో ఉన్న డేటా అంతటినీ బ్యాక్ అప్ తీసుకోండి.

 ఛార్జింగ్ పెట్టే ప్రయత్నం చేయకూడదు.

మీ ఫోన్ లో నీళ్ళు పడినపుడు దానికి ఛార్జింగ్ పెట్టే ప్రయత్నం చేయకూడదు. దీనివలన షార్ట్ సర్క్యూట్ జరిగి ఫోన్ మరింత డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే హెడ్ ఫాన్స్, డేటా కేబుల్ లాంటవి కూడా పెట్టకూడదు.

హెయిర్ డ్రయ్యర్ తో డ్రై చేయకూడదు

కొంతమంది ఫోన్ ను డ్రై గా చేయడానికి హెయిర్ డ్రయ్యర్ లను ఉపయోగిస్తారు. దీనివలన ఫోన్ లో ఉన్న ఎలక్ట్రానిక్ విడి భాగాలూ పాడయ్యే అవకాశం ఉంది. అలాగే ఓవెన్ లు, రేడియేటర్ లాలాంటి వాటి వద్ద కూడా ఫోన్ లను ఉంచకూడదు.

కంపెనీ దగ్గరకు తీసుకు వెళ్ళినపుడు అబద్దం చెప్పకూడదు.

ఫోన్ నీళ్ళలో పడి పూర్తిగా తడిసిపోయినపుడు వాటికి వారంటీ ఉండదు. అయితే కొన్ని సందర్భాలలో యాక్సిడెంటల్ ఆక్సిడేషన్ గ్యారంటీ అదనంగా ఉంటుంది. కాబట్టి మన ఫోన్ ను కంపెనీ దగ్గరకు తీసుకువెళ్ళినపుడు వాళ్లకి అబద్దం చెప్పకూడదు.

జన రంజకమైన వార్తలు