• తాజా వార్తలు
  •  

స్వర్ణోత్సవ కాలేజీ KLU

డ్డేశ్వరం. ఇది గుంటూరు జిల్లా లోని ఒక మారుమూల కుగ్రామం.అక్కడ ఒక వూరు ఉంది అనే సంగతి కొన్ని సంవత్సరాల క్రితం వరకూ ఎవరికీ తెలియదు.కొన్నాళ్ళ క్రితం వరకూ అది ఒక మామూలు గ్రామం.ఇప్పుడు కూడా మామూలు గ్రామమే.కానీ పరిసర గ్రామాలకూ ఆ ఊరికీ ఎంతో  తేడా !ఆ ఊరిలో ఎక్కడ చూసినా విద్యార్థుల వసతి గృహాలు,మెస్ లు ,ఇంటర్ నెట్ సెంటర్ లు,సాయంత్రం అయితే గ్రామ వీధులలో సందడి సందడి గా తిరిగే యువకులు.దీనికి కారణం.కోనేరు లక్ష్మయ్య యూనివర్సిటీ.షార్ట్ కట్ లో KLU.

తెలుగు రాష్ట్రాల లోనే కాదు దేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీ లలో ఒకటి గా నిలిచిన KL యూనివర్సిటీ 1980 లో కీ.శే.కోనేరు లక్ష్మయ్య గారిచే ఇంజనీరింగ్ కళాశాల గా  ప్రారంభించబడి,అంచెలంచలుగా  యూనివర్సిటీ గా ఎదిగింది.ఈ ప్రస్థానంలో ఎన్నో మైలు  రాళ్ళను దాటుకుంటూ కొన్ని వేలమంది విద్యార్థులను సాంకేతిక పట్టభద్రులుగా తయారు చేసిన ఘనత KL యూనివర్సిటీ ది.కేవలం ఇంజనీరింగ్ విద్యనే కాకుండా దాదాపు 600 మంది పరిశోదనా విద్యార్థులను కలిగి ఉన్న ఈ యూనివర్సిటీ దక్షిణ భారత దేశం లోనే అత్యుత్తమ యూనివర్సిటీ గా నిలిచింది.కోర్సులను అందించటంలో విభిన్నతే దీనిని ఈ స్థాయిలో నిలిపింది.అంతేగాక దాదాపు 9 సంవత్సరాల నుండి 100 శాతం ప్లేస్ మెంట్ లను అందిస్తూ,దాదాపు 10000 మంది దేశ విదేశీ విద్యార్థులతో  విద్యార్థుల,తలిదండ్రుల విశ్వాసాన్ని చూరగొంటూ ఉన్నది.

ఇక ఈ యూనివర్సిటీ ఉన్న ప్రదేశాన్ని చూసినట్లయితే అది ఒక అందమైన ప్రదేశం.మన దేశం లోనే ప్రముఖ మైన బకింగ్ హం కాలువ ఒడ్డున ఉన్నది.ఎటు చూసినా పచ్చటి పొలాలు,పక్కనే చారిత్రాత్మక కాలువ,కూతవేటు దూరం లో విజయవాడ నగరం,5 వ నెంబర్ జాతీయ రహదారి ,చెన్నై కోలకతా రైల్వే లైన్ ఇలా ఎన్నో రకాల సదుపాయాలతో మన రెండు తెలుగు రాష్ట్రాల లోనే గాక దేశంలోనే ఇంజినీరింగ్ విద్య ను అభ్యసించాలనుకునే విద్యార్థులకు ఒక మంచి అవకాశం గా కనిపిస్తుంది.

ఈ యూనివర్సిటీ గురించి,అక్కడ ఉన్న కోర్సుల గురించి,సాంకేతిక విద్యకు సంబంధించి అక్కడ జరిగే అంశాల గురించీ మనం తర్వాతి వ్యాసాలలో చర్చిద్దాం.అక్కడ ఉన్న మన కంప్యూటర్ విజ్ఞానం ప్రతినిధులకు ఆల్ ది బెస్ట్ చెబుతూ .......................................కంప్యూటర్ విజ్ఞానం.

 

జన రంజకమైన వార్తలు

విజ్ఞానం బార్ విశేషాలు