• తాజా వార్తలు
  •  

 ఫొటో బండ్లింగ్‌, ఎనీఫైల్ సెండింగ్.. వాట్సాప్ యూజ‌ర్లంద‌రికీ వ‌చ్చేశాయ్‌..

మోస్ట్ పాపుల‌ర్‌ మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజ‌ర్ల‌కు గుడ్ న్యూస్‌..  ఇక‌పై మీరు ఎవ‌రికైనా ఎక్కువ ఫొటోలు పంపాలంటే వాళ్ల‌కు ఒక్క‌సారే సెలెక్ట్ చేసి సెండ్ చేస్తే వాళ్లు ఒకేసారి దాన్ని ఆల్బ‌మ్‌లా ఓపెన్ చూసి చూసుకోవ‌చ్చు.  ఈ ఫీచ‌ర్‌ను ఫోటో బండ్లింగ్ అంటారు.  ఈ ఫీచ‌ర్ ఇప్పుడు వాట్సాప్ యూజ‌ర్లంద‌రికీ అందుబాటులోకి వ‌చ్చింది. మీరు మీ వాట్సాప్ ను అప్‌డేట్ చేస్తే చాలు.. ఈ ఫీచ‌ర్‌ను వాడుకోవ‌చ్చు. 
ఏమిటీ ఫొటో బండ్లింగ్ 
ప్ర‌స్తుతం వాట్సాప్ లో ఎవ‌రికైనా ఎక్కువ ఫొటోలు పంపితే  మ‌నం ఒకేసారి సెండ్ చేసినా ఒక‌దాని త‌ర్వాత ఒక‌టే వాళ్ల‌కు సెండ్ అవుతున్నాయి.  ఫొటో బండ్లింగ్ ఫీచ‌ర్ ద్వారా ఎక్కువ ఫొటోల‌ను ఒక ప‌ర్స‌న్‌కు పంపిస్తే అది ఫొటో ఆల్బ‌మ్ మాదిరిగా వాళ్ల‌కు చేరుతుంది. వాళ్లు అలా రిసీవ్ చేసుకున్న ఆల్బ‌మ్‌ను ఓపెన్ చేస్తే  ఫోటోల‌న్నీ సింగిల్ పేజీలోనే క‌నిపిస్తాయి.  ఐఫోన్ యూజ‌ర్ల‌కు ఈ ఫీచ‌ర్ గ‌త నెల‌లోనే అందుబాటులోకి వ‌చ్చింది. ఆండ్రాయిడ్ బీటా యూజ‌ర్ల‌కు టెస్ట్ చేసి చూసిన త‌ర్వాత స‌క్సెస్ కావ‌డంతో ఇప్పుడు యూజ‌ర్లంద‌రికీ అందుబాటులోకి తెచ్చింది. 
ఎనీ ఫైల్ ట్రాన్స్‌ఫ‌ర్  
 దీంతో ఫొటోలు, వీడియోలే కాదు పీడీఎఫ్‌, వ‌ర్డ్ వంటి ఏ ఫార్మాట్‌లో ఉన్న ఫైల్‌న‌యినా సెండ్ చేయొచ్చు. ఎంపీ3 సాంగ్స్‌, ఆఖ‌రికి ఏదైనా యాప్‌కు సంబంధించిన ఏపీకే ఫైల్‌ను కూడా నేరుగా వాట్సాప్‌తో షేర్ చేయొచ్చు. 
కాలింగ్ స్క్రీన్ చేంజెస్:  వాట్సాప్‌లో కాలింగ్ స్క్రీన్‌లో కూడా మార్పులు చేసింది. ఇంత‌కుముందు కాల్ ఆన్స‌ర్ చేయాలంటే సైడ్‌కు స్వైపింగ్ చేయాల్సి ఉండేది. ఇప్పుడు  పైకి స్వైప్ చేయాల్సి ఉంటుంది. 
ఇంప్రూవ్డ్  టెక్స్ట్ 
ఛాటింగ్ చేసేట‌ప్పుడు టెక్స్ట్ సైజ్‌ను కావాలంటే పెంచుకోవ‌డం, బోల్డ్ చేయ‌డం, ఇటాలిక్ చేయ‌డం, వ‌ర్డ్ మ‌ధ్య‌లో స్ట్రైక్ త్రూ చేయొచ్చు.
ఈ ఆప్ష‌న్ల‌న్నీ కూడా ఇప్పుడు యూజ‌ర్లంద‌రికీ అందుబాటులోకి వ‌చ్చేశాయి. 

 

జన రంజకమైన వార్తలు

విజ్ఞానం బార్ విశేషాలు