• తాజా వార్తలు
  •  

వాట్స‌ప్ హెవీ యూజ‌ర్ల‌కు ఈ యాప్‌లు వ‌ర‌మే

స్మార్ట్‌ఫోన్ ఉప‌యోగిస్తుంటే క‌చ్చితంగా వాట్స‌ప్ వాడాల్సిందే. ఏం ఉప‌యోగించినా.. ఉప‌యోగించ‌క‌పోయినా వాట్స‌ప్ మాత్రం డిలీట్ చేయ‌కూడ‌ద‌నేన్నంత‌గా జ‌నం ఫిక్స్ అయిపోయారు. ఎందుకంటే దీంతో చాటింగ్ చేయ‌డం చాలా సుల‌భం. అంతేకాదు ఫొటోలు, వీడియోలు, ఫైల్స్ ఏదీ పంపాల‌న్నా.. అందుకోవాల‌న్నా చాలా చాలా తేలిక‌.  మీ వాట్స‌ప్ వాడ‌కాన్ని మ‌రింత సుల‌భం చేసేలా కొన్ని యాప్‌లు అందుబాటులో ఉన్నాయి.. వీటిని మీ ద‌గ్గ‌ర ఉంచుకుంటే వాట్సప్‌తో వ‌చ్చే ఆనందం మ‌రింత పెరుగుతుంది.

యాప్ లాక‌ర్‌
వాట్స‌ప్ వాడుతున్న‌ప్పుడు సేఫ్టీ కోసం యాప్ లాక‌ర్‌ను పెట్టుకోవ‌డం చాలా మంచింది. మీ వాట్స‌ప్ ప్రైవ‌సీ కోసం ఈ యాప్ లాక‌ర్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. కొన్ని యాప్ లాక‌ర్స్‌తో ఇబ్బందులు కూడా ఉన్నాయి.  అందుకే పేరున్న యాప్‌ల‌ను మాత్ర‌మే డౌన్‌లోడ్ చేసుకుని వాడుకోడం మంచిది. వీటికి ఫింగ‌ర్ ప్రింట్, ప్యాట్ర‌న్‌, పిన్ అనే ఆప్ష‌న్లు ఉంటాయి. మ‌న ఇష్టం వ‌చ్చిన ఆప్ష‌న్ ఎంచుకుని మ‌న వాట్స‌ప్ లాక్ చేసుకోవ‌చ్చు.


మ్యాజిక్ క్లీన‌ర్‌
వాట్స‌ప్ అన‌గానే ఎక్క‌డాలేని వీడియోలు, ఫొటోలు, జీఐఎఫ్‌లు వ‌చ్చి మ‌న ఫోన్‌లో ప‌డిపోతుంటాయి. వాటిలో ఎన్నో డూప్లికేట్ ఫైల్స్ కూడా ఉంటాయి. ఒక్కోసారి ఒక్క వీడియో, లేదా ఫొటో రెండు మూడుసార్లు కూడా మీ వాట్స‌ప్ స్టోర్‌లో ఉండొచ్చు.  దీని వ‌ల్ల ఫోన్ స్టోరేజ్ అయిపోతుంది.  అందుకే సిఫ్ట‌ర్ మ్యాజిక్ క్లీన‌ర్ యాప్ డౌన్‌లోడ్ చేసుకుని ఎప్ప‌టిక‌ప్పుడు వాట్స‌ప్‌ను క్లీన్ చేసుకోవాలి.

నోటిఫై
వాట్స‌ప్‌లో చాట్ హెడ్స్‌ను ఎనేబుల్ చేయ‌డానికి నోటిఫై యాప్ బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. మీకు వాట్స‌ప్‌లో ఏం మెసేజ్‌లు వ‌చ్చినా.. మీకు తెలిసిపోతుంది. వాట్స‌ప్ మాత్ర‌మే కాదు టెలిగ్రామ్, స్లాక్‌, జీమెయిల్ నోటిఫికేష‌న్ల‌ను కూడా మ‌నం తెలుసుకోవ‌చ్చు. అయితే  నోటిఫై యాప్ ఫ్రీ వెర్ష‌న్‌లో యాడ్స్ ఉంటాయి. వాటిని అడ్వాన్సడ్ ఫీచ‌ర్ల ద్వారా తీసేసి వాడుకోవ‌చ్చు.
 
స్టెల్త్ టాప్ కీబోర్డు
యాప్ లాక్స్ వ‌ల్ల అంత సెక్యూరిటీ లేద‌ని భావిస్తే స్టెల్త్ టాప్ కీబోర్డును వాడుకోవ‌చ్చు.  ఈ కీబోర్డు మీ మెసేజ్‌ల‌ను ఎన్‌క్రిప్ట్ చేసి మీ మెసేజ్‌ల‌ను సేఫ్‌గా ఉంచుతుంది. మీరు చేయాల్సింద‌ల్లా మెసేజ్ టైప్ చేసి లాక్ ఐకాన్ ప్రెస్ చేసి పంపడ‌మే. మీరు ఎవ‌రికైతే మెసేజ్ పంపుతారో వాళ్లు ఆ మెసేజ్‌ను అన్‌లాక్ చేసి చ‌దువుకోవాలి. 

స్వ్కేర్ డ్ర‌యెడ్‌
నాన్ స్క్వేర్ పిక్స్‌ను వాట్స‌ప్‌లో ప్రొఫైల్ పిక్చ‌ర్‌గా పెట్టుకోవ‌డం కుద‌ర‌దు. కానీ స్క్వేర్ డ్ర‌యెడ్ యాప్ ద్వారా మ‌నం ఆ ప‌ని చేయ‌చ్చు. ప్రొఫైల్‌లోకి పిక్చ‌ర్‌ని డౌన్‌లోడ్ చేసుకుని ఈ యాప్ ద్వారా నేరుగా ఉప‌యోగించుకోవ‌చ్చు. క్రాప్ చేయాల్సిన అవ‌స‌రం లేదు.  అయితే ఈ యాప్‌లో పొపాప్‌, బ్యాన‌ర్ యాడ్స్ ఉంటాయి.

పార‌లాల్ స్పేస్‌
చాలామంది డ్యుయ‌ల్ ఫోన్లు వాడేవాళ్లు ఇంటికి ఒక‌టి, ఆఫీసుకు ఒక‌టి సిమ్‌లు ఉప‌యోగిస్తారు. అయితే వాట్స‌ప్‌లో ఆ డివిజ‌న్ కుదుర‌దు. ఇలాంటి ఇబ్బందిని తొల‌గించ‌డానికి పార‌లాల్ స్పేస్ అనే యాప్ ఒక‌టి వ‌చ్చింది. దీంతో  మీరు మీ వాట్స‌ప్‌ను రెండు భాగాలుగా డివైడ్ చేసుకోవ‌చ్చు.
 

జన రంజకమైన వార్తలు

విజ్ఞానం బార్ విశేషాలు