• తాజా వార్తలు

వాట్సాప్ లో వస్తున్న ఆ రెండు కొత్త ఫీచర్లేంటో తెలుసా?

మన అందరి జీవితాల్లో భాగమైపోయిన వాట్సాప్ ఇప్పుడు మరో రెండు కొత్త ఫీచర్లను అందించడానికి సిద్ధమైపోయింది. ప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను తీసుకొస్తున్న వాట్సాప్ అదే ఊపు కొనసాగిస్తూ మరో రెండు కొత్త ఫీచర్లను ఆండ్రాయిడ్‌, ఐవోఎస్‌ వినియోగదారుల కోసం అందుబాటులోకి తేవడానికి అన్ని ఏర్పాట్లు చేసింది. 

 ఏంటవి?
‘ఇమోజీ సెర్చ్‌’, ‘వీడియో స్ట్రీమింగ్‌’ సదుపాయాలను తన వినియోగదారులను అందించనుంది. సాధారణంగా వాట్సాప్ చాట్ లో చాలామంది తమ మనోభావాలను వ్యక్తీకరించడానికి పదాలు కంటే ఎమోజీలపైనే ఆధారపడుతున్నారు.  అందుకే ఎమోజీలను పంపడం మరింత సులభతరం చేస్తోంది వాట్సాప్‌. ఇందుకోసం ‘ఇమోజీ సెర్చ్‌’ను తీసుకొచ్చింది. 
    నిజానికి ఇప్పటికే గూగుల్‌ జీబోర్డ్‌లాంటి థర్డ్‌ పార్టీ యాప్స్‌ ద్వారా ఇమోజీ సెర్చ్‌ అందుబాటులో ఉంది.  కానీ, వాట్సాపే ఇన్ బిల్ట్ గా దీన్ని అందించనుంది. ప్రస్తుతం ఇది బీటా వెర్షన్‌లో ఉంది. త్వరలో వినయోగదారులందరికీ అందుబాటులోకి రానుంది.

ఐఫోన్ యూజర్ల కోసం
ఇక ఐఫోన్‌ యూజర్లకు వీడియో స్ట్రీమింగ్‌ ఫీచర్‌ను వాట్సాప్‌ ప్రవేశపెట్టనుంది. ఇప్పటివరకూ ఎవరైనా పంపిన వీడియోను చూడాలనుకుంటే అది పూర్తిగా డౌన్‌లోడ్‌ అయ్యే వరకూ వేచి చూడాల్సి వచ్చేది. ఈ సరికొత్త ఫీచర్‌తో ఆ ఇబ్బంది లేదు. వీడియో డౌన్‌లోడ్‌ కాకుండానే స్ట్రీమింగ్‌ ద్వారా చూసుకోవచ్చు. ఇది కూడా బీటా దశలోనే ఉంది.

జన రంజకమైన వార్తలు