• తాజా వార్తలు
  •  

వాట్సాప్‌లో కొత్త ఫీచ‌ర్‌.. ఎలాంటి ఫైల్‌న‌యినా సెండ్ చేసుకోవ‌చ్చు  స్మార్ట్‌ఫోన్ యూజ‌ర్ల‌లో అత్య‌ధిక మంది వాడే  మెసేజింగ్ యాప్ వాట్సాప్  ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త కొత్త ఫీచ‌ర్ల‌తో  యూజ‌ర్ల‌ను ఆక‌ట్టుకుంటోంది.  మెసేజ్‌ల‌తోపాటు ఫైల్ షేరింగ్ కూడా ఉండ‌డం దీన్ని బాగా పాపుల‌ర్ చేసింది. వాట్సాప్‌ను  ఫేస్‌బుక్ గ్రూప్ కొనుక్కున్న త‌ర్వాత  కొత్త ఫీచ‌ర్ల‌ను యాడ్ చేయ‌డం స్పీడ‌ప్ అయింది.  ఇప్ప‌టివ‌ర‌కు వాట్సాప్‌లో జేపీజీలు, వీడియోలు, జిఫ్‌లు మాత్ర‌మే షేర్ చేసుకోగ‌లుగుతున్నాం.  పీడీఎఫ్‌లు, స్ప్రెడ్‌షీట్స్‌, ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జంటేష‌న్ స్లైడ్స్‌, వ‌ర్డ్ డాక్య‌మెంట్స్ వంటి అన్ని ర‌కాల ఫైల్స్‌ను షేర్ చేసుకునేలా కొత్త ఫంక్ష‌న్‌ను తీసుకురావ‌డానికి వాట్సాప్ ప్రయ‌త్నిస్తోంది. ప్ర‌స్తుతం ఇది టెస్టింగ్ స్టేజ్‌లో ఉంది. ఎప్ప‌టి నుంచి ఈ ఫీచ‌ర్ అందుబాటులోకి వ‌స్తుంద‌న్న‌ది ఇంకా క్లారిటీ లేదు. 
ఫైల్ సైజ్ లిమిట్‌
ఎలాంటి ఫైల్‌ను అయినా సెండ్ చేసుకునే ఆప్ష‌న్ వ‌చ్చాక దానికి కొంత సైజ్ లిమిట్ పెట్టాల‌ని వాట్సాప్ ఆలోచిస్తోంది.  ఆండ్రాయిడ్‌కి అయితే 100 ఎంబీ, ఐఓఎస్‌ల‌లో అయితే 128 ఎంబీ వ‌ర‌కు ఫైల్స్‌ను షేర్ చేసుకోవ‌చ్చు. అంత‌కంటే పెద్ద ఫైల్స్ అయితే కోట్లాది మంది యూజ‌ర్లున్న వాట్సాప్ స‌ర్వ‌ర్లు క్రాష్ అవుతాయనే భ‌యంతోనే సైజ్ లిమిట్ పెట్ట‌బోతోంది. ఇక వాట్సాప్ వెబ్ ద్వారా అయితే 64 జీబీ వ‌ర‌కు ఫైల్స్‌ను పంపుకోవ‌చ్చు.  

జన రంజకమైన వార్తలు

విజ్ఞానం బార్ విశేషాలు