• తాజా వార్తలు
  •  

వాట్స‌ప్  మెసేజ్‌ల‌ను గూగుల్ డ్రైవ్‌లో సేవ్ చేయ‌డం, బ్యాక‌ప్ తీసుకోవ‌డం ఎలా?  

వాట్స‌ప్ యూజ‌ర్లు త‌మ చాటింగ్‌, మెసేజ్‌ల‌ను గూగుల్ డ్రైవ్‌లో బ్యాక‌ప్ తీసుకునే  సౌక‌ర్యం యూజ‌ర్లంద‌రికీ అందుబాటులోకి రానుంద‌ని కొన్నిరోజుల కింద‌ట న్యూస్ వ‌చ్చింది. అయితే  ఇప్పుడు ఆ ఫీచ‌ర్ వాట్స‌ప్‌లో అందుబాటులోకి వ‌చ్చేసింది. మీ వాట్స‌ప్ యాప్‌ను అప్‌డేట్ చేస్తే ఈ ఫీచ‌ర్ ను వాడుకోవ‌చ్చు.  ప్ర‌స్తుతానికి ఆండ్రాయిడ్ యూజ‌ర్ల‌కు మాత్రం అందుబాటులో ఉంది. త్వ‌ర‌లో ఐవోఎస్ యూజ‌ర్ల‌కు వ‌స్తుంది.  త్వ‌ర‌లో అప్‌డేట్ వ‌చ్చే అవ‌కాశం ఉంది కాబ‌ట్టి వాట్స‌ప్ యాప్‌ను అప్‌టుడేట్‌గా ఉంచుకోవాలి. 
బ్యాక‌ప్ అవ‌స‌ర‌మా?  
వాట్స‌ప్ చాట్‌లో ఇంపార్టెంట్ మెసేజ్ లు ఉండొచ్చు.  ఫొటోలు, వీడియోలు కూడా వాట్స‌ప్‌లో డిలీట్ చేస్తే డివైస్‌లో స్టోర్ చేసుకోవ‌చ్చు. కానీ అదంతా డివైస్ స్టోరేజీని నింపేస్తుంది.  అందుకే వాటిని గూగుల్ డ్రైవ్‌లో స్టోర్ చేసుకోవ‌చ్చు. దీంతో డివైస్‌లో స్టోరేజ్ మిగులుతుంది. సిస్టం కూడాస్పీడ్‌గా ర‌న్ అవుతుంది. స్టోర్ చేసిన స్ట‌ఫ్‌ను కావాలంటే త‌ర్వాత బ్యాక‌ప్ నుంచి  రీస్టోర్ చేసుకోవ‌చ్చు.  
బ్యాక‌ప్ ఎలా తీసుకోవాలి? 
 * వాట్స‌ప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి  Chats and Calls ను సెలెక్ట్ చేయాలి.
*  Chat Backupను టాప్ చేయండి 
* మీ జీమెయిల్ ఎకౌంట్ డిటెయిల్స్ ఇవ్వాలి.
* త‌ర్వాత గూగుల్ డ్రైవ్ బ్యాక‌ప్ లోకి వెళ్లి మీ డేటా ఎన్నాళ్లకోసారి స్టోర్ చేయాలో కింద ఉన్న ఆప్ష‌న్ల‌లో నుంచి  daily, weekly, monthly నుంచి సెలెక్ట్ చేసుకోవాలి.
* బ్యాక‌ప్ వైఫై తోనా వైఫై, మొబైల్ డేటా రెండింటితోనూ చేసుకోవ‌చ్చా అనే ఆప్ష‌న్‌ను సెల‌క్ట్ చేసుకోవాలి.
*  వీడియోస్‌ను కూడా స్టోర్ చేయాలా లేదా కూడా ఆప్ష‌న్ ఉంది.
రీ స్టోర్ ఎలా? 
.మీరు కొత్త డివైస్‌లో మీ వాట్స‌ప్ స్టోరేజ్‌ను బ్యాక‌ప్ తీసి రీస్టోర్ చేసుకోవ‌చ్చు. 
* ముందుగా కొత్త డివైస్‌లో వాట్స‌ప్ ఇన్‌స్టాల్ చేయాలి. 
* మీ నెంబ‌ర్ వెరిఫై చేసుకుని మెయిల్ ఐడీ ఎంట‌ర్ చేయాలి.
* ఇది క‌న్‌ఫం కాగానే యాప్ లోక‌ల్ బ్యాక‌ప్ నుంచి రీస్టోర్ చేయాలా?  గూగుల్ డ్రైవ్ నుంచి బ్యాక‌ప్ తీసుకోవాలా అనే ఆప్ష‌న్ వ‌స్తుంది.
* డ్రైవ్ ఆప్ష‌న్ సెల‌క్ట్ చేస్తే మీ గూగుల్ డ్రైవ్‌లో మీరు స్టోర్ చేసుకున్న వాట్స‌స్ బ్యాక‌ప్‌లోని  మెసేజ్‌ల‌న్నీ రీస్టోర్ అవుతాయి. త‌ర్వాత మీడియా మొత్తం బ్యాక్‌గ్రౌండ్‌లో రీస్టోర్ అవుతుంది.  

జన రంజకమైన వార్తలు

విజ్ఞానం బార్ విశేషాలు