• తాజా వార్తలు

వాట్సాప్‌లో లేనివి, ఇత‌ర మెసేజ్ యాప్స్‌లో ఉన్న 8 గొప్ప ఫీచ‌ర్లు తెలుసా?

గ‌త రెండేళ్ల‌లో మెసేజింగ్ యాప్స్‌లో వాట్సాప్ సృష్టించిన ప్ర‌భంజ‌నం అంతా ఇంతా కాదు. రోజుకు 100 కోట్ల మందికి పైగా దీన్ని ఉప‌యోగిస్తున్నారంటే  జ‌నాల్లో ఎంతగా రీచ్ అయిందో అర్ధ‌మ‌వుతుంది.  విశేష‌మేంటంటే  కాంపిటేష‌న్‌గా ఉన్న మెసేజ్ యాప్స్‌లో ఉన్న ఫీచ‌ర్లు చాలా వ‌ర‌కూ ఇప్ప‌టికీ వాట్సాప్‌లో లేవు.  అవేంటో చూడండి

1)స్టిక్క‌ర్లు 

వాట్సాప్ క్లిక్క‌వ‌డానికి ప్ర‌ధాన కార‌ణం ఎమోటికాన్సే. చ‌దువురాని వాళ్లు కూడా త‌మ ఫీలింగ్స్‌ను వీటిద్వారా షేర్ చేసుకోగ‌లుగుతున్నారు.  అయితే ఫేస్‌బుక్ మెసెంజ‌ర్‌, వైబ‌ర్‌,  హైక్ లాంటి ఇత‌ర మెసేజింగ్ యాప్స్‌లో ఇప్ప‌టికే ఎమెటికాన్స్ ప్లేస్‌లో స్టిక్క‌ర్స్ హ‌వా న‌డుస్తోంది. చాటింగ్‌ను ఇంట్ర‌స్టింగ్‌గా మార్చే ఈ ఫీచ‌ర్ ఇప్ప‌టికీ వాట్సాప్‌లో లేదు.  

2)జిఫ్ సెల్ఫీ ( GIF Selfie)

సెల్ఫీ కెమెరాల‌తో  షార్ట్ వీడియోస్ షూట్ చేసి జిఫ్‌గా క్రియేట్ చేయొచ్చు. ఈ ఫీచ‌ర్ గూగుల్ అల్లోలో ఇప్ప‌టికే ఉంది. కానీ వాట్సాప్‌లో లేదు. 

3)ప్రైవేట్ చాట్స్ (Private chats)

ప‌ర్స‌న‌ల్ విష‌యాలే కాదు ఏదైనా సీక్రెట్ చాటింగ్ చేసుకోవ‌డానికి లైన్‌, వీచాట్‌, గూగుల్ అల్లో వంటి  మెసేజింగ్ యాప్స్ Incognito లేదా Private chat modeతో వ‌చ్చేశాయి. దీంతో మీ చాట్‌ను సేఫ్‌గా, ప్రైవేట్‌గా ఉంచుకోవ‌చ్చు. మీరు చ‌దివాక మెసేజ్ ఆటోమేటిగ్గా యాప్ నుంచి డిలీట్ అయిపోతుంది. యూజ‌ర్లు కావాలంటే టైం సెట్ చేసుకుని  ఆ టైమ్‌కు మెసేజ్ డిలీట్ అయ్యేలా సెట్ చేసుకోవ‌చ్చు. వాట్సాప్‌లో ఈ  ఫీచ‌ర్ లేక‌పోవ‌డంతో ఎలాంటి చాట్‌న‌యినా ఎవ‌రికీ క‌న‌ప‌డ‌కుండా దాచ‌లేం. 

4)పోక్ ( Poke)

చాట్‌లో లేనివారిని కూడా ప‌ల‌క‌రించేందుకు పోక్ ఫీచ‌ర్ ఫేస్‌బుక్ వంటి యాప్స్‌లో అందుబాటులో ఉంది. పోక్ అనే ద‌గ్గ‌ర టాప్ చేస్తే మ‌నం వాళ్ల‌ను పోక్ చేసిన‌ట్లు (ప‌ల‌క‌రించిన‌ట్లు)గా మెసేజ్ వెళుతుంది. వాట్సాప్ లో ఇది లేదు. 

5)ఇన్ యాప్ వాలెట్ 

Hike  మెసెంజ‌ర్ త‌న యాప్‌లోనే వాలెట్ ను కూడా తీసుకొచ్చింది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంట‌ర్‌ఫేస్  (UPI) ద్వారా ఈ వాలెట్‌ను ఉప‌యోగించి బ్యాంక్ టు బ్యాంక్ మ‌నీ  ట్రాన్స్‌ఫ‌ర్ ఇన్‌స్టంట్‌గా చేసుకోవ‌చ్చు. అవ‌త‌లి ప‌ర్స‌న్‌ హైక్ మెసెంజ‌ర్‌లో లేక‌పోయినా ఈ ఫీచ‌ర్ ప‌నికొస్తుంది.  వాట్సాప్‌లో ఈ ఫీచ‌ర్ అందుబాటులోకి రావ‌డానికి చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి.

6)లైవ్ ఫిల్ట‌ర్స్ 

స్నాప్‌చాట్, ఇన్‌స్టాగ్రామ్‌లలో లైఫ్ ఫిల్ట‌ర్స్ బాగా పాపుల‌ర‌య్యాయి. మీరు ఫోన్‌లో తీసుకున్నిఇమేజ్‌కు డూడుల్ చేసి, టెక్స్ట్ లేదా ఎమోటికాన్స్ ఇన్‌స్టంట్‌గా యాడ్ చేసి పంపించుకోవ‌చ్చు.  వాట్సాప్‌లో ఈ ఫీచ‌ర్ అందుబాటులో లేదు.

7)ఆటో రిప్ల‌య్ ఆప్ష‌న్ 

వాట్సాప్‌లో లేని ఈ ఫీచ‌ర్ ఫేస్‌బుక్ మెసెంజ‌ర్, గూగుల్ అల్లోల్లో ఉంది.  మ‌నం మెసేజ్‌కు రిప్ల‌యి ఇవ్వ‌లేన‌ప్పుడు యాప్ ఆటోమేటిగ్గా దానికి రిప్ల‌యి ని జ‌న‌రేట్ చేస్తుంది. మ‌నం జ‌స్ట్ క్లిక్ చేస్తే సెండ్ అయిపోతుంది. 

8)1జీబీ వ‌ర‌కు ఫైల్స్ షేర్ చేయడం 

లైన్ యాప్‌లో 1జీబీ డేటాను ఈజీగా షేర్ చేయొచ్చు. వాట్సాప్‌లో ఈ ప‌రిస్థితి లేదు.  మొన్న‌టివ‌ర‌కు 16 ఎంబీ లిమిట్ ఉండేది. ఈ మ‌ధ్య‌న ఆండ్రాయిడ్‌కు 100 ఎంబీ, ఐవోఎస్లో అయితే 120 ఎంబీ వ‌ర‌కు షేర్ చేసుకునేలా కాస్త లిమిట్ పెంచారు. 

జన రంజకమైన వార్తలు